• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

హైద్రాబాద్‌లో పుట్టలేదు: షర్మిళ, సోహా సందడి(పిక్చర్స్)

|

హైదరాబాద్: సినిమాలు కేవలం వినోదానికే కాదు, నటుల జీవితంలో అనేక మార్పులు తీసుకొస్తాయన్నారు అలనాటి బాలీవుడ్ నటి షర్మిళా ఠాగూర్ అన్నారు. యంగ్ ఫిక్కి లేడిస్ ఆర్గనైజేషన్(వైఎఫ్‌ఎల్‌ఓ ) ఆధ్వర్యంలో బుధవారం బంజారాహిల్స్‌లోని తాజ్‌కృష్ణలో సెలబ్రేట్ ఉమెన్‌హుడ్ అనే అంశంపై జరిగిన సదస్సులో ఆమె తన కుమార్తె, బాలీవుడ్ నటి సోహా అలీఖాన్‌తో కలిసి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆమె తన సినీ, వ్యక్తిగత జీవితం విశేషాలను ఫిక్కీ సభ్యులతో పంచుకున్నారు. అందరూ అనుకుంటున్నట్లు తాను 1946లో హైదరాబాద్‌లో జన్మించలేదని 1944లో కాన్పూర్‌లో జన్మించానన్నారు.

‘మాది రవీంద్రనాథ్‌ ఠాగూ‌ర్‌ ఫ్యామిలీ. ఐదో జనరేషన్‌ మాది. నిజానికి మా తండ్రి బ్రాహ్మిణ్‌. కానీ, ఆయన బ్రహ్మ సమాజ్‌లోకి మారారు. తరువాత నేను మన్సూర్‌ అలీ పటౌడీని వివాహం చేసుకున్న తరువాత ముస్లిం మతంలోకి మారాను' అని షర్మిల తెలిపారు.

షర్మిల, సోహా సందడి

షర్మిల, సోహా సందడి

సినిమాలు కేవలం వినోదానికే కాదు, నటుల జీవితంలో అనేక మార్పులు తీసుకొస్తాయన్నారు అలనాటి బాలీవుడ్ నటి షర్మిళా ఠాగూర్ అన్నారు.

షర్మిల, సోహా సందడి

షర్మిల, సోహా సందడి

యంగ్ ఫిక్కి లేడిస్ ఆర్గనైజేషన్(వైఎఫ్‌ఎల్‌ఓ ) ఆధ్వర్యంలో బుధవారం బంజారాహిల్స్‌లోని తాజ్‌కృష్ణలో సెలబ్రేట్ ఉమెన్‌హుడ్ అనే అంశంపై జరిగిన సదస్సులో ఆమె తన కుమార్తె, బాలీవుడ్ నటి సోహా అలీఖాన్‌తో కలిసి పాల్గొన్నారు.

షర్మిల, సోహా సందడి

షర్మిల, సోహా సందడి

ఈ సందర్భంగా ఆమె తన సినీ, వ్యక్తిగత జీవితం విశేషాలను ఫిక్కీ సభ్యులతో పంచుకున్నారు.

షర్మిల, సోహా సందడిడ

షర్మిల, సోహా సందడిడ

అందరూ అనుకుంటున్నట్లు తాను 1946లో హైదరాబాద్‌లో జన్మించలేదని 1944లో కాన్పూర్‌లో జన్మించానన్నారు.

షర్మిల, సోహా సందడి

షర్మిల, సోహా సందడి

‘మాది రవీంద్రనాథ్‌ ఠాగూ‌ర్‌ ఫ్యామిలీ. ఐదో జనరేషన్‌ మాది. నిజానికి మా తండ్రి బ్రాహ్మిణ్‌. కానీ, ఆయన బ్రహ్మ సమాజ్‌లోకి మారారు. తరువాత నేను మన్సూర్‌ అలీ పటౌడీని వివాహం చేసుకున్న తరువాత ముస్లిం మతంలోకి మారాను' అని షర్మిల తెలిపారు.

షర్మిల, సోహా సందడి

షర్మిల, సోహా సందడి

సినిమాల్లో గ్లామర్ పాత్రలకంటే నటన ప్రాధాన్యం ఉన్న పాత్రలకు ఎక్కువ విలువ ఇచ్చానని, అలాంటి పాత్రలు నటిగా ఎక్కువకాలం నిలబడుతాయన్నారు.

షర్మిల, సోహా సందడి

షర్మిల, సోహా సందడి

ఇక తాను ఉమ్మడి కుటుంబం నుంచి వచ్చానని ఈ కారణంగా తనకుకుటుంబ విలువలతోపాటు బాధలు తెలుసన్నారు.

షర్మిల, సోహా సందడి

షర్మిల, సోహా సందడి

‘ఈవినింగ్ ఇన్ పారిస్' చిత్రం విడుదలైనప్పుడు మన్సూర్ అలీఖాన్ పటౌడీ తనకు పరిచయమయ్యారని, అదే తమ ప్రేమకు, పెళ్లికి కారణమైందన్నారు.

సోహా అలీఖాన్ మాట్లాడుతూ.. సినిమాల్లోకి రాకముందు తనకు చిత్రాలంటే కేవలం పాటలు, డ్యాన్సులనే అభిప్రాయం ఉండేదని అయితే.. చిత్ర పరిశ్రమలోకి వచ్చాక ఆ అభిప్రాయం పూర్తిగా తప్పని తెలిసిందన్నారు. సినిమాలు కేవలం వినోదాన్నే కాకుండా మనలోని ప్రతిభను వెలికితీసేందుకు ఉపయోగపడుతాయన్నారు.

‘సినిమాల్లో చేయాలని.. చేస్తానని నేను అసలు అను కోలేదెప్పుడు. ముంబైకి వచ్చింది ఉద్యోగం కోసమే. మా అన్న (సైఫ్‌ అలీఖాన్‌)తో కలిసి ఉండేదాన్ని. సంవత్సరంన్నర సిటీబ్యాంక్‌లో ఉద్యోగం చేసిన తర్వాత సినిమాలపై గాలి మళ్లింది' అని సోహా చెప్పారు.

‘నా లాస్ట్‌ కెరీర్‌ ఇదే అని అనుకుంటున్నాను. నాకు రచయిత కావాలనే కోరిక కూడా ఉండేది. కాబట్టి సినిమాల నుంచి రిటైరైతే రచయితగా మారతాను. ఒత్తిడి ఎదుర్కోవటానికి యోగా బెస్ట్‌ మెడిసన్‌. ఫిజికల్‌ యాక్టివిటీ ద్వారా ఒత్తిడిని అధిగమించవచ్చు. కొంతమంది ఇవేవీ లేకుండానే దీన్ని జయిస్తారు.. మా అమ్మలాగా' అని సోహా చెప్పారు. ఈ కార్యక్రమంలో వైఎఫ్‌ఎల్‌ఓ చైర్‌పర్సన్ సామియా ఆలంఖాన్ తదితరులు పాల్గొన్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Acting is the best profession in the world, Sharmila Tagore affirmed at a rendezvous with her daughter, Soha Ali Khan, and author and journalist, Nishat Fatima in the city on Wednesday. A person who started her film career at 13, Ms. Tagore said the profession taught her humility at being judged by audience.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more