వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'ఫిన్ మెకానికా' అగస్టా ప్రత్యేకత ఏంటి?

By Srinivas
|
Google Oneindia TeluguNews

Importance of agusta helicopter
అగస్టా వెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్ల కుంభకోణం కేంద్రాన్ని కలవరపరుస్తున్న విషయం తెలిసిందే. రూ.3546 కోట్ల విలువైన 12 అగస్టా వెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్లను మన వివిఐపిల ప్రయాణం కోసం కొంటున్నారు. ఇందులో మూడు హెలికాప్టర్లు మన దేశానికి వచ్చాయి. మరో తొమ్మది రావాల్సి ఉంది. ఇదే సమయంలో కుంభకోణం బయటపడటంతో ప్రభుత్వం ఈ ఒప్పందాన్ని రద్దు చేయాలని నిర్ణయించింది.

అగస్టా వెస్ట్‌ల్యాండ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ అయింది. ఈ అగస్టకు ఉన్న ప్రత్యేకతలు ఎన్నో. హెలికాప్టర్ ధర భారీగా ఉంటుంది. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో మన ప్రభుత్వం కొన్న అగస్టా హెలికాప్టర్ రాష్ట్రానికి వచ్చే వరకు రూ.65 కోట్లు దాటిందట. ఇక కేంద్రం కొనేందుకు నిర్ణయించిన హై సెక్యూరిటీ అగస్టా హెలికాప్టర్‌ను విలువ దాదాపు రూ.300 కోట్ల వరకు ఉంటుంది. కేంద్రం కొనాలనుకున్న పన్నెండు హెలికాప్టర్లకు ఖర్చు రూ.3546.

ఈ అగస్టా హెలికాప్టర్‌ను పలు దేశాధినేతలు ఉపయోగిస్తారు. ఇటలీకి చెందిన ఫిన్ మెకానికా దీనిని తయారు చేస్తోంది. ప్రస్తుతం ఈ కంపెనీ నష్టాల్లో ఉంది. ఇది ప్రభుత్వం ఆధీనంలో నడుస్తుంటుంది. కాబట్టి ఫిన్ మెకానికా అధిపతిని ప్రభుత్వమే నియమిస్తుంది. ఇటలీ ప్రభుత్వానికి ఇందులో 30 శాతం వాటా ఉంది. ఈ కంపెనీ లాబియింగ్‌ను నమ్ముకుంది. దీంతో ఇటలీ ప్రభుత్వం దీనిని ప్రక్షాళన చేయాలని నిర్ణయించుకుంది. దీంతో అగస్టా కుంభకోణం బయటపడింది.

అగస్టా ముఖ్య ఉద్దేశం దేశాధినేతల ప్రయాణానికి ఉపయోగించడమే. పరిశోధన, సహాయక చర్యల్లోనూ వినియోగించవచ్చును. దీనికి మూడు ఇంజన్లు ఉంటాయి. ఈ హెలికాప్టర్ గంటకు 278 కిలో మీటర్ల వేగంతో వెళ్తుంది. ఒకేసారి 1058 కిలో మీటర్లు ప్రయాణించగల సామర్థ్యం. 5 గంటలా 10 నిమిషాలు ఆగకుండా వెళ్లగలదు. దీని సీటింగ్ సామర్థ్యం 30. నాలుగు ఇంధన ట్యాంకులు ఉంటాయి. ఇందులో 4.94 లీటర్ల ఫ్యూయల్ పడుతుంది.

పదిహేను వేల కిలోలకు పైగా బరువును మోయగలదు. పదిహేను వేల నుండి పద్దెనిమిది వేల అడుగుల ఎత్తుకు ప్రయాణిస్తుంది. ప్రమాదాలను నివారించేలా అత్యాధునిక ఎలక్ట్రానిక్ పరికరాలు, క్యాబిన్, కాక్‌పిట్, సీట్లకు భద్రత తదితరాలు ఉంటాయి. ప్రమాద సమయాల్లో ఇంజన్ ట్యాంకులు వాటంతటవే మూసుకుంటాయి. దీంతో ప్రమాదం జరిగినా మంటలు చెలరేగవు. దాదాపు 23 మీటర్ల పొడుగు ఉంటుంది.

English summary

 Importance of agusta helicopter
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X