• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

5కె రన్: ఉత్సాహంగా యువతీయువకులు(పిక్చర్స్)

|

హైదరాబాద్: నగరంలోని పాతబస్తీలో ఆదివారం నిర్వహించిన 5కె రన్ విజయవంతమైంది. కనీవిని ఎరుగని రీతిలో యువత వేలాది సంఖ్యలో పాల్గొని తమ సంఘీభావాన్ని తెలిపారు. చార్మినార్ నుండి ప్రారంభమైన పరుగు షాలిబండ, లాల్‌దర్వాజ క్రాస్ రోడ్డు మీదుగా అలియాబాద్, ఇంజన్‌బౌలి, ఫలక్‌నూమ, చాంద్రాయణగుట్ట క్రాస్ రోడ్డు, బార్కస్ వరకు కొనసాగింది.

పోలీసులు నగర పౌరుల మధ్య స్నేహభావం పెంపోందేందుకు ఐదు కిలోమీటర్ల శాంతి పరుగును నిర్వహించారు. రన్‌లో దాదపు పదివేల మందికిపైగా పాల్గొన్నారు. రన్‌ను చార్మినార్ వద్ద తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహముద్ ఆలీ జెండా ఊపి ప్రారంభిచారు. ఈ సందర్భంగా ఎంఎ ఆరీఫ్, పుల్లెల గోపీచంద్, నైనా జైస్వాల్, మోతె శ్యాం, ఎవరెస్ట్ అధిరోహకులు పూర్ణ, ఆనంద్‌లను సన్మానించారు. పాతబస్తీ మతసామరస్యానికి ప్రతీక అని అన్నారు.

బ్యాడ్మింటన్‌లో ద్రోణచార్య, పద్మశ్రీ అవార్డు గ్రహీత ఎస్‌ఎం ఆరీఫ్, భారత బాడీబిల్డింగ్ కోచ్ మోతేష్యామ్, బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపిచంద్, టేబుల్ టెన్నిస్ అంతర్జాతీయ క్రీడాకారిణి నైనా జైస్వాల్, హైదరబాద్ జిల్లా టెబుల్ టెన్నిస్ సంఘం కార్యధర్శి అశ్వినికుమార్ పాల్గొన్నారు. బార్కాస్ మైదానంలో జరిగిన రన్ ముగింపు కార్యక్రమంలో దక్షిణ మండలం డిసిపి సత్యనారాయణ, అదనపు డిసిపి బాబూరావుతో పాటు వివిధ డివిజన్‌లకు చెందిన ఎసిపిలు, ఇన్స్‌పెక్టర్లు, సబ్ ఇన్స్‌పెక్టర్లు, శాంతి సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు

5కె రన్

5కె రన్

నగరంలోని పాతబస్తీలో ఆదివారం నిర్వహించిన 5కె రన్ విజయవంతమైంది.

5కె రన్

5కె రన్

కనీవిని ఎరుగని రీతిలో యువత వేలాది సంఖ్యలో పాల్గొని తమ సంఘీభావాన్ని తెలిపారు.

5కె రన్

5కె రన్

చార్మినార్ నుండి ప్రారంభమైన పరుగు షాలిబండ, లాల్‌దర్వాజ క్రాస్ రోడ్డు మీదుగా అలియాబాద్, ఇంజన్‌బౌలి, ఫలక్‌నూమ, చాంద్రాయణగుట్ట క్రాస్ రోడ్డు, బార్కస్ వరకు కొనసాగింది.

5కె రన్

5కె రన్

పోలీసులు నగర పౌరుల మధ్య స్నేహభావం పెంపోందేందుకు ఐదు కిలోమీటర్ల శాంతి పరుగును నిర్వహించారు.

5కె రన్

5కె రన్

5కె రన్‌లో క్రీడాకారులు, ప్రముఖులతోపాటు దాదపు పదివేల మందికిపైగా పాల్గొన్నారు.

5కె రన్

5కె రన్

రన్‌ను చార్మినార్ వద్ద తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహముద్ ఆలీ జెండా ఊపి ప్రారంభిచారు.

5కె రన్

5కె రన్

ఈ సందర్భంగా ఎంఎ ఆరీఫ్, పుల్లెల గోపీచంద్, నైనా జైస్వాల్, మోతె శ్యాం, పూర్ణ, ఆనంద్‌లను సన్మానించారు. పాతబస్తీ మతసామరస్యానికి ప్రతీక అని అన్నారు.

5కె రన్

5కె రన్

పరుగును ప్రారంభించే ముందు ఉప ముఖ్యమంత్రి మహముద్ ఆలీ, శాసన సభ్యులు తీగల కృష్ణారెడ్డి, బాలాల, నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి తదితరులతో కలిసి శాంతి కపోతాలను ఎగురవేశారు.

5కె రన్‌లో డిప్యూటీ సిఎం

5కె రన్‌లో డిప్యూటీ సిఎం

పోలీసుల పనితీరులో నెలకొన్న అపోహలను తొలగించడం, వారిలో స్నేహాన్ని పెంపొందించుకోవడం ద్వారా సమాజంలో నేరాలను తగ్గించాలన్నదే పరుగు ప్రధాన ఉద్దేశ్యమని నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి తెలిపారు.

5కె రన్

5కె రన్

పాతబస్తీలో నగర పోలీస్ విభాగం ఆధ్వర్యంలో చార్మినార్ నుంచి నిర్వహించిన ఈ 5కె రన్‌లో అనేక మంది అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర స్థాయి క్రీడాకారులతో పాటు పోలీసు ఉన్నాతాధికారులు పాల్గొన్నారు.

5కె రన్

5కె రన్

బ్యాడ్మింటన్‌లో ద్రోణచార్య, పద్మశ్రీ అవార్డు గ్రహీత ఎస్‌ఎం ఆరీఫ్, భారత బాడీబిల్డింగ్ కోచ్ మోతేష్యామ్, బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపిచంద్, టేబుల్ టెన్నిస్ అంతర్జాతీయ క్రీడాకారిణి నైనా జైస్వాల్, హైదరబాద్ జిల్లా టెబుల్ టెన్నిస్ సంఘం కార్యధర్శి అశ్వినికుమార్ పాల్గొన్నారు.

5కె రన్

5కె రన్

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి వ్యాయామం అవసరమని, నేటి యువతరం వారికి నచ్చిన క్రీడల్లో శిక్షణ పొంది గొప్ప క్రీడాకారులుగా ఎదగాలని కోరారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Deputy CM Mahamoood ali and Hyderabad City Police Commissioner Mahender Reddy and Naina jaiswal, Purna, Anand, participated along with pullelagopichand, SM Arif and others participated in 5K run.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more