వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పెట్టుబడులే లక్ష్యంగా పార్ట్ నర్ షిప్ సమ్మిట్, ప్రత్యేక ఏర్పాట్లు చేసిన ఎపి సర్కార్

విశాఖలో జరిగే పార్ట్ నర్ షిప్ సమ్మిట్ కు ఎపి ప్రభుత్వం విస్తృతంగా ఏర్పాట్లు చేస్తోంది. ఈ సదస్సుకు యాభై దేశాల నుండి సుమారు రెండు వేల మంది ప్రతినిధులు హాజరుకానున్నారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

విశాఖ: విశాఖ పట్టణంలో వరుసగా రెండో ఏడాది సిఐఐ సదస్సు జరగనుంది. గత ఏడాది ఈ సదస్సును ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించింది. అదే స్పూర్తితో ఈ ఏడాది కూడ సిఐఐ సదస్సును నిర్వహిస్తోంది. ఎపి సర్కార్.

ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించేందుకుగాను సిఐఐ సదస్సు నిర్వహణను ఎంచుకొంది ప్రభుత్వం. ఈ సదస్సుకు సుమారు 50 దేశాల నుండి రెండువేల మంది ప్రతినిధులను హజరుకానున్నారు.

రెండు రోజుల పాటు విశాఖ వేదికగా ఈ సదస్సు జరగనుంది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేవారికి ఎపి సర్కార్ పలు రాయితీలను ప్రకటించనుంది. పెట్టుబడులను ఆకర్షించేందుకుగాను సర్కార్ పారిశ్రామికవేత్తలకు వరాల జల్లును కురిపించనుంది.

ఈ సదస్సును విజయవంతం చేసేందుకుగాను ఎపి సర్కార్ శక్తివంచన లేకుండా ప్రయత్నాలు చేస్తోంది. గత ఏడాది జనవరి 10 నుండి 12వ, తేదివరకు సిఐఐ సమ్మిట్ నిర్వహించారు. ఈ సమ్మిట్ విజయవంతమైనందున మరోసారి ఈ సమ్మిట్ నిర్వహణకు ఎపి సర్కార్ సిద్దమైంది.

English summary
andhra pradesh governament special arrangements for patnership summit 2017 in vizag. around 50 countries delegates will attend to this summit.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X