వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

క్రెడిట్ కార్డుల ఫ్రాడ్: చెక్ పెట్టడం ఎలా?

By Pratap
|
Google Oneindia TeluguNews

To prevent Credit Card frauds
హైదరాబాద్: క్రెడిట్ కార్డుల ఫ్రాడ్ ఈ కాలంలో సర్వసాధారణంగా మారినట్లు కనిపిస్తోంది. ఎవరు ఎప్పుడైనా దానికి బలి కావచ్చు. రెండు నెలల్లో 30 కోట్ల రూపాయల క్రెడిట్ కార్డు ఫ్రాడ్ జరిగినట్లు ఇటీవల ఓ ఆంగ్ల దినపత్రిక ఓ వార్తాకథనాన్ని ప్రచురించింది. ఆ వార్తాకథనాన్ని చదివితే గుండె గుభేల్ అనక మానదు. మన డబ్బులు క్షేమంగా ఉన్నాయో, లేదే నిత్యం సందేహించే పరిస్థితి.

భారతదేశంలోని క్రెడిట్ కార్డును విదేశాల్లో కూడా గీకేసి కొట్టేసిన ఉదంతం అది. అలా ఎలా చేయగలిగారనేది ఓ మిస్టరీగానే చాలా మందికి అనిపిస్తూ ఉంటుంది. అంతర్జాతీయ స్థాయిలో డబ్బులు ఎటిఎంల నుంచి రాబట్టాలంటే క్రెడిట్ కార్డు వివరాలు ఉంటే సరిపోతుందట.

అవగాహన అవసరం..

మీ క్రెడిట్ కార్డుపై రెండు రకాల లావాదేవీలు జరపవచ్చుననే విషయాన్ని మీరు ముందుగా గ్రహించాలి. కార్డును ఇచ్చి జరిపే లావాదేవీలు ఒకటి. అంటే మాల్స్‌లో షాపింగ్ చేయడం, రెస్టారెంట్ బిల్లు చెల్లించడం వంటివి దీని కిందికి వస్తాయి. రెండోది కార్డు లేకుండానే లేదా ఇవ్వకుండానే లావాదేవీలు నిర్వహించడం. ఆన్‌లైన్ షాపింగ్ జరిపినప్పుడు అన్నమాట. అంటే, మీ కార్డును ఇతరులు రెండు రకాలుగా దుర్వ్వినియోగం చేసే అవకాశం ఉందన్నమాట. అంటే ఆన్‌లైన్, ఆఫ్ లైన్ ఫ్రాడ్‌కు అవకాశం ఉంది.

ఆన్‌లైన్ ట్రాన్స్‌యాక్షన్..

ఆన్‌లైన్ లావాదేవీల్లో మీ కార్డు దుర్వ్వినియోగం కాకుండా ఈ చిట్కాలను వాడితే మంచిది.

1. మీ కార్డును https అని ఉన్న వెబ్‌సైట్లలో మాత్రమే ట్రాన్స్‌యాక్షన్ చేయండి. s లేకుండా http మాత్రమే ఉన్న వెబ్‌సైట్ల ద్వారా లావాదేవీలు నిర్వహించకూడదు. s భద్రతను సూచిస్తుంది. అంటే సెక్యూర్డ్ అన్నమాట.

2. అడ్రస్ బార్‌లో లేదా స్క్రీన్ కుడి వైపు కింద లాక్ సైన్ పరిశీలించండి.

3. భారతదేశంలో ఆన్‌లైన్ లావాదేవీలు నిర్వహించడానికి కార్డు నెంబర్ వాడడంతో పాటు మరో రెండు మెట్లు ఉన్నాయి. కార్డు వెనక మూడంకెల సివివి, బ్యాంక్ ఇచ్చిన పాస్‌వర్డ్ ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. మీ కార్డు సర్వీస్ ప్రొవైడర్‌ను బట్టి వీసా, మాస్టర్ సెక్యూర్ కోడ్ వెరిఫై చేయడం ద్వారా సెక్యూర్డ్ పాస్‌వర్డ్ వాడడం. వెబ్‌సైట్ ఆథంటికేషన్‌ను అడగకపోతే ట్రాన్స్‌యాక్షన్ చేయకూడదు.

4. పేమెంటే గేట్‌వేస్ సైట్స్‌పై సెక్యూరిటీ సర్టిఫికెట్లను తనిఖీ చేయండి.

5. ఆన్‌లైన్ క్రెడిట్ కార్డును వాడడం మానేసి, వర్చ్వువల్ క్రెడిట్ కార్డును వాడండి. మీ ఫిజికల్ క్రెడిట్ కార్డుల ప్రాతిపదికపై జనరేట్ అయఇన 16 అంకెల కొత్త సంఖ్య మీ వర్చ్యువల్ కార్డుకు ఉంటుంది. మీకు సివివి2 నెంబర్, ఎక్స్‌పైరీ డేట్ వస్తుంది. ఒకేసారికి మాత్రమే నమోదయ్యే విధంగా వర్చ్యువల్ కార్డును జనరేట్ చేయవచ్చు. మీకు యూనిక్ లాగిన్, పాస్‌వర్డ్ లభిస్తాయి. వర్చ్యువల్ కార్డు ద్వారా వాడే డబ్బును కూడా స్పష్టంగా చెప్పవచ్చు. దానివల్ల మొత్తం ట్రాన్స్‌యాక్షన్‌కు మీ కార్డు ఎక్స్‌పోజ్ కాకుండా ఉంటుంది.

6. ప్రీ - పెయిడ్ కార్డులు లేదా ఈ - వాలెట్స్ మరో ప్రత్యామ్నాయం.

7. కొద్ది పాటి క్రెడిట్ పరిమితి గల మరో కార్డును తీసుకోవడం కూడా మంచిదే. దాన్ని ఆన్‌లైన్ ట్రాన్స్‌యాక్షన్స్‌కు వాడవచ్చు. దానివల్ల హై క్రెడిట్ లిమిట్ ఆన్‌లైన్‌కు అవకాశం లేకుండా పోతుంది.

ఆఫ్‌లైన్ లావాదేవీలు..

ఫిజికల్ కార్డు విషయంలో మీరు చేసేది చాలా తక్కువగా ఉంటుంది. మీరు ఓ రెస్టారెంట్‌లో మీల్స్ చేశారనుకోండి. కార్డును వెయిటర్‌కు ఇచ్చేస్తారు. మీకు దూరంగా అతను వెళ్లిపోయి ఇడిసి మిషన్ ఆకా స్వైప్ మిషన్‌పై గీకుతాడు. వెయిటర్ ఫ్రాడ్ చేసేవాడైతే మీకు తెలియకుండా కార్డును స్కిమ్మర్‌పై కూడా స్వైప్ చేస్తాడు. స్కిమ్మర్ మీ కార్డు వివరాలను పట్టుకుంటుంది. ఆ క్లోన్ కార్డును ఆన్‌లైన్ లేదా ఫిజికల్ ట్రాన్స్‌యాక్షన్ కోసం వాడడానికి వీలవుతుంది. ఈ ఫ్రాడ్ జరగకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

1. రెస్టారెంట్లలో బిల్లింగ్ ఏరియా వద్దకు వెళ్లి కార్డు నుంచి ఒక్క సెకండ్ కూడా దృష్టి మళ్లించకుండా చూడండి. ఇది సమస్యకు పరిష్కారం కాదు. ఫ్రాడ్ చేయాలనుకునేవాళ్లు కార్డు రీడర్‌కే స్కిమ్మర్‌ను జత చేస్తారు. కార్డు హోల్డర్ వివరాలను రాబట్టడానికి మోసగాళ్లు స్వైప్ మిషన్‌ను హ్యాక్ చేస్తారు. ఇటువంటి సందర్భాల్లో ఏమీ చేయలేం. ఫ్రాడ్ జరిగిందని అనుమానం వచ్చినప్పుడు బ్యాంక్‌కు ఫోన్ చేసి కార్డును బ్లాక్ చేయాలని అడగాలి. కొత్త కార్డు తీసుకోవాలి. అది కొన్ని వందల రూపాయల ఖర్చుతో అయిపోతుంది.

2. పర్మినెంట్ ఇంక్ మార్కర్‌తో సివివి నెంబర్‌ను బ్లాక్ చేయాలి. ఆ నెంబర్‌ను గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది. దానివల్ల కార్డు వివరాలు బయటకు పొక్కే అవకాశం లేదు.

3. చిప్ అండ్ పిన్ బేస్‌డ్ కార్డుకు మారడం మంచిది. కార్డు ముందు భాగంలో దానికి సిమ్ కార్డు వంటి చిప్ ఉంటుంది. నాలుగు అంకెల పిన్‌తో దాన్ని వాడవచ్చు. పిన్‌ను ఇడిసి మిషన్‌లో పంచ్ చేస్తే తప్ప కార్డు ద్వారా ట్రాన్స్‌యాక్షన్ జరగదు. చిప్ బేస్డ్ కార్డులో ఖాతా సమాచారం నిల్వ ఉంటుంది. ఎన్‌క్రిప్టెడ్ ఫార్మాట్‌లో అది సమాచారాన్ని నిలువ చేసి పెడుతుంది. ఈ సమాచారాన్ని స్కిమ్ చేయడం సాధ్యం కాదు.

దొంగల చేతికి క్రెడిట్ కార్డు సమాచారం తెలియకుండా జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా అవసరం. వివరాలు మనకు తెలిసి ఉంటే జాగ్రత్త పడడానికి వీలుంటుంది.

English summary
According to a Times of India report today, a global gang has skimmed Rs 30 crore off Indian credit card users in just two months. As per the report, numerous credit cards have been cloned by using skimmers and the card details have been used to make international online transactions.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X