వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముగ్గురు ఫూల్ చేశారిలా..: ఎప్పుడు, ఎక్కడ ఫిక్స్?

By Srinivas
|
Google Oneindia TeluguNews

Spot fixing: How they fooled us?
ముంబై: రాజస్థాన్ రాయల్స్ జట్టుకు చెందిన ముగ్గురు ఆటగాళ్లు స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో అరెస్టైన విషయం తెలిసిందే. ముగ్గురు బౌలర్లే కావడం గమనార్హం. ఎన్నో అంతర్జాతీయ మ్యాచులకు ఆడిన శ్రీశాంత్‌తో పాటు అజిత్ చండిలా, అంకిత్ చవాన్‌లను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. వారు ఏఏ మ్యాచులకు స్పాట్ ఫిక్సింగ్ చేసుకున్నారు, ఎలా చేసుకున్నారు అనే విషయాలను పోలీసులు వెల్లడించారు.

అజిత్ చండిలా

మే 5వ తేదిన రాజస్థాన్ రాయల్స్ జట్టు పుణే వారియర్స్‌తో తలపడింది. ఈ మ్యాచులో చండిలా స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడు. తాను రెండో ఓవర్లో 14 లేదా అంతకు ఎక్కువ పరుగులు ఇస్తానని బూకీలకు చెప్పాడు. అయితే, అతను సిగ్నల్ ఇవ్వకపోవడంతో బుకీలు బెట్ కట్టలేదు. దీంతో అతనికి అడ్వాన్సుగా ఇచ్చిన రూ.20 లక్షలను బుకీలు వెనక్కి తీసుకున్నారు. ఆ తర్వాత ఇవ్వాల్సిన రూ.20 లక్షలు కూడా ఇవ్వలేదు. చండిలా తన రెండో ఓవర్లో అనుకున్నట్లుగానే పరుగులు ఇచ్చాడు. కానీ సిగ్నల్ ఇవ్వని కారణంగా బుకీలు బెట్టు కట్టక పోవడంతో డబ్బులు వెనక్కి తీసుకున్నారు. షర్ట్ టక్ తీసి మళ్లీ టక్ చేస్తానని ముందుగా చండిలా బుకీలకు చెప్పాడు. కానీ, మర్చిపోయి అతను ఆ సిగ్నల్ ఇవ్వలేదు.

శ్రీశాంత్

కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచులో శ్రీశాంత్ స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడు. రెండో ఓవర్లో తాను పరుగులు ఇస్తానని చెప్పాడు. తన ట్రజల్‌లో టవల్ పెడతానని, అదే గుర్తు అని బుకీలకు చెప్పాడు. రెండో ఓవర్ వేసే సమయంలో బుకీలకు టవల్ ట్రౌజర్‌లో పెట్టి సిగ్నల్ ఇచ్చిన శ్రీశాంత్... కాసేపు ఎక్సైర్‌సైజ్‌లు చేసి వారికి ఎక్కువ బెట్టింగ్స్ పెట్టుకునే అవకాశం ఇచ్చాడు. రూ.40 లక్షలు శ్రీశాంత్‌కు ఇచ్చేందుకు బుకీలు అంగీకరించారు. ఈ ఓవర్‌లో 13 రన్స్ మాత్రమే వచ్చాయి.

అంకిత్ చవాన్

రెండు రోజుల క్రితం ముంబయి ఇండియన్స్‌తో జరిగిన మ్యాచులో అంకిత్ స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడు. ఈ మ్యాచులో చండిలా ఆడనప్పటికీ మధ్యవర్తిగా వ్యవహరించాడు. ఇందుకోసం అంకిత్‌కు రూ.60 లక్షలు ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది. రెండో ఓవర్లో పరుగులు ఇస్తానని చెప్పాడు. మొదటి ఓవర్ వేసిన అంకిత్ కేవలం రెండు పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఆ తర్వాత రెండో ఓవర్లో ఒప్పందం మేరకు మొదటి మూడు బంతుల్లోనే 14 పరుగులు ఇచ్చాడు. ఆ తర్వాత మూడు బంతులు కట్టుదిట్టంగా బౌల్ చేసి కేవలం ఒక రన్ మాత్రమే ఇచ్చాడు. ఇతను తన రిస్ట్ వాచ్ మార్చడాన్ని బుకీలకు సిగ్నల్‌గా పెట్టాడు.

English summary

 According to Delhi police commissioner Neeraj Kumar, there was an agreement between the bookies and the players that in a certain over they would give away a minimum amount of runs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X