వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్పాట్ ఫిక్సింగ్: ఎవరేం చేస్తున్నారు? (ఫొటోలు)

By Pratap
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఐపియల్ స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారం దేశాన్నే కాదు, ప్రపంచాన్నే కుదిపేసింది. అదో సంచలనంగా మారింది. ఈ సంఘటన వెలుగు చూసి రెండు నెలలు దాటింది. స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంలో అనూహ్యంగా రాజస్థాన్ రాయల్స్ జట్టుకు చెందిన బౌలర్లు శ్రీశాంత్, అజిత్ చండిల, అంకిత్ చవాన్‌లను పోలీసులు అరెస్టు చేశారు. రాజస్థాన్ రాయల్స్ జట్టు కెప్టెన్ రాహుల్ ద్రావిడ్‌ను పోలీసులు విచారించారు.

రాహుల్ ద్రావిడ్‌ను స్పాట్ ఫిక్సింగ్ కేసులో ప్రాసిక్యూషన్ సాక్షిగా చేర్చే అవకాశాలున్నట్లు వార్తలు వస్తున్నాయి. స్పాట్ ఫిక్సింగ్ వైరస్ బుకీల నుంచి క్రికెటర్లకు, సెలిబ్రిటీలకు, అండర్ వరల్డ్ డాన్‌ల వరకు పాకింది. ఈ వ్యవహారం చూసి ప్రపంచం విస్తుపోయింది. ముంబై, ఢిల్లీ పోలీసుల విచారణలు, అరెస్టులు, కోర్టులు, బెయిల్ వంటి సంఘటనలు సంచలనాలు సృష్టించాయి.

స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కుంటున్న 19 మందిపై మోకా చట్టాన్ని మోపడాన్ని తప్పుపట్టిన ఢిల్లీ హైకో ర్టు వారికి బెయిలు మంజూరు చేసింది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మాజీ ప్రిన్సిపాల్ గురునాథ్ మేయప్పన్, రాజస్థాన్ రాయల్స్ సహ యజమానులు రాజ్ కుం ద్రా-శిల్పా శెట్టి, బాలీవుడ్ నటుడు విందూ దారాసింగ్ బెయిల్‌పై విడుదలయ్యారు.

బయటకు రాని చండిల

స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంలో కీలక పాత్ర పోషించాడని భావిస్తున్న రాజస్థాన్ రాయల్స్ మాజీ క్రికెటర్ అజిత్ చండిల ఇంకా కటకటాల వెనకే ఉన్నాడు. అతనితో పాటు బుకీలు రమేష్ వ్యాస్, దీపక్ కుమార్, అశ్విని, సునీల్ భాటియా, ఫరీద్ అన్సా రీ, జితేంద్ర కుమార్, మాజీ రంజీ ఆటగాడు బాబూరావు యాదవ్‌లకు కూడా బెయిల్ లభించలేదు.

శ్రీశాంత్ గుడులూ గోపురాలు తిరిగాడు

పేసర్ శ్రీశాంత్ 27 రోజులు పాటు జైలులో గడిపాడు. జైలు నుంచి బెయిల్ మీద విడుదలైన తర్వాత గుడులూ గోపురాలు తిరిగాడు. ప్రస్తుతం వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్న శ్రీ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. ఓ మలయాళీ చిత్రంలో నటించేందుకు అతను ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు కూడా చెబుతున్నారు.

కుటుంబ సభ్యులతో చవాన్

కేసు విచారణలో ఉండగానే తాత్కాలిక బెయిలుపై విదుదలై అంకిత్ చవాన్ తన ప్రేయసిని పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం అతను కుటుంబ సభ్యులతో గడుపుతున్నాడు. పెళ్లి తర్వాతలొంగిపోయిన చవాన్‌కు శ్రీశాంత్‌తో పాటు జూన్ 10న కోర్టు బెయిలు మంజూరు చేసింది.

గురునాథ్ బిజీ బిజీ

బెట్టింగ్ కేసులో అరెస్టయిన చెన్నై సూపర్ కింగ్స్‌కు చెందిన గురునాథ్ మేయప్పన్ ప్రస్తుతం బిజీగా ఉన్నాడు. అతని కారణంగా అతని మామ, బిసిసిఐ అధ్యక్షుడు ఎన్ శ్రీనివాసన్ చిక్కుల్లో పడ్డారు. తాత్కాలిక అధ్యక్షుడిగా దాల్మియాను నియమించే దాకా వ్యవహారాలు నడిచాయి. మే 25వ తేదీన అరెస్టయిన గురునాథ్‌కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంలో అతనికి సంబంధం లేదని పోలీసులు తేల్చారు.

విందూ మీడియాకు చిక్కకుండా..

గురునాథ్ కోసం బాలీవుడ్ నటుడు విందూ దారా సింగ్ బెట్టింగ్‌లు నిర్వహించేవాడని తేలింది. దీంతో అతన్ని పోలీసులు అరెస్టు చేశారు. అయితే గురునాథ్‌తో పాటు జూన్ 4న బెయిలుపై విడుదలయ్యారు. మీడియాకు చిక్కకుండా విందూ బిజీగా తిరుగుతున్నాడు.

కుంద్రా, శిల్పా విదేశీ పర్యటన ఏర్పాట్లు

ఐపీఎల్‌లో సొంత జట్టు తరఫున బెట్టింగ్‌కు పాల్పడ్డారన్న వార్తలు గుప్పుమనడంతో రాజస్థాన్ రాయల్స్ సహ యజమానులు రాజ్ కుంద్రా అతని భార్య, బాలీవుడ్ నటి శిల్పాశెట్టి కష్టాల్లో పడ్డారు. ప్రస్తుతం ఈ జంట పోర్చుగల్ పర్యటనకు వెళ్లాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

ధోనీ భార్య సాక్షి

విందూతో భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ భార్య సాక్షి సంబంధాలపై దుమారమే చెలరేగింది. వివాదం ధోనీకి కూడా చుట్టుకునే పరిస్థితి వచ్చింది. అయితే, ఐసిసి చాంపియన్స్ ట్రోఫీలో, సెల్‌కాన్ మొబైల్ కప్ టోర్నీలో భారత్ విజయంతో ధోనీపై నీలినీడలు తొలగిపోయినట్లే ఉన్నాయి.

దావూద్ సంభాషణలు కోర్టుకు..

ఇదిలావుంటే, ఐపీఎల్‌లో స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డ బుకీలకూ అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకూ మధ్య సాగిన ఫోన్ సంభాషణల ఆడియో టేపులను ఢిల్లీ పోలీసులు మంగళవారం కోర్టుకు సమర్పించారు. చండీలాతో పాటు మరో ఏడుగురు పెట్టుకున్న బెయిలు పిటిషన్‌పై అభ్యంతరాలు వ్యక్తం చేసిన ఢిల్లీ పోలీసులు బుకీ జావెద్ చౌతాని, దావూద్ ఇబ్రహీం మధ్య జరిగిన ఫోన్ సంభాషణలను కోర్టు ముందుంచారు. ఢిల్లీ పోలీసుల వాదన విన్న కోర్టు చండీలాతోపాటు ఏడుగురు బుకీల రిమాండ్‌ను ఈ నెల 30 వరకు పొడిగించింది.

కాగా, జావెద్ అనే బుకీతో దావూద్ రూ. 80 లక్షల ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్టు వెల్లడైంది. పాక్ నుంచి భారత్‌కు, భారత్ నుంచి పాకిస్థాన్‌కు హవాలా ద్వారా డబ్బు తరలింపు విషయాన్ని అశ్విన్, సునీల్ అనే ఇద్దరు బుకీలు ఫోన్‌లో మాట్లాడుకున్నట్టు కూడా ఈ టేపుల ద్వారా వెల్లడైంది.

English summary
Police have submitted evidences on links with Dawood Ibrahim in IPL spot fixing case. The accused like Sreeshanth, Vinddoo and others released on bail are busy in their activities.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X