విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

"స్పియర్ ఆన్ స్పారో"...ఇది పిచ్చుక కోసం బ్రహ్మాస్తం...యంగ్ క్రియేటర్ కు డాక్టరేట్...

|
Google Oneindia TeluguNews

ఆ చిరు ప్రాణుల కధ ఆ చిన్నారిని కదిలించింది...తమ చిట్టి ప్రాణం కోసం అవి పడే వ్యధ ఆ బాలుడిని ఆలోచింపచేసింది...అందరూ వాటి మీద ఆయుధాలు సంధిస్తుంటే తాను మాత్రం వాటికి అండగా ఏదో ఒకటి చెయ్యాలనుకున్నాడు...అలా ఆ బాలుడు చేసిన ఒక ప్రయత్నం ఆ అల్ప ప్రాణుల గురించి అందరూ ఆలోచించే బ్రహ్మాస్త్రం అయింది...ఏకంగా అనేక అవార్డులు తెచ్చిపెట్టింది...ఆ బాలుడి పేరు షణ్ముఖ మాధవ్‌...అతడు అండగా నిలిచింది పిచ్చుకకు...వివరాల్లోకి వెళితే...

షణ్ముఖ మాధవ్‌ సున్నిత మనస్కుడు...సృజనశీలి...చిన్నప్పటి నుంచి విభిన్నంగానే ఆలోచించేవాడు. ఎనిమిదో ఏట నుంచి సరికొత్త ప్రయోగాలు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరిచేవాడు. ఒకరోజు పిచ్చుకలు అంతరించిపోతున్నాయన్నవార్తను పేపర్‌లో చదివి చలించిపోయాడు. ఇంతకుముందు మన ఇళ్లలోనే ఉంటూ...మనతోనే సహజీవనం చేస్తూ...ఎల్లప్పుడూ కిచకిచలాడే ఈ పిచ్చుకలు అసలు కనిపించకుండా పోవడం ఆ బాలుడిని బాగా బాధించింది. అందుకే వాటి బాగు కోసం తన వంతుగా ఏమైనా చేయాలని అనుకున్నాడు.

 పిచ్చుకల కోసం...ఏదైనా చెయ్యాలని...

పిచ్చుకల కోసం...ఏదైనా చెయ్యాలని...

పిచ్చుకలు అంతరించిపోతున్నాయి...భవిష్యత్తులో ఎవరికీ కనిపించవేమో. ఈ మాటలను మనం తరచూ వింటుంటాం. మనలాగే విశాఖపట్టణం బాలుడు పెంటకోట షణ్ముఖ మాధవ్‌ కూడా ఈ మాటలను విన్నాడు. అయితే అందరిలా ఆ మాటలు విని అంతటితో వదిలేయలేదు. ఆ విషయాన్ని పది మందికీ తెలియజేయాలనుకున్నాడు. వాటి కోసం ఏదైనా చెయ్యాలని నిర్ణయించుకున్నాడు.

 చిన్నారి షణ్ముఖ...షార్ట్ ఫిల్మ్ తియ్యాలని...

చిన్నారి షణ్ముఖ...షార్ట్ ఫిల్మ్ తియ్యాలని...

ప్రస్తుతం ఇంటర్ చదువుతున్నషణ్ముఖ మాధవ్‌ ఈ పిచ్చుకల గురించి ఆలోచించే నాటికి భాష్యంలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. మొదటి నుంచి క్రియేటివ్ వర్క్స్ పట్ల ఆసక్తి చూపే షణ్ముఖ మాధవ్‌ అప్పటికే యానిమేషన్‌లో శిక్షణ పొందుతున్నాడు. పిచ్చుకల కోసం ఏదైనా చెయ్యాలనుకున్న షణ్ముఖ వాటి గురించి తాను ఏదైతే ఆలోచించాడో అలాంటి ఆలోచనలతో ఒక షార్ట్ ఫిల్మ్ రూపొందించాలని అనుకున్నాడు.

పిచ్చుక కోసం బ్రహ్మాస్త్రం...

పిచ్చుక కోసం బ్రహ్మాస్త్రం...

పిచ్చుక కోసం బ్రహ్మాస్త్రం...‘స్పియర్‌ ఆన్‌ స్పారో' అనుకున్నదే తడవుగా అదే పని మీద దృష్టి లగ్నం చేసి నాలుగు నిమిషాల నిడివితో ‘స్పియర్‌ ఆన్‌ స్పారో' అనే మూకీ వీడియోను రూపొందించాడు. ఆ తరువాత తన ‘స్పియర్‌ ఆన్‌ స్పారో' ను యూట్యూబ్‌లో విడుదల చేశాడు. ఆ వీడియోకు ఎన్నో ప్రశంసలు లభించాయి. ఈ వీడియోలో పిచ్చుకలు అంతరించిపోవడానికి రేడియేషన్‌ ఏ విధంగా కారణమవుతున్నదీ, సెల్‌ టవర్స్‌ ఏర్పాటు తరువాత పిచ్చుకలు అడవులకు ఎలా తరలిపోతున్నదీ ఆద్యంతం ఆసక్తికరంగా వీడియోలో వివరించిన తీరు అందరినీ ఆకట్టుకుంది.

 అవార్డులు..డాక్టరేట్ కూడా...

అవార్డులు..డాక్టరేట్ కూడా...

వీడియో చూసి షణ్ముఖమాధవ్‌ను నేషనల్‌ బాలభవన్‌ అవార్డుతో సత్కరించింది. ఇండియన్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లోనూ చోటు దక్కింది. వియత్నాం ప్రభుత్వంతో కలిసి వరల్డ్‌ రికార్డ్స్‌ యూనివర్సిటీ వాళ్లు ఏకంగా డాక్టరేట్‌ను అందించారు. ఆ విధంగా ‘పిచ్చుకపై బ్రహ్మాస్త్రం' పేరుతో రూపొందించిన యానిమేషన్‌ వీడియోతో అంతర్జాతీయ గుర్తింపును పొందాడు షణ్ముఖ మాధవ్‌. అయితే ఇప్పుడు ఇండియన్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ను ఏర్పాటుచేసి 15 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా గత పదిహేనేళ్లుగా ఇచ్చిన రికార్డ్స్‌లో టాప్‌-100 స్థానాల్లో ఉన్నవారి జాబితాను విడుదల చేసింది. ఇందులో రాష్ర్టానికి చెందిన ముగ్గురు స్థానం దక్కించుకోగా అందులో షణ్ముఖమాధవ్‌ ఒకడు. షణ్ముఖ మాధవ్‌ తన ‘స్పియర్‌ ఆన్‌ స్పారో' కు ఇప్పటివరకు ఎనిమిది నేషనల్‌ అవార్డులు అందుకున్నాడు.

English summary
With cell phone towers and rapid urbanisation taking a toll on bird population, P. Shanmukh Madhav has come up with an animated short film ‘Spear of Sparrow’. For that he honored by National, inter national awards and doctorate too.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X