• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

బ్యాంకాక్ నైట్ లైఫ్: అక్కడ ‘సెక్స్ షో’లతో జాగ్రత్త.. లేకుంటే ముంచు‘థాయ్’..

By Ramesh Babu
|

బ్యాంకాక్: ఆహ్లాదకరమైన విదేశీ పర్యటనకు అనువైన ప్రాంతం.. థాయ్‌లాండ్‌! అక్కడ ఖర్చులూ తక్కువే. హోటల్‌ రేట్లు.. వస్తువుల ధరలు అన్నీ చౌకే. అందుకే.. తెలుగు రాష్ట్రాల నుంచి విదేశాలకు వెళ్లేవారిలో 70 శాతం మంది థాయ్‌లాండ్‌కే వెళుతుంటారు.

పర్యటనకు అనువైన ప్రాంతం కదా అని అక్కడి పరిస్థితులపై ఏమాత్రం అవగాహన లేకుండా వెళితే సమస్యలు ముంచు'థాయ్'. థాయ్‌ పర్యటనకు వెళ్లేవారు తమ ట్రిప్‌ను మరింత ఆహ్లాదంగా మర్చుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.

మెట్రో రైళ్లలో వెళ్లడం శ్రేయస్కరం...

మెట్రో రైళ్లలో వెళ్లడం శ్రేయస్కరం...

థాయ్‌లో ప్రయాణాలు చేసే సమయాల్లోనే అప్రమత్తంగా ఉండడం మంచిది. బ్యాంకాక్‌లో మెట్రో నెట్‌వర్క్‌ సమర్థంగా పనిచేస్తుంది. ఎక్కడికైనా వెళ్లాలంటే మెట్రో రైళ్లలో వెళ్లడం శ్రేయస్కరం. ట్యాక్సీలో వెళ్లాలనుకున్నప్పుడు ఒకే డ్రైవర్‌ను మాట్లాడుకోవడం మంచిది. బ్యాంకాక్‌లో ఎక్కువ మంది ట్యాక్సీ డ్రైవర్‌లకు ఇంగ్లీషు వస్తుంది. సాధారణంగా అక్కడ రోజుకు రెండు నుంచి మూడు వేల బాత్‌లు చార్జీ చేస్తారు. అలాగే వీలైనంత వరకూ హోటళ్లు సిఫారసు చేసిన ట్యాక్సీలనే ఉపయోగించడం మంచిది.

బేరాలు ఆడకండి...

బేరాలు ఆడకండి...

థాయ్‌లాండ్‌ లో షాపింగ్‌కు వెళ్లినప్పుడు బేరం చేయకుండా ఉండడం మంచిది. లేదంటే అక్కడి వర్తకులు తమ భాషలో మీపై కామెంట్లు చేసే ప్రమాదం ఉంటుంది. ఈ కామెంట్స్‌ను భరించలేక ఆవేశంలో వారితో గొడవకు దిగితే అది మరో ఇబ్బంది. అందుకే పర్యటనకు వెళ్లిన వారు అదే పనిగా షాపింగ్ లు చేసి, వస్తువులు కొనకపోవడం ఒకరకంగా మంచిది.

వారి సంప్రదాయాలను గౌరవించాలి...

వారి సంప్రదాయాలను గౌరవించాలి...

అక్కడ ప్రతి భవంతి ముందు ఒక చిన్న గుడి ఉంటుంది. అందులో తిమూర్తుల విగ్రహాలుంటాయి. వాటికి తమ వద్ద ఉన్న వస్తులను ఉదయాన్నే నైవేద్యంగా పెడతారు. వాటిని ఇతరులు ముట్టుకోవటం తప్పుగా అక్కడి ప్రజలు భావిస్తారు. మనమాదిరే అక్కడా ఆలయాల్లో పవిత్రత పాటిస్తారు. ఆలయాల ప్రాంగణంలోకి చెప్పులతో వెళ్లకూడదు. స్థానిక సంప్రదాయాలను కించపరిచే విధంగా మాట్లాడకూడదు. థాయ్‌లాండ్‌ వాసులకు తమ చక్రవర్తి అంటే ఇప్పటికీ గౌరవం. చక్రవర్తిని అగౌరవపరిచే వ్యాఖ్యలు చేయకుండా ఉంటే మంచిది.

క్రైమ్ రేటు చాలా తక్కువ...

క్రైమ్ రేటు చాలా తక్కువ...

థాయ్‌లాండ్‌లో డాలర్లు చెల్లుతాయి. మన కరెన్సీకి విలువ తక్కువ. అక్కడికి డాలర్లను తీసుకువెళ్లడమే మంచిది. ఆ దేశ రిజర్వ్‌బ్యాంకు కియోస్క్ ల్లోనే కరెన్సీ ఎక్స్‌చేంజ్‌ చేయడం మంచిది. ప్రైవేటు కియోస్క్ లలో మార్చుకుంటే తక్కువ విలువ లభిస్తుంది.
బ్యాకాంక్‌, పట్టాయ్యా వంటి పట్టణాల్లో బైకులు అద్దెకు ఇస్తారు. అందువల్ల ఇంటర్నేషనల్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ తీసుకువెళ్తే బెటర్‌.

పైన బార్లు, కింద సెక్స్ షోలు...

పైన బార్లు, కింద సెక్స్ షోలు...

బ్యాంకాక్‌లో ‘సెక్స్‌ షో'లు ఫేమస్‌. కొన్ని నైట్‌ క్లబ్బుల్లో పైన బార్లు ఉంటే కింద సెక్స్‌ షోలు జరుగుతాయి. ఈ సెక్స్ షోలకు వెళ్లాలనుకుంటే మాత్రం ఎంట్రెన్స్‌ ఫీజు ముందే కనుక్కొవాలి. లేదంటే వాచిపోతుంది మరి! ఒకసారి లోపలికి అడుగుపెట్టాక.. వారు అడిగినంత బిల్లు చెల్లిస్తే తప్ప బయటకు వెళ్లనివ్వరు. థాయ్‌లాండ్‌లో పోలీసులు ఎక్కువ కనిపించరు. అక్కడ క్రైమ్‌ రేటు కూడా చాలా తక్కువ. థాయ్‌ పోలీసుల ఇంటెలిజెన్స్‌ వ్యవస్థ పటిష్టంగా ఉంటుంది.

ప్యాకేజీలను ఎంపికలో జాగ్రత్త...

ప్యాకేజీలను ఎంపికలో జాగ్రత్త...

థాయ్‌లాండ్‌ వెళ్లేటప్పుడే అక్కడ ఏ హోటల్‌ లో దిగాలో ముందుగానే నిర్ణయించుకుని, ఆ మేరకు హోటల్ గదులను బుక్‌ చేసుకుని వెళ్లడం మంచిది. వివిధ ట్రావెల్‌ ఏజెన్సీల ప్యాకేజీలను ఎంపిక చేసుకునే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. వారు ఏ స్టార్‌ హోటల్‌ను బుక్‌ చేస్తున్నారనే విషయాన్ని గమనించాలి. థాయ్‌లో త్రీస్టార్‌ హోటళ్లు కూడా భారత్‌లో ఫైవ్‌ స్టార్‌ హోటళ్ల స్థాయిలో ఉంటాయి. కాబట్టి అక్కడ త్రీస్టార్‌ హోటల్స్‌లో బుక్‌ చేసుకున్నా సరిపోతుంది. బ్యాంకాక్‌లో కావ్‌సాన్‌ రోడ్‌లో తక్కువ ధరకు హోటల్ గదులు లభిస్తాయి. కానీ ఆ ప్రాంతంలో మితిమీరిన రద్దీ ఉంటుంది. అందుకే సుఖమ్‌విత్‌ వంటి ప్రాంతాలలో హోటళ్లను ఎంపిక చేసుకోవటం మంచిది.

English summary
Many first timers may feel apprehensive about checking out Bangkok’s red light districts because they straight up don’t know what to expect when they get to the front doors of what is essentially a brothel on steroids. And that’s understandable. So below you will find useful tips from upon arrival at Suvarnabhumi Airport to how to get around the city with info on different modes of transport the city provides. You will see that the city is very easy to travel around, especially when you’re looking for go go bars and massage parlors. But the crux of this website is on the country’s infamous sex industry. For that you want to be armed with basic information on Thai money because with no money there’s no honey as the going says. So you’ll find information on the Thai Baht, ATMs and the best place to get money exchanged with the best rates.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X