వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాక్: 11ఏళ్లలో 50శాతం పెరిగిన డయాబెటీస్ మరణాలు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: డయాబెటీస్ ఇటీవల కాలంలో మనదేశంలో విస్తృతంగా తన ప్రభావాన్ని చూపిస్తున్న ప్రబలమైన వ్యాధి. ఈ వ్యాధి సోకిన వారి జీవితం పూర్తిగా మారిపోవాల్సిందే. అంతేకాదు, మనదేశంలో డయాబెటీస్ వ్యాధి సోకిన వారిలో ఎక్కువమంది ప్రాణాలు సైతం పోగొట్టుకుంటున్నారు.

2005-2015 మధ్య కాలంలో 50మంది డయాబెటీస్ కారణంగానే మరణించడం గమనార్హం. గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్(జీడీబీ) ప్రచురించిన డేటా ప్రకారం.. మరణాలకు దారితీసే వ్యాధుల్లో డయాబెటీస్‌ది 7వ స్థానంగా ఉంది. 2005లో ఇది 11వ స్థానంలో ఉండేది.

ఇస్కీమిక్ హార్ట్ డిసీజ్ కారణంగా ఎక్కువ మరణాలు సంభవిస్తుండటంతో ఆ వ్యాధి అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో క్రోనిక్ అబ్ స్ట్రక్టివ్ పాల్మనరీ డిసీజ్, సెరిబ్రోవస్కూలర్ డిసీజ్, లోయర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్, డియర్హేల్ డిసీజ్, టర్బర్కూలోసిస్ ఉన్నాయి.

2015లో 3,46,000మంది ప్రజలు డయాబెటీస్ వ్యాధి బారిన పడగా, ఇందులో 3.3శాతం మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. 1990 నుంచి ఈఏడాది 2.7శాతం వార్షిక మరణాల సంఖ్య పెరిగింది. ప్రతీ లక్ష జనాభాలో 26మంది ప్రజలు డయాబెటీస్ వ్యాధితో బాధపడుతున్నారు. 2.4శాతం డయాబెటీస్ వ్యాధితో అంగవైకల్యం కూడా కలిగే అవకాశం ఉంది. మరణం నుంచి తప్పించేందుకు వారిని అంగవికలురని చేయాల్సిన పరస్థితి ఏర్పడింది.

50% Rise In Diabetes Deaths Across India Over 11 Years

భారతదేశంలో సుమారు 69.1మిలియన్ల ప్రజలు డయాబెటీస్ వ్యాధితో బాధపడుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే చైనా(109మిలియన్లు) తర్వాత మనదేశం రెండో స్థానంలో ఉంది. ది ఇంటర్నేషనల్ డయాబెటీస్ ఫెడరేషన్(ఐడీఎఫ్) 2015లో విడుదల చేసిన డయాబెటీస్ అట్లాస్‌ ప్రకారం 36మిలియన్ల మంది ప్రజలకు ఈ వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ కాలేదు.

20-79ఏళ్ల మధ్య వయస్కుల్లో 9శాతం డయాబెటీస్‌తో బాధపడుతున్నారు. డయాబెటీస్ వ్యాధి పాంక్రీస్ పై ప్రభావం చూపడంతోపాటు ఇన్సూలిన్ విడుదల చేసి మొత్తం శరీరాన్ని కూడా పాడు చేయగలదు. డయాబెటీస్ కారణంగా.. గుండె సంబంధిత రోగాలు, గుండెపోటు, కిడ్నీ ఫెయిల్యూర్, కంటి చూపు కోల్పోవడం, న్యూరోపతి, నర్వ్ డ్యామేజీ మొదలగు వ్యాధులు వచ్చే అవకాశాలున్నాయి.

అయితే, ఇతర దేశాల్లో మాత్రం 60ఏళ్లకు పైబడిన వారిలోనే డయాబెటీస్ కనిపిస్తోంది. 40-59ఏళ్లలోపే మనదేశంలోని ప్రజలకు డయాబెటీస్ ఎక్కువగా వస్తోంది. ఇది జనాభా పెరుగుదలపైనా ప్రభావం చూపిస్తోంది.

'ప్రపంచం కంటే ముందే డయాబెటీస్‌ను మనదేశంలో దాడి చేసింది' అని
ఫోర్టీస్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఫర్ డయాబెటీస్, మెటబాలిక్ డిసీజ్ అండ్ ఎండోకోరినాలజీ, న్యూఢిల్లీ ఛైర్మన్ అనూప్ మిశ్రా తెలిపారు. డయాబెటీస్ ను పారద్రోలవచ్చునని, అందుకు తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది. తీవ్రమైన పని ఒత్తిడి కూడా డయాబెటీస్‌కు దారితీయవచ్చని తెలిపారు.

డయాబెటీస్

సామాజిక, జన్యు పరమైన అంశాల ద్వారా భారతీయులు డయాబెటీస్ వ్యాధి బారిన పడుతున్నారు. ఆసియన్ ఇండియన్ ఫెనోటైప్ సాధారణంగా శరీరభాగాల్లో ఫ్యాట్ చేరడం వల్ల డయాబెటీస్‌కు దగ్గరవుతున్నారు. డయాబెటీస్ సోకిన వారు ఖచ్చితంగా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆహారం విషయంలో మరింతగా జాగ్రత్తగా ఉండాలి. డైట్ పాటించాల్సి ఉంటుంది. పర్యావరణ పరిస్థితులు కూడా డయాబెటీస్ కు దారితీస్తున్నాయని 2015 జూన్ ఇండియా స్పెండ్ నివేదిక తెలియజేస్తోంది.

డయాబెటీస్ చికిత్స కోసం 34శాతం ఖర్చు

ది అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియా 2013 అధ్యయనం ప్రకారం..
పట్టణ ప్రాంతాల్లో ఉండే డయాబెటీస్ రోగులు ప్రతీ చికిత్సకు రూ. 10వేలు ఖర్చు చేస్తుంటూ.. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వారు రూ. 6,260 ఖర్చు చేస్తున్నారు. అర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారికి ఇది చాలా భారంగానే తయారైంది.

ఐడీఎఫ్ అంచనా ప్రకారం.. 2040 వరకు 20-79ఏళ్ల మధ్య వయస్కుల్లో 123మిలియన్ల మంది డయాబెటీస్ వ్యాధి బాధితులుగా మారే అవకాశం ఉంది. టీబీ, హెచ్ఐవీ, మలేరియా కంటే కూడా ఈ వ్యాధి విషయంలో విస్తృత ప్రచారం అవసరమని మిశ్రా తెలిపారు.

నేషనల్ హెల్త్ మిషన్ కార్యక్రమమైన నేషనల్ ప్రొగ్రాం ఫర్ ప్రీవెంట్ అండ్ కంట్రోల్ ఆఫ్ క్యాన్సర్, డయాబెటీస్, కార్డిఓవాస్కూలర్ డయాబెటీస్ లాంటి వ్యాధులపై అవగాహన కలిగిస్తోంది. అయితే, ఇది కింది స్థాయి గ్రామీణ ప్రాంతాల ప్రజలకు కూడా చేరాల్సి ఉంది.

English summary
With a genetic predisposition brought to the fore by changing lifestyles, deaths due to diabetes increased 50% in India between 2005 and 2015, and is now the seventh most common cause of death in the country, up from the 11th rank in 2005, according to data published by the Global Burden of Disease (GDB).
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X