వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రపంచ కప్: పాక్ మహిళా క్రికెటర్లకు అవమానమా?

By Pratap
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఐసిసి 2013 మహిళా ప్రపంచ కప్ పోటీల్లో పాల్గొనడానికి వచ్చిన పాకిస్తాన్ మహిళా క్రికెటర్లు అవమానానికి గురవుతున్నారు. బెదిరింపుల నేపథ్యంలో పాకిస్తాన్ మహిళా క్రికెటర్లకు స్టార్ హోటళ్లు వసతి కల్పించడానికి నిరాకరించాయి. దీంతో వారికి మైదానంలోనే వసతి కల్పించారు. బిసిసిఐకి ఐసిసి అందుకు అనుమతి ఇచ్చింది. ఈ విషయంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) మౌనం వహించినా, మాజీ క్రికెటర్లు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పాకిస్తాన్, భారత్ సంబంధాలు, ఐసిసి పాత్ర మహిళా ప్రపంచ కప్ పోటీలు విషాదకరమైన పరిస్థితిని తలపిస్తున్నాయని పాకిస్తాన్ మాజీ లెగ్ స్పిన్నర్ అబ్దుల్ ఖాదిర్ అన్నారు. ఇరు దేశాల మధ్య క్రికెట్ సంబంధాలు మెరుగుపడాలని తాను ఆశిస్తున్నానని, రాజకీయాలకు క్రీడలను దూరంగా ఉంచాల్సిన అవసరాన్ని భారత రాజకీయ పార్టీలు గుర్తించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.

తమ దేశ మహిళా క్రికెటర్లకు ఎదురైన అనుభవం తీవ్ర అసంతృప్తికి గురి చేసిందిని పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ అన్నారు. ప్రపంచ కప్ పోటీల్లో పాల్గొంటున్న అన్ని జట్ల భద్రతకు భారత్ గ్యారంటీ ఇవ్వనప్పుడు ఐసిసి పోటీలను మరో దేశానికి ఎందుకు మార్చలేదని ఆయన అన్నారు. మొత్తం వ్యవహారంలో ఐసిసి పాత్ర బిసిసిఐ మాదిరిగానే తీవ్ర అసంతృప్తికి గురి చేసిందని ఆయన అన్నారు. ఆ విధమైన ఒత్తిడిలో, భద్రతాలోపంతో పోటీల్లో పాకిస్తాన్ మహిళలు ఉత్తమంగా ఎలా ఆడగలరని ప్రశ్నించారు.

Latif hits out at BCCI for housing team at stadium

పాకిస్తాన్ క్రికెటర్లు ఇటీవలే భారత్‌లో పర్యటించినప్పుడు ఏ విధమైన సమస్య తలెత్తలేదని, ఇప్పుడు మహిళా క్రికెటర్లకు ఆ విధమైన సమస్య ఎదురుకావడం విడ్డూరమని పాకిస్తాన్ మాజీ కెప్టెన్ మొయిన్ ఖాన్ అన్నారు. క్రీడలను, రాజకీయాలను కలిపి కలగాపులగం చేయడం విచారకరమని అన్నారు. సంప్రదాయబద్దమైన గౌరవమర్యాదలకు భారతీయులు ప్రాముఖ్యం ఇస్తారని అంటూ తమ మహిళా క్రికెటర్లకు భద్రతను గ్యారంటీ ఇవ్వలేనంత బలహీనంగా ప్రభుత్వం, బోర్డు ఉందా అని అడిగారు. మహిళా ప్రపంచ కప్ పోటీలను దక్షిణాఫ్రికాకు మార్చాలని పిసిబి చైర్మన్ జాకా అష్రాప్ ఐసిసిని కోరారు.

మాకేం ఇబ్బంది లేదు: మహిళా క్రికెటర్లు

కటక్‌లోని బారాబతి మైదానంలో తమకు వసతి కల్పించడంపై పాకిస్తాన్ మహిళా క్రికెటర్లు ఏ విధమైన ఫిర్యాదు కూడా చేయడం లేదు. తాము ఆడే మ్యాచులన్నీ ఈ మైదానంలోనే జరుగుతాయని తాము భావిస్తున్నట్లు పాకిస్తాన్ మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ సానా మీర్ అన్నారు. తమకు 2 స్టార్, 3 స్టార్, 4 స్టార్ హోటళ్లలో బస ఏర్పాటు చేసినా ఫరవాలేదని, తాము క్రికెట్ ఆడడానికి మాత్రమే ఇక్కడికి వచ్చామని ఆమె మీడియాతో అన్నారు. బారాబతి స్టేడియం పాకిస్తాన్‌లోని తమ మైదానాల మాదిరిగానే భావిస్తున్నట్లు తెలిపారు.

పాకిస్తాన్ మహిళా జట్టు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికాలతో జరిగే మ్యాచులను అన్నింటినీ బారాబతి మైదానంలోనే ఎదుర్కుంటుంది. మహిళా క్రికెటర్ల భద్రతకు 1500 మంది సిబ్బందిని నియోగించారు. పాకిస్తాన్ జట్టు ప్రాక్టీస్ మ్యాచులో ఒడిషా ఎలెవన్ జట్టును 95 పరుగుల తేడాతో ఓడించింది. సంఘ్ పరివార్, ఇతర సంస్థల హెచ్చరికలు ప్రాక్టీస్ మ్యాచుపై ఏ విధమైన ప్రభావం చూపలేదని దీన్ని బట్టి అర్థమవుతోంది.

English summary
Pakistan Cricket Board has remained silent on the decision by International Cricket Council to allow the organizers of the Women's World Cup in India to house the Pakistan team at a stadium instead of a hotel but former players have lashed out at the ICC and the BCCI for this development.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X