విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అలల దాడి: ఆగని కోస్తాంధ్ర తీరం కోత (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: విశాఖపట్నం ఆర్‌కె బీచ్ రోడ్డు కోత ఇంకా కొనసాగుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా సముద్రంలో అలలు ఉద్ధృతంగా రావడంతో బీచ్ రోడ్డు కోతకు గురైన సంగతి తెలిసిందే. చెన్నైకు చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ (ఎన్‌ఐఓ) అధికారులు శుక్రవారం విశాఖ చేరుకున్నారు.

వారితో కలెక్టర్, విశాఖపట్నం పోర్టు, జివిఎంసి అధికారులు సమావేశమై చర్చించారు. బీచ్ కోతకు గల కారణాలపై అధ్యయనం చేసేందుకు కనీసం సంవత్సరం పడుతుందని ఎన్‌ఐఓ అధికారులు తేల్చి చెప్పారు. తాత్కాలిక పునరుద్ధరణకు సూచనలు ఇచ్చేందుకు కనీసం ఒక వారం రోజులు కావాలని కోరారు.

బీచ్ ఒడ్డున సుమారు రెండు లక్షల మీటర్ల ఇసుకనైనా వేయాలని నిర్ణయించారు. ఇసుకను ఔటర్ హార్బర్‌నుంచి తీసుకువచ్చేందుకు టెండరు పిలవాలని కలెక్టర్ సమక్షంలో శుక్రవారం జరిగిన సమావేశంలో నిర్ణయించారు. ఇసుకను డంప్ చేసే బాధ్యతను విశాఖ పోర్టుకు అప్పగించారు. ఈలోగా జివిఎంసి కోతకు గురైన ప్రాంతాన్ని పూడ్చే ప్రయత్నాలు యుద్ధ ప్రాతిపదికన చేస్తోంది. ఆర్‌కె బీచ్ ప్రాంతంలో దెబ్బతిన్న రోడ్డును వారం రోజుల్లో పునరుద్ధరించనున్నట్టు జివిఎంసి అధికారులు తెలియచేశారు.

విశాఖ తీరం కోత

విశాఖ తీరం కోత

కురుసుర సబ్‌మెరైన్ మ్యూజియంకు అటు, ఇటు బీచ్ తీవ్రంగా కోతకు గురైంది. బీచ్ రోడ్డుపై ఉన్న రక్షణ గోడ కూడా కూలిపోయింది.

విశాఖ తీరం కోత

విశాఖ తీరం కోత

గతంలో కన్నా కోత తీవ్రత ఎక్కువగా ఉండడంతో పునరుద్ధరణ పనులు సవాల్‌గా మారాయి. కోతకు గురైన ప్రదేశంలో జివిఎంసి బండ రాళ్లను తీసుకువచ్చి వేస్తోంది. ఇది శాశ్వత పరిష్కారం కాదనే విమర్శలు వస్తున్నాయి.

విమర్శలు వస్తున్నాయి.

విమర్శలు వస్తున్నాయి.

కోతను నివారించడానికి అధికారుల వద్ద ప్రత్యామ్నాయ మార్గాలు లేవనే విమర్శలు వస్తున్నాయి. గతంలో కోతకు గురైనప్పుడు పూణేకు చెందిన బృందం ఇందుకు కారణాలపై అధ్యయనం చేసి వెళ్లింది. దానికి సంబంధించిన నివేదిక ఏమైందీ ఇంకా తెలియలేదు.

సందర్శకుల తాకిడి

సందర్శకుల తాకిడి


బీచ్ సందర్శకులను ఈ రోడ్డుపై అనుమతించడం లేదు. కోతకు గురైన ప్రదేశాన్ని చూడ్డానికి జనం తండోపతండాలుగా వస్తుండడంతో వారిని అరికట్టడం కష్టతరమవుతోంది.

మూడోసారి ఇది...

మూడోసారి ఇది...

కోస్తా తీరం సముద్రం అలల తాకిడికి గురి కావడం 2014లో ఇది మూడోసారి. ఆర్‌కె బీచ్ రోడ్డు బుధవారంనాటి అలల తాకిడికి శిథిలమైంది.

అలలు ఈ ప్రాంతంలోనే..

అలలు ఈ ప్రాంతంలోనే..

అలల తాకిడికి ప్రధానంగా ఆర్‌కె బీచ్, కుసుర సబ్‌మెరైన్ మ్యూజిం మధ్యనే ఎక్కువగా కోతకు గురవుతోంది.

రోజుకు రెండుసార్లు...

రోజుకు రెండుసార్లు...

సముద్ర మట్టం రోజుకు రెండు సార్లు పెరుగుతోంది. దాంతో కోస్తా సమీపంలో ఇసుక రవాణాకు కూడా ఇబ్బంది అవుతోంది.

హుధుద్ తుఫాను తాకిడికే..

హుధుద్ తుఫాను తాకిడికే..

హుధుద్ తుఫాన్ తాకిడికే సబ్‌మెరైన్ మ్యూజియం ప్రాంతంలోని ఇసుక మేటలు చాలా వరకు కొట్టుకుపోయాయి. ప్రస్తుత అలల తాకిడి కూడా ప్రమాదంగా పరిణమించింది.

జనవరిలో ఇలా...

జనవరిలో ఇలా...

2014 జనవరి 31వ తేదీన కుసుర స‌బ్‌మెరైన్ మ్యూజియం సమీపంలోని బీచ్ రోడ్డుపై ఫుట్‌పాత్ కింద మట్టి అంతా కొట్టుకుపోయింది.

జులై మూడో వారంలో..

జులై మూడో వారంలో..

2014 జులై మూడోవారంలో కోస్తా తీరం అలల తాకిడికి గురైంది. దాంతో తీరం కోతకు గురైంది. కోస్తా తీరంలో చెట్లు కూడా కూలిపోయాయి.

మంత్రి సందర్శన..

మంత్రి సందర్శన..

కోతకు గురైన బీచ్ రోడ్డును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు శుక్రవారం సందర్శించారు. ఆయన అధికారులకు తగిన సూచనలు ఇచ్చారు.

English summary
Coastal erosion came back to haunt the city’s beaches for the third time in 2014 when a portion of the Beach Road collapsed on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X