హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సూరజ్‌కుండ్ మేళాలో తెలంగాణ థీమ్‌ స్టేట్

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: చారిత్రక, వారసత్వ, సాంస్కృతిక సంపదకు తెలంగాణ నిలయమని రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ చెప్పారు. 15రోజులపాటు జరుగునున్న సూరజ్ కుండ్ మేళాలో తెలంగాణ థీమ్ స్టేట్ కార్యక్రమాలను మంత్రి చందులాల్ సోమవారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూరజ్ కుండ్ మేళాలో తెలంగాణ కళా వైభవం ఉట్టిపడుతుందోన్నారు. తెలంగాణ ఏర్పాటుతో శతాబ్దాల చరిత్ర గల సాంస్కృతిక కళలను సూరజ్‌కుండ్ మేళా ద్వారా యావత్ దేశంతోపాటు 23 దేశాలకు తెలిపేందుకు అవకాశం దొరికిందన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై కేవలం పందొమ్మిది నెలలే అయినప్పటికీ, ఎన్నో రాష్ట్రాలతో పాటు ధీటుగా అభివృద్ధి చెందుతుందన్నారు. రాష్ట్రం ఏర్పడిన అతి తక్కువ కాలంలోనే మేళాలో థీమ్ స్టేట్‌గా తెలంగాణ ఎంపిక కావడం సంతోషకరమన్నారు.

సూరజ్ కుండ్ మేళాలో తెలంగాణ కళారూపాలకు జాతీయ స్థాయి గౌరవం దక్కిందన్నారు. అన్ని రంగాల్లో తెలంగాణ అభివృద్ధికి సీఎం కేసీఆర్ చేస్తున్న కృషితో పలు రాష్ర్టాలు తెలంగాణ వైపు చూస్తున్నాయన్నారు. హర్యానాలో ప్రతి ఏటా నిర్వహించే సూరజ్‌కుండ్ మేళా -2016ను తెలంగాణ ప్రధాన ఇతివృత్తంగా నిర్వహిస్తున్నారు.

 సూరజ్‌కుండ్ మేళాలో తెలంగాణ థీమ్‌ స్టేట్

సూరజ్‌కుండ్ మేళాలో తెలంగాణ థీమ్‌ స్టేట్

ఈ మేళాలో రాష్ట్ర పర్యాటకశాఖ సమాచార కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన టీ-హబ్ కార్యకలాపాలను వివరించే స్టాల్‌ను సందర్శించి.. మేళా ప్రాంగణంలో శాశ్వత ప్రాతిపదిక ఏర్పాటు చేసిన కాకతీయ కీర్తి తోరణం గేటును ప్రారంభించారు. అనంతరం తెలంగాణ రుచులను అందించడానికి రాష్ట్ర పర్యాటక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఫుడ్ కోర్టును కూడా ప్రారంభించారు.

 సూరజ్‌కుండ్ మేళాలో తెలంగాణ థీమ్‌ స్టేట్

సూరజ్‌కుండ్ మేళాలో తెలంగాణ థీమ్‌ స్టేట్

వీఐపీ ప్రవేశద్వారం నుంచి ఢిల్లీ గేట్, ఫరీదాబాద్ గేట్‌ల మీదుగా సాగే ఈ కార్నివాల్‌లో బోనాలు, బతుకమ్మ, ఒగ్గుడోలు, డప్పులు, లంబాడా-బంజారా నృత్యం, నాదస్వరం, గుస్సాడి తదితర సాంస్కృతిక రూపాలను ప్రదర్శిస్తూ కళాకారులు గంట పాటు ప్రాంగణం మొత్తం తిరుగుతారు.

 సూరజ్‌కుండ్ మేళాలో తెలంగాణ థీమ్‌ స్టేట్

సూరజ్‌కుండ్ మేళాలో తెలంగాణ థీమ్‌ స్టేట్

ఈ కళారూపాల ప్రదర్శనలను రాష్ట్ర సాంస్కృతిక శాఖ డైరెక్టర్ డాక్టర్ హరికృష్ణ పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటైన అప్నాఘర్‌ను సినీ నటుడు ధర్మేంద్ర ప్రారంభించారు. ఈ ఏర్పాట్ల గురించి రాష్ట్ర పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, కమిషనర్ సునీతా భగవత్ తదితరులు వివరించారు.

 సూరజ్‌కుండ్ మేళాలో తెలంగాణ థీమ్‌ స్టేట్

సూరజ్‌కుండ్ మేళాలో తెలంగాణ థీమ్‌ స్టేట్

ఈ కళారూపాల ప్రదర్శనలను రాష్ట్ర సాంస్కృతిక శాఖ డైరెక్టర్ డాక్టర్ హరికృష్ణ పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటైన అప్నాఘర్‌ను సినీ నటుడు ధర్మేంద్ర ప్రారంభించారు. ఈ ఏర్పాట్ల గురించి రాష్ట్ర పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, కమిషనర్ సునీతా భగవత్ తదితరులు వివరించారు.

 సూరజ్‌కుండ్ మేళాలో తెలంగాణ థీమ్‌ స్టేట్

సూరజ్‌కుండ్ మేళాలో తెలంగాణ థీమ్‌ స్టేట్

హర్యానా సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్, పర్యాటక మంత్రి రాంబిలాస్ శర్మ, రైల్వేశాఖ మంత్రి సురేశ్‌ప్రభు, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి మహేష్‌శర్మ తదితరులు సూరజ్‌కుండ్ మేళా ప్రాంగణంలోకి రాగానే తెలంగాణ మహిళలు తిలకం దిద్ది హారతితో స్వాగతం పలికారు. ఆదిలాబాద్ జిల్లా నిర్మల్‌కు చెందిన ఆర్ శ్రీనివాస్, ఎన్ లింబయ్య కుటుంబాలతో ముచ్చటించి.. ఆ కుటుంబాలకు జీవనాధారమైన నిర్మల్ చెక్క బొమ్మల తయారీ, నిర్మల్ పెయింటింగ్‌లను పరిశీలించారు.

 సూరజ్‌కుండ్ మేళాలో తెలంగాణ థీమ్‌ స్టేట్

సూరజ్‌కుండ్ మేళాలో తెలంగాణ థీమ్‌ స్టేట్

మేళా ప్రాంభమైన తర్వాత ప్రధాన వేదిక (చౌపల్)పై తెలంగాణ కళాకారులు ప్రదర్శించిన డప్పు నృత్యం, చిందు యక్షగానం, బోనాలు, లంబాడా - బంజారా, ఒగ్గుడోలు, గుస్సాడి నృత్యాలను కేంద్ర మంత్రులు, హర్యానా సీఎం, రాష్ట్ర మంత్రి చందూలాల్ తదితరులు తిలకించారు.

 సూరజ్‌కుండ్ మేళాలో తెలంగాణ థీమ్‌ స్టేట్

సూరజ్‌కుండ్ మేళాలో తెలంగాణ థీమ్‌ స్టేట్

తెలంగాణ కళా రూపాలు ఆకట్టుకునే విధంగా ఉన్నాయని ప్రశంసించిన హర్యానా సీఎం మనోహర్‌లాల్‌ఖట్టర్.. రాష్ట్ర మంత్రి చందూలాల్‌కు జ్ఞాపికను అందజేశారు. ప్రధాన వేదికపై త్రీ-డీ డిజైన్‌లో నెలకొల్పిన గోల్కొండబ్యాక్ డ్రాపు సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంది.

 సూరజ్‌కుండ్ మేళాలో తెలంగాణ థీమ్‌ స్టేట్

సూరజ్‌కుండ్ మేళాలో తెలంగాణ థీమ్‌ స్టేట్

తెలంగాణ తరఫున ఏర్పాటైన 60 స్టాళ్ళ గురించీ, ప్రాంగణంలో ఏర్పాటు చేసిన డీర్‌పార్క్ గేట్, రాష్ట్ర చిహ్నాలతో నెలకొల్పిన గేట్ తదితరాలను నిర్వాహకులు చూపారు. పోచంపల్లి నేత, పట్టు చీరలు ఏ విధంగా తయారవుతాయో స్వయంగా ఒక మగ్గం ద్వారా తయారవుతున్న విధానాన్ని స్వయంగా తెలుసుకున్నారు.

English summary
The 30th edition of the annual Surajkund international crafts fair begun on Monday with artists from over 20 countries participating in the cultural extravaganza.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X