వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పిక్చర్స్: ముజఫర్‌నగర్ ఇలా అట్టుడికింది

By Pratap
|
Google Oneindia TeluguNews

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్, దాని పరిసర ప్రాంతాలు అల్లర్లతో అట్టుడుకుతున్నాయి. ఈ అల్లర్లలో మృతుల సంఖ్య 31కి చేరుకుంది. ముజఫర్‌నగర్, దాని పరిసర ప్రాంతాల్లో చెలరేగిన అల్లర్లలో 31 మంది మరణించారని హోంశాఖ ముఖ్య కార్యదర్శి ఆర్ఎం శ్రీవాస్తవ చెప్పారు.

ముజఫర్‌నగర్ జిల్లాలోని మీరాపూర్ పట్టణంలో సోమవారం ఓ వ్యక్తిని కత్తులతో పొడిచి చంపారని జిల్లా మెజిస్ట్రేట్ కషాల్ రాజ్ శర్మ చెప్పారు. కత్తిపోటు సంఘటనలో ఓ వ్యక్తి మరణించగా, మరో వ్యక్తి గాయపడినట్లు ఆయన తెలిపారు. కాగా, ఆరుగురు వ్యక్తులను అల్లర్లకు సంబంధించి అదుపులోకి తీసుకున్నారు.

నకిలీ వీడియోను పంపిణీ చేసి ముజఫర్‌నగర్‌లో అల్లర్లకు కారణమయ్యారనే ఆరోపణపై ఓ బిజెపి శాసనసభ్యుడిపై కేసు నమోదు చేశారు. ఆ వీడియోను పంపిణీ చేశారనే ఆరోపణలు ఎదర్కుంటున్న 200 మందిలో బిజెపి ఎమ్మెల్యే సంగీత్ సోమ్ కూడా ఉన్నారు. అయితే, సోమ్ అరెస్టును తప్పించుకుంటున్నారు.

ముజఫర్‌నగర్‌లో కర్ఫ్యూ

ముజఫర్‌నగర్‌లో కర్ఫ్యూ

ముజఫర్‌నగర్‌లో అల్లర్ల నేపథ్యంలో కర్ఫ్యూ విధించారు. పోలీసులకు ఉన్నతాధికారులు కఠినమైన ఆదేశాలు జారీ చేశారు. పరిస్థితిని అదుపులోకి తేవడానికి పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.

ముజఫర్‌నగర్ అల్లర్లు..

ముజఫర్‌నగర్ అల్లర్లు..

అల్లర్లలో గాయపడినవారు కొంత మంది ముజఫర్‌నగర్ జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అల్లర్లు జరిగిన నేపథ్యంలో ముజఫర్‌నగర్‌లో కర్ఫ్యూ విధించారు.

పోలీసుల గస్తీ..

పోలీసుల గస్తీ..

అల్లర్ల నేపథ్యంలో ముజఫర్‌నగర్‌లో కర్ఫ్యూ విధించారు. ఈ సందర్బంగా అవాంఛనీయమైన సంఘటనలను నిరోధించాడనికి పోలీసులు గస్తీ తిరిగారు.

ముజఫర్‌నగర్‌లో సైన్యం..

ముజఫర్‌నగర్‌లో సైన్యం..

అల్లర్ల నేపథ్యంలో ఆదివారంనాడు ముజఫర్‌నగర్‌లోకి సైన్యం దిగింది. అల్లర్లు పెచ్చరిల్లకుండా సైన్యం నత్యం అప్రమత్తంగా ఉంటోంది.

ముజఫర్‌నగర్‌లో అప్రమత్తత

ముజఫర్‌నగర్‌లో అప్రమత్తత

కర్ఫ్యూ విధించిన ముజఫర్‌నగర్ ప్రాంతాల్లో సైన్యం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. అల్లర్లను అదుపు చేయడానికి శాయశక్తులా కృషి చేస్తోంది.

గుంపు నిరసన..

గుంపు నిరసన..

ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో నిరసన వ్యక్తం చేస్తూ ఓ గుంపు ఇలా... ముజఫర్‌నగర్ అల్లర్లలో ఇప్పటి వరకు మృతి చెందినవారి సంఖ్య 31కి చేరుకుంది.

పిల్లలూ బాధితులే..

పిల్లలూ బాధితులే..

పాపం పుణ్యం ప్రపంచ మార్గం తెలియని పిల్లలు కూడా మత ఘర్షణలకు బాధితులుగా మారారు. గాయపడిన పిల్లలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇలా..

English summary

 
 The toll in the violence in Muzaffarnagar and adjoining areas has climbed to 31. Principal Secretary Home R M Srivastava was quoted as saying, "The death toll in the violence in Muzaffarnagar and other areas has climbed to 31."
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X