• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

లండన్ 'రాయల్' గాసిప్ : సొంత వదినతోనే లింక్ పెట్టేశారు..!

|

లండన్ : అసలే సెలబ్రిటీలు.. వార్తలు రాసుకోవడానికి, గాసిప్స్ పుట్టించడానికి ఆ ఒక్క హోదా చాలదా..! సాధారణంగానే సెలబ్రిటీల లైఫ్ స్టైల్ పట్ల ఓ కన్నేసి ఉంచే మీడియా, ఇక ఏదైనా తేడా వ్యవహారం దొరికితే అంత సామాన్యంగా వదిలిపెడుతుందా..! విషయాన్ని పతాక శీర్షికల్లోకి ఎక్కించేసి హాట్ హాట్ గా అభిమానులకు వడ్డించేయదూ..

బ్రిటన్ మీడియా శైలి కూడా ఇప్పుడిదే వ్యవహారాన్ని తలపిస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనంతటికి కేంద్రబిందువుగా మారిన అంశం కేట్ మిడిల్టన్-హ్యారీల వ్యవహారం. తన సొంత వదిన అయిన కేట్ మిడిల్టన్ తో హ్యారీ పరిధి దాటి వ్యవహరిస్తున్నాడని, వీరిద్దరి మధ్య ఏదో ఉండబట్టే పబ్లిక్ మీటింగ్స్ లోను హ్యారీ, కేట్ తో చనువుగా వ్యవహరిస్తున్నాడనే గుసగుసలు ఇప్పుడు బ్రిటన్ అంతటా హాట్ టాపిక్ గా మారాయి.

అక్కడి మీడియాకు, సోషల్ మీడియాకు ఈ వార్త కావాల్సినంత సరంజామా ఇచ్చినట్టయింది. అయితే కేట్ హ్యారీ మధ్యన ఈ తరహా గాసిప్ కి కారణం హ్యారీ చేసే చిలిపి చేష్టలే అంటున్నారు. బ్రిటన్ రాచకుటుంబంలో ప్రిన్స్ చార్లెస్ డయానాల చిన్న కొడుకుగా హ్యారీ లైఫ్ స్టైల్ పట్ల అక్కడి యువతలో విపరీతమైన క్రేజ్ ఉంది. దీంతో అతడి కదలికలన్నింటిని నిశితంగా గమనిస్తుంది అక్కడి మీడియా.

ఇదే క్రమంలో తన అన్నా వదినలు విలియం-కేట్ మిడిల్డన్ లు పాల్గొనే ప్రతి కార్యక్రమంలో హ్యారీ పాల్గొనడం, ఆ క్రమంలో కేట్ తో హ్యారీ చనువుగా వ్యవహరిస్తూ.. ఆమెకు మాత్రమే వినపడేలా జోక్స్ పేల్చడం, ఆ జోక్స్ ని ఎంజాయ్ చేసే కేట్ విపరీతంగా నవ్వడం.. ఇవన్నీ వీరిద్దరి మధ్య వేరే ఏదో సంబంధం ఉందన్న గాసిప్స్ కి తెరలేపాయి. సోషల్ మీడియాలో చర్చలు, పత్రికల్లో కథనాలు వెలువడ్డాయి.

 25 Times Kate Middleton and Prince Harry Got a Kick Out of Each Other

అయితే బ్రిటన్ రాయల్ కుటుంబం మాత్రం ఈ గాసిప్స్ పట్ల తీవ్రంగా స్పందిస్తోంది. ఉన్నత స్థానంలో ఉన్న కుటుంబం కావడంతో కేట్ హ్యారీలపై ఇలాంటి చౌకబారు ఆరోపణలు కామనే అంటూ మీడియా రాతలను కొట్టిపారేస్తోంది. తాత ప్రిన్స్ ఫిలిప్ లాగే హ్యారీ కూడా హాస్యమంటే ఇష్టపడుతాడని, అందుకే ప్రతి ఒక్కరూ అతనంటే ఆసక్తి కనబరుస్తారని రాచకుటుంబ వర్గాలు అంటున్నాయి.

ఇదిలా ఉంటే, కేట్ హ్యారీ పట్ల గాసిప్స్ రోజురోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో.. పలు కార్యక్రమాల్లో దీనిపై స్పందిస్తూ వస్తోన్న హ్యారీ కేట్ ని చాలాసార్లు తన అక్క లాంటిదని సంబోధించారు. మరికొన్ని సార్లయితే కేట్ తనకు అమ్మతో సమానురాలని హ్యారీ పలుమార్లు వెల్లడించాడు. ఇంత స్పష్టంగా హ్యారీ వివరణ ఇచ్చిన తర్వాత కూడా నెటిజెన్స్, మీడియా, కేట్ హ్యారీ అనుబంధంపై ఇష్టం వచ్చినట్టుగా ఆరోపణలు చేయడం సబబేనా అని ప్రశ్నిస్తున్నారు రాయల్ కుటంబ సభ్యులు.

English summary
Although Kate Middleton has shared plenty of memorable moments with her other half, Prince William, over the years, she's also had some sweet and hilarious interactions with her brother-in-law, Prince Harry. He regularly has her laughing out loud when they attend events together, whether they're cracking up on the Buckingham Palace balcony or flashing big smiles in the stands.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more