వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఖైరతాబాద్ గణపతికి 62ఏళ్లు: విశేషాలు, ఎన్టీఆర్ ఇలా(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ఖైరతాబాద్ వినాయకుడికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. కాగా, ఈ ఏడాది ఉత్సవాలతో ఖైరతాబాద్ వినాయకుడి ఉత్సవాలు 62ఏళ్లు పూర్తి చేసుకుంటున్నాయి. 1954లో అప్పటి కౌన్సిలర్ సింగరి శంకరయ్య ఆధ్వర్యంలో ఒక అడుగు ఎత్తు విగ్రహంతో ప్రారంభమైన ఉత్సవాలు.. రెండేళ్ల క్రితం దాకా 60 అడుగుల ఎత్తు వరకు పెరుగుతూ వచ్చింది.

రెండేళ్ల క్రితం 60 అడుగుల ఎత్తైన గణపతిగా దర్శనమిచ్చిన ఈ మహా గణపతి.. ఆ తర్వాత నుంచి ఒక్కో అడుగు తగ్గిస్తూ ఈసారి 58 అడుగులకు చేరుకుంది. ఎందుకంటే.. 60ఏళ్ల వరకు ఒక్కో అడుగు పెంచుతూ వచ్చినా.. ఆ తర్వాత తగ్గిస్తూ వస్తున్నారు. విగ్రహం ఎత్తు తగ్గినా రూపకల్పనలో ఏటా వైవిధ్యతను చాటుతున్నారు. శంకరయ్యతో పాటు కలిసి పనిచేసిన ఆయన సోదరుడు సింగరి సుదర్శన్‌ ఇప్పుడు వినాయకుడి ఏర్పాట్లు చూసుకుంటున్నారు.

ఖైరతాబాద్ గణపతిని ప్రతిష్టించిన చవితి రోజు నుంచే భక్తుల రాక మొదలైంది. రోజు రోజుకు భక్తుల రదీ పెరిగిపోతోంది. గురువారం కూడా భక్తులు భారీ ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భద్రతా ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు.

భక్తుల రద్దీ

భక్తుల రద్దీ

తొలి రోజుల్లో నగరమంతా వినాయకులను నిమజ్జనం చేసినా ఇక్కడ 20 నుంచి నెల రోజుల వరకు ఉత్సవాలు నిర్వహించేవారు

బారులు తీరిన భక్తులు

బారులు తీరిన భక్తులు

1960లోఏనుగుపై వూరేగిస్తూ సాగర్‌కు తీసుకెళ్లి నిమజ్జనం చేశారు.
* ఇక్కడ 11 అడుగుల విగ్రహాన్ని తయారుచేసినప్పుడు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు.

గణపతితో సెల్ఫీలు దిగుతున్న యువతులు

గణపతితో సెల్ఫీలు దిగుతున్న యువతులు

1982లో భాగ్యనగర్‌ గణేష్‌ ఉత్సవ కమిటీ ఖైరతాబాద్‌ ఉత్సవ నిర్వాహకులను కలిసి 11 రోజులకే నిమజ్జనం చేసేలా ఒప్పించారు.

ఖైరతాబాద్ గణపతి

ఖైరతాబాద్ గణపతి

1982లో రెండు పడవలను కలిపి వాటిపై విగ్రహాన్ని హుస్సేన్‌సాగర్‌ మధ్యలోకి తీసుకెళ్లి నిమజ్జనం చేశారు.

పెరిగిన భక్తుల రద్దీ

పెరిగిన భక్తుల రద్దీ

ఇక్కడ మొదటి నుంచి లడ్డూ ఏర్పాటు చేయడం లేదు. 2011లో కాకినాడ సమీపంలోని తాపేశ్వరానికి చెందిన సురుచి ఫుడ్స్‌ నిర్వాహకుడు మల్లిబాబు 500 కిలోల లడ్డూను గణపతి చేతిలో ఉంచారు.

భద్రతా ఏర్పాట్లలో పోలీసులు

భద్రతా ఏర్పాట్లలో పోలీసులు

గతేడాది 6వేల కిలోల లడ్డును చేతిలో ఏర్పాటు చేశారు. ఈ ఏడాది చివరి నిమిషంలో 500 కిలోల లడ్డూను ఏర్పాటు చేశారు.

పొటోలు తీసుకుంటున్న భక్తులు

పొటోలు తీసుకుంటున్న భక్తులు

ఓ సారి వినాయకుడిని వాహనంపై ట్యాంక్‌బండ్‌కు చేర్చి నిమజ్జనం చేసేందుకు క్రేన్‌ రాకపోవడంతో నెల పాటు ట్యాంక్‌బండ్‌పై ఉంచారు.

సెల్ఫీలు తీసుకుంటున్న దృశ్యం

సెల్ఫీలు తీసుకుంటున్న దృశ్యం

బుల్లి తెరలోనే కాకుండా 1983లోనే సినిమాల్లోనూ ఖైరతాబాద్‌ వినాయకుడు వెలుగువెలిగాడు. కళాతపస్వి కె.విశ్వనాథ్‌ దర్శకత్వంలో నిర్మించిన ‘సాగర సంగమం' చిత్రం షూటింగ్‌ కోసం నటుడు కమలహాసన్‌తో ఒక రోజంతా చిత్రీకరణలో పాల్గొన్నారు.ఎన్టీఆర్‌, శోభన్‌బాబుఅప్పట్లో గణపతిని దర్శించుకున్నారు.

భక్తజనసందోహం

భక్తజనసందోహం

తమిళనాడుకు చెందిన శిల్పి రాజేంద్రన్‌తో పాటు దాదాపు 150 మంది కళాకారులు మూడు నెలల పాటు బృందాలుగా పని చేసి వినాయకుడికి రూపకల్పన చేస్తారు.

English summary
Heavy crowd at Khairatabad Ganpati on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X