• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

టాటా ఫోటోతో ఎయిర్ ఏషియా 'ద పయనీర్'(ఫోటోలు)

By Nageswara Rao
|

హైదరాబాద్: ఎయిర్ ఏషియా తన నాల్గవ విమానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. శనివారం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దీన్ని ఆవిష్కరించారు. జేఆర్‌డీ టాటా గౌరవార్ధం ఆయన ఫోటోతో దీనిపై ముద్రించారు.

దేశీయ పౌర విమానయాన సేవలకు ఆద్యుడైన జేఆర్‌డీ టాటాను గుర్తు చేసుకుంటూ, 'ద పయనీర్' పేరుతో ఈ విమానాన్ని ప్రయాణికుల సేవల్లోకి ప్రవేశపెడుతున్నట్లు ఎయిర్ ఏషియా వర్గాలు వెల్లడించాయి.

'ద పయనీర్' విమాన ఆవిష్కరణ కార్యక్రమానికి టాటా గ్రూప్ గౌరవ ఛైర్మన్ రతన్ టాటా, ఎయిర్ ఏషియా ఇండియా నాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ ఎస్.రామదొరై, ఎయిర్ ఏషియా గ్రూప్ సీఈఓ టోనీ ఫెర్నాండెజ్, ఎయిర్ ఏషియా ఇండియా సీఈఓ మిత్తు చండిల్య హాజరయ్యారు.

ఈ సందర్భంగా టాటా ఎయిర్ ఏషియా సీఈఓ మిత్తు చండిల్య మాట్లాడుతూ వచ్చే నెలలో మరో రెండు కొత్త ఎయిర్ బస్ ఏ320 విమానాలను ప్రవేశపెడుతున్నామని, ఇప్పుడున్న ఈ నాలుగు విమానాలకు ఆ రెండు అదనమని చెప్పారు.

టాటా ఫోటోతో ఎయిర్ ఏషియా 'ద పయనీర్'

టాటా ఫోటోతో ఎయిర్ ఏషియా 'ద పయనీర్'

దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధికి, ఉపాధి కల్పనకు దోహదపడుతున్న విమానయాన రంగ రెక్కలు కట్టేసే సరికొత్త నిబంధనల పట్ల ఎయిర్‌ ఆసియా సిఇఒ టోనీ ఫెర్నాండేస్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు.

 టాటా ఫోటోతో ఎయిర్ ఏషియా 'ద పయనీర్'

టాటా ఫోటోతో ఎయిర్ ఏషియా 'ద పయనీర్'

ఇలాంటి నిబంధనలు ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నాయా అని ప్రశ్నించారు. విస్తరణకు, ఉపాధి కల్పనకు కంపెనీలు ముందుకు వస్తుంటే ఎందుకు అడ్డుపడుతున్నారో అర్థం కావడం లేదన్నారు.

 టాటా ఫోటోతో ఎయిర్ ఏషియా 'ద పయనీర్'

టాటా ఫోటోతో ఎయిర్ ఏషియా 'ద పయనీర్'

దేశంలో వ్యాపారాన్ని సులభతరం చేయాల్సిన అవసరం ఉందని, ఈ విషయంలో ప్రభుత్వం అన్ని రకాలు సహకరించాలని సూచించారు.

టాటా ఫోటోతో ఎయిర్ ఏషియా 'ద పయనీర్'

టాటా ఫోటోతో ఎయిర్ ఏషియా 'ద పయనీర్'

20 విమానాలు కలిగి ఉండి దేశంలో ఐదేళ్లు (5/20) సర్వీసులు నడిపించిన తర్వాతనే అంతర్జాతీయ సర్వీసులకు అనుమతివ్వాలని కొత్త నిబంధనల్లో ఉందని, ఇలాంటి నిబంధన ప్రపంచంలో ఎక్కడైనా ఉందా అని ఫెర్నాండెజ్అన్నారు.

టాటా ఫోటోతో ఎయిర్ ఏషియా 'ద పయనీర్'

టాటా ఫోటోతో ఎయిర్ ఏషియా 'ద పయనీర్'

ఒక్క భారత్‌కే కాదు సింగపూర్‌, దుబాయ్‌, లండన్‌ వంటి దేశాల ఆర్థిక వ్యవస్థ వృద్ధికి విమానయాన రంగం చాలా కీలమని పేర్కొన్నారు.

 టాటా ఫోటోతో ఎయిర్ ఏషియా 'ద పయనీర్'

టాటా ఫోటోతో ఎయిర్ ఏషియా 'ద పయనీర్'

భారత విమానయాన రంగానికి భారీ స్థాయిలో పెట్టుబడుల అవసరం ఉందని, ఎక్కువ కంపెనీలు ఈ రంగంలోకి ప్రవేశిస్తే వినియోగదారులకు అందుబాటు ధరల్లోనే సేవలు లభిస్తాయని చెప్పారు.

టాటా ఫోటోతో ఎయిర్ ఏషియా 'ద పయనీర్'

టాటా ఫోటోతో ఎయిర్ ఏషియా 'ద పయనీర్'

తమ లాభాలను కాపాడుకోవడానికి ఇలాంటి పన్నాగం పన్నుతున్న కంపెనీలకు వ్యతిరేకంగా పోరాడుతామన్నారు. ప్రభుత్వం విధించిన నిబంధనల్లో మరింత స్పష్టత కోరుతున్నామన్నారు.

 టాటా ఫోటోతో ఎయిర్ ఏషియా 'ద పయనీర్'

టాటా ఫోటోతో ఎయిర్ ఏషియా 'ద పయనీర్'

విమాన ఇంధనంపై అధిక పన్ను విధించడం పట్ల మిట్టు చాండిల్య ఆందోళన వ్యక్తం చేశారు. అయినప్పటికీ ప్రయాణికుల సంఖ్య క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో తాము భావి వృద్ధిపై ఆశావాహ దృక్పథంతో ఉన్నామని చెప్పారు.

 టాటా ఫోటోతో ఎయిర్ ఏషియా 'ద పయనీర్'

టాటా ఫోటోతో ఎయిర్ ఏషియా 'ద పయనీర్'

ప్రస్తుతం తమ విమానాల సంఖ్య నాలుగుకు చేరిందని, వచ్చే నెలలో వీటి సంఖ్య ఆరుకు పెరుగుతుందన్నారు. ఈ క్యాలెండర్‌ సంవత్సరంలోనే నిర్వహణాపరంగా లాభనష్టాలు లేని స్థాయిను సాధించవచ్చనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

 టాటా ఫోటోతో ఎయిర్ ఏషియా 'ద పయనీర్'

టాటా ఫోటోతో ఎయిర్ ఏషియా 'ద పయనీర్'

దేశీయ పౌర విమానయాన రంగానికి ఆద్యుడైన జెఆర్‌డి టాటా సేవలను స్మరిస్తూ ఆయనకు తన నాలుగో విమానాన్ని ఎయిర్‌ ఆసియా ఇండియా అంకితమిచ్చింది. ఈ విమానంపై జేఆర్‌డీ టాటా ఫోటోలను ముద్రించారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
AirAsia India on Saturday unveiled its fourth aircraft with a livery dedicated to JRD Tata as a mark of respect to the pioneer of civil aviation in the Indian sub-continent.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more