తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బ్రహ్మోత్సవం: నేత్ర పర్వంగా అంకురార్పణం(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

తిరుపతి: శ్రీపద్మావతీ అమ్మవారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఆలయంలో సోమవారం లక్ష కుంకుమార్చన సేవ నేత్ర పర్వంగా సాగింది. అమ్మవారిని వేకువ జామున 4 గంటలకు సుప్రభాత సేవతో మేల్కొలిపి నిత్యార్చన నిర్వహించి నైవేద్యం సమర్పించారు.

అనంతరం అమ్మవారి ఉత్సవ మూర్తిని సర్వాంగ సుందరంగా అలంకరించి ఉదయం 6 గంటలకు అమ్మవారి సన్నిధి నుంచి వేంచేపుగా శ్రీకృష్ణ స్వామి ముఖ మండపానికి తీసుకువచ్చి కొలువుదీర్చారు.

అనంతరం ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు వేద మంత్రోచ్ఛారణ, మంగళవాయిద్యాలు, భక్తుల గోవింద నామస్మరణల నడుమ పాంచారాత్ర ఆగమ శాస్త్రోక్తంగా ఆగమ పండితులు, లక్ష కుంకుమార్చన సేవను నేత్ర పర్వంగా నిర్వహించారు.

అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలకు నాందిగా సోమవారం సాయంత్రం అంకురార్పణ ఘనంగా నిర్వహించారు. అమ్మవారి ఉద్యాన వనంలో శాస్త్రోక్తంగా సేకరించిన పుట్టమన్నును ఆలయానికి తీసుకువచ్చి అందులో నవధాన్యాలను వేసి అంకురార్పణకు శ్రీకారం చుట్టారు.

అంకురార్పణం

అంకురార్పణం

శ్రీపద్మావతీ అమ్మవారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఆలయంలో సోమవారం లక్ష కుంకుమార్చన సేవ నేత్ర పర్వంగా సాగింది.

విద్యుత్ కాంతులు

విద్యుత్ కాంతులు

అమ్మవారిని వేకువ జామున 4 గంటలకు సుప్రభాత సేవతో మేల్కొలిపి నిత్యార్చన నిర్వహించి నైవేద్యం సమర్పించారు.

పూలతో అలంకరణ

పూలతో అలంకరణ

అనంతరం అమ్మవారి ఉత్సవ మూర్తిని సర్వాంగ సుందరంగా అలంకరించి ఉదయం 6 గంటలకు అమ్మవారి సన్నిధి నుంచి వేంచేపుగా శ్రీకృష్ణ స్వామి ముఖ మండపానికి తీసుకువచ్చి కొలువుదీర్చారు.

పూలతో అలంకరణ

పూలతో అలంకరణ

అనంతరం ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు వేద మంత్రోచ్ఛారణ, మంగళవాయిద్యాలు, భక్తుల గోవింద నామస్మరణల నడుమ పాంచారాత్ర ఆగమ శాస్త్రోక్తంగా ఆగమ పండితులు, లక్ష కుంకుమార్చన సేవను నేత్ర పర్వంగా నిర్వహించారు.

సేనాధిపతి

సేనాధిపతి

బ్రహ్మోత్సవాలకు అడ్డంకులు లేకుండా సాగడానికి దేవతల సేనాధిపతి అయిన విష్వక్సేనుల వారు పుట్టమన్ను తేవడం ఆనవాయితీ.

అంకురార్పణం

అంకురార్పణం

అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలకు నాందిగా సోమవారం సాయంత్రం అంకురార్పణ ఘనంగా నిర్వహించారు.

అంకురార్పణం

అంకురార్పణం

అమ్మవారి ఉద్యాన వనంలో శాస్త్రోక్తంగా సేకరించిన పుట్టమన్నును ఆలయానికి తీసుకువచ్చి అందులో నవధాన్యాలను వేసి అంకురార్పణకు శ్రీకారం చుట్టారు.

English summary
The celestial "Seed Sowing Ceremony"-"Ankuararpanam" was performed in the famous shrine of Goddess Padmavathi Devi at Tiruchanoor on Monday evening as a preliminary to main ritual of annual Karthika Brahmotsavams which are going commence from Tuesday with Dhwaja Arohanam ceremony.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X