వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉగ్రమూక దాడుల్లో తల్లిదండ్రులను కోల్పోయిన బేబీ మోషే.. తొమ్మిదేళ్ల తర్వాత తిరిగి ముంబైలో కాలుపెట్టి..

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

Recommended Video

తొమ్మిదేళ్ళ తరువాత ముంబై చేరిన మోషే..!

ముంబై: 26/11 ఉగ్రమూక దాడిలో తల్లిదండ్రులను కోల్పోయి తన ఆయాతో ఇజ్రాయెల్‌ వెళ్లి అక్కడే పెరిగి పెద్దయి తొమ్మిదేళ్ల తరువాత తిరిగి ముంబైలో కలుమోపిన ఉదంతమిది. తొమ్మిదేళ్ల తరువాత మళ్లీ ఆ చిన్నారి ముంబైలోని తన ఇంటికి తిరివచ్చాడు.

ఆ చిన్నారి పేరు మోషే హోల్జ్ బర్గ్. బేబీ మోషే అంటే అందరికీ అర్థమవుతుంది. చిన్నప్పుడు మోషేను చూసిన స్థానికులు మళ్లీ ఇన్నాళ్లకు అతడ్ని చూసి ఆనంద బాష్పాలతో స్వాగతం పలికారు.

ఉగ్రమూక దాడిలో తల్లిదండ్రులను కోల్పోయి...

ఉగ్రమూక దాడిలో తల్లిదండ్రులను కోల్పోయి...

నవంబర్ 26, 2008న పాక్ ముష్కరులు ముంబైపై దాడి చేసి ఎంతో మంది అమాయకులను పొట్టన బెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ దాడిలో మోషే కూడా తన తల్లిదండ్రులను కోల్పోయాడు. ఇజ్రాయిల్ కు చెందిన మోషే, తల్లిదండ్రులు రబ్బీ గాబ్రియేల్ హోల్జ్ బర్గ్, రివికలతో కలసి ముంబైలో ఉంటుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. దక్షిణ ముంబైలోని కొలాబా ప్రాంతంలో ఉన్న నారీమన్ హౌస్‌లో మోషే తల్లిదండ్రులు ఓ సాంస్కృతిక కేంద్రం నడుపుతూ ఉండే వారు. ఉగ్రదాడి సమయంలో మోషేను ఆయా శాండ్రా సామ్యూల్ కాపాడింది.

ప్రస్తుతం మోషేకు 11 ఏళ్లు...

ప్రస్తుతం మోషేకు 11 ఏళ్లు...

ముంబైపై పాక్ ముష్కరుల దాడి తరువాత చిన్నారి మోషే తన ఆయా శాండ్రా సామ్యూల్ తో కలసి ఇజ్రాయిల్‌ వెళ్లిపోయాడు. ఆయా సహా మోషేను ఇజ్రాయిల్ కు తీసుకెళ్లిన ఆ దేశ అధికారులు, వారికి ఇజ్రాయెల్‌లోనే ఆశ్రయం కల్పించారు. అప్పుడు మోషే వయసు 2 ఏళ్లు. ఆ తరువాత ఇజ్రాయెల్‌లోనే పెరిగిన మోషే ప్రస్తుతం 11 ఏళ్ల వయసు వాడయ్యాడు. తన తాత రబ్బీ నాచ్‌మన్ హోల్జ్ బర్గ్ దంపతులతో కలిసి మంగళవారం ముంబైకి తిరిగొచ్చాడు.

తిరిగి ముంబై రమ్మని ఆహ్వానించిన మోడీ...

తిరిగి ముంబై రమ్మని ఆహ్వానించిన మోడీ...


గత ఏడాది జూలైలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇజ్రాయిల్ వెళ్లినప్పుడు, స్వయంగా మోషేను కలుసుకున్నారు. తిరిగి ఎప్పుడైనా భారత్ కు రావచ్చని అతడి తాత రబ్బీ నాచ్‌మన్ హోల్జ్ బర్గ్ దంపతులతో చెప్పారు. ప్రస్తుతం ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహూ ఇండియాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మోషే కూడా మంగళవారం తన తాత, నానమ్మ, ఆయాతో కలిసి భారత్ వచ్చాడు. తొమ్మిదేళ్ల తరువాత తిరిగి ముంబైలో కాలుమోపాడు.

నారీమన్ హౌస్‌ను సందర్శించి...

నారీమన్ హౌస్‌ను సందర్శించి...

తొమ్మిదేళ్ల తరువాత ముంబైలో కాలుపెట్టిన మోషే.. తన తాతతో కలిసి.. తన తల్లిదండ్రులు మరణించిన నారీమన్ హౌస్‌ను సందర్శించాడు. చిన్నప్పుడు మోషేను చూసిన అక్కడి వారు మళ్లీ ఇన్నాళ్లకు అతడ్ని చూసి ఆనంద బాష్పాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అతడి తాత రబ్బీ నాచ్‌మన్ హోల్జ్ బర్గ్ మాట్లాడుతూ ‘ఇది ఎంతో ప్రత్యేకమైన రోజు. మోషేని మళ్లీ ముంబైకి తీసుకొచ్చిన దేవుడికి కృతజ్ఞతలు. ముంబై ఇప్పుడెంతో సేఫ్‌గా ఉంది.. ' అని వ్యాఖ్యానించారు.

ఇంటిని మోషే పేరిట రిజిస్టర్ చేయమని...

ఇంటిని మోషే పేరిట రిజిస్టర్ చేయమని...

తొమ్మిదేళ్ల తరువాత ముంబై నారీమన్ హౌస్‌లోని ఇంటికి మోషే తిరిగొచ్చిన సందర్భంగా.. ఆ ఇంటిని మోషే పేరిట రిజిస్టర్ చేయాల్సిందిగా అతడి తాత రబ్బీ నాచ్‌మన్ హోల్జ్ బర్గ్ భారత రాయబారిని కోరారు. జనవరి 19న ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో కలిసి మోషే ఇజ్రాయెల్ వెళ్లనున్నాడు.

English summary
Moshe Holtzberg, also known as Baby Moshe, who lost his parents in the tragic 26/11 Mumbai terror attacks, arrived in Mumbai on Tuesday after 9 years.11-year-old Moshe Holtzberg accompanied Israeli Prime Minister Benjamin Netanyahu to India on Sunday as he returned for the first time to Nariman House where his parents were killed in the attacks that left 166 people dead. Moshe was two years old when his parents - Rabbi Gavriel Holtzberg and Rivika - were killed during the siege at the Nariman House by 10 Pakistani terrorists in November 2008.The Jewish couple ran a cultural and outreach centre for the Chabad-Lubavitch movement at the Nariman House in South Mumbai's Colaba area. Moshe was accompanied by his grandfather Rabbi Nachman Holtzberg and his wife.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X