హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గోల్కొండ బోనాలు: లక్షల భక్తుల బారులు(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: గోల్కొండ కోట బోనాల నాలుగో పూజ ఆదివారం ఘనంగా జరిగింది. ఇసుక వేస్తే రాలనంత జనంతో జాతరలాగా సాగింది. ఆదివారం సుమారు ఆరు లక్షల మంది వరకు గోల్కొండకు తరలిరావడంతో సందడిగా మారింది. 24 తొట్టెలను వివిధ ప్రాంతాల నుంచి ఊరేగింపుగా తీసుకురావడంతో ఇక్కడ పండుగ వాతావరణం కనిపించింది.

బోనాల వేడుకల్లో భాగంగా కోటపై కొలువుదీరిన జగదాంబిక అమ్మవారిని దర్శించుకునేందుకు బారులు తీరారు. కోటలో 4వ పూజ ఘనంగా జరిగింది. రద్దీ దృష్ట్యా కోటలోకి ప్రవేశించే బలాహిస్సార్‌ దర్వాజా వద్ద ఉన్న గేటు వద్ద కొద్ది కొద్దిగా నియంత్రించి లోనికి అనుమతించారు.

పశ్చిమ మండలం డీసీపీ వెంకటేశ్వరరావు, టాస్క్‌ఫోర్సు డీసీపీ లింబారెడ్డి, ఆసిఫ్‌నగర్‌ ఏసీపీ గౌస్‌మొయినుద్దీన్‌ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. భక్తులు అక్కన్న మాదన్న కార్యాలయంతో పాటు నగీనాగార్డెన్‌ తదితర ప్రాంతాల్లో బోనాలు తయారుచేసి అమ్మవారికి సమర్పించారు. తెలంగాణ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఉత్సాహంగా సాగాయి.

గొల్కొండ బోనాలు

గొల్కొండ బోనాలు

గోల్కొండ కోట బోనాల నాలుగో పూజ ఆదివారం ఘనంగా జరిగింది. ఇసుక వేస్తే రాలనంత జనంతో జాతరలాగా సాగింది.

గొల్కొండ బోనాలు

గొల్కొండ బోనాలు

ఆదివారం సుమారు ఆరు లక్షల మంది వరకు గోల్కొండకు తరలిరావడంతో సందడిగా మారింది.

గొల్కొండ బోనాలు

గొల్కొండ బోనాలు

24 తొట్టెలను వివిధ ప్రాంతాల నుంచి ఊరేగింపుగా తీసుకురావడంతో ఇక్కడ పండుగ వాతావరణం కనిపించింది.

గొల్కొండ బోనాలు

గొల్కొండ బోనాలు

బోనాల వేడుకల్లో భాగంగా కోటపై కొలువుదీరిన జగదాంబిక అమ్మవారిని దర్శించుకునేందుకు బారులు తీరారు. కోటలో 4వ పూజ ఘనంగా జరిగింది.

గొల్కొండ బోనాలు

గొల్కొండ బోనాలు

రద్దీ దృష్ట్యా కోటలోకి ప్రవేశించే బలాహిస్సార్‌ దర్వాజా వద్ద ఉన్న గేటు వద్ద కొద్ది కొద్దిగా నియంత్రించి లోనికి అనుమతించారు.

గొల్కొండ బోనాలు

గొల్కొండ బోనాలు

పశ్చిమ మండలం డీసీపీ వెంకటేశ్వరరావు, టాస్క్‌ఫోర్సు డీసీపీ లింబారెడ్డి, ఆసిఫ్‌నగర్‌ ఏసీపీ గౌస్‌మొయినుద్దీన్‌ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు.

గొల్కొండ బోనాలు

గొల్కొండ బోనాలు

భక్తులు అక్కన్న మాదన్న కార్యాలయంతో పాటు నగీనాగార్డెన్‌ తదితర ప్రాంతాల్లో బోనాలు తయారుచేసి అమ్మవారికి సమర్పించారు.

గొల్కొండ బోనాలు

గొల్కొండ బోనాలు

తెలంగాణ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఉత్సాహాన్ని నింపాయి.

గొల్కొండ బోనాలు

గొల్కొండ బోనాలు

వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన దాదాపు 21 తొట్టెలను భక్తులు అమ్మవారికి సమర్పించారు.

గొల్కొండ బోనాలు

గొల్కొండ బోనాలు

బ్యాండుమేళాలు, పోతరాజుల విన్యాసాలతో ధూంధాంగా షేక్‌పేట, సబ్జిమండి, అఫ్జల్‌గంజ్‌ తదితర ప్రాంతాల నుంచి తొట్టెలు వూరేగింపుగా వచ్చాయి. లంగర్‌హౌస్‌ నుంచి ఛోటాబజార్‌, బడాబజార్‌ల మీదుగా కోటకు చేరుకున్నాయి.

గొల్కొండ బోనాలు

గొల్కొండ బోనాలు

రాష్ట్రప్రభుత్వం తరపున గోల్కొండ కోటలో బోనాల ఏర్పాట్లు నిర్వహించామని మంత్రి తలసాని అన్నారు.

గొల్కొండ బోనాలు

గొల్కొండ బోనాలు

ఆదివారం సాయంత్రం ఆయన గోల్కొండ కోటకు వచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చూశామన్నారు.

ఉజ్జయిని మహంకాళి బోనాలు

ఉజ్జయిని మహంకాళి బోనాలు

సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయానికి ఆదివారం వేలాది మంది భక్తులు వచ్చారు.

ఉజ్జయిని మహంకాళి బోనాలు

ఉజ్జయిని మహంకాళి బోనాలు

మాజీ కార్పొరేటర్‌ మల్లికార్జున్‌ కుటుంబం అమ్మవారికి తొలి బోనం సమర్పించడం ఆనవాయితీ.

ఉజ్జయిని మహంకాళి బోనాలు

ఉజ్జయిని మహంకాళి బోనాలు

కార్పొరేటర్‌ అరుణగౌడ్‌ కుటుంబ సభ్యులు అమ్మవారికి బోనం సమర్పించారు. మంత్రి తలసాని తొలుత పూజలు చేశారు. భక్తురాలు శ్యామల బోనంతో ర్యాలీగా ఆలయానికి వచ్చారు.

English summary
Telangana Minister Talasani Srinivas Yadav Offered Prayers at Goddess in Golconda fort.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X