వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శేఖర్ కార్టూన్లకు పాతికేళ్లు (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలుగు పత్రికా రంగంలో శేఖర్ కార్టూన్లు ప్రత్యేకతను సంపాదించుకున్నారు. ఆయన కార్టూన్లకు పాతికేళ్లు నిండాయి. ఈ సందర్భంగా ఆయనను తెలుగు పత్రికా రంగం, కార్టూనిస్టుల సమాజం ఆదివారంనాడు ఘనంగా సత్కరించింది. అనారోగ్యంతో బాధపడుతున్న శేఖర్‌ను తెలుగు మేధో ప్రపంచం అక్కున చేర్చుకుంది.

కార్టూనిస్ట్ శేఖర్ కార్టూన్లకు 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆయన స్నేహితులు, సన్నిహితులు కలిసి ఆదివారం ఇక్కడి సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో రజతోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించి ఆయనను సన్మానించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆంధ్రజ్యోతి ఎడిటర్ శ్రీనివాస్ హాజరయ్యారు. 'జీవితం అంటే ఏంటో తెలిసిన మనిషి శేఖర్' అన్నారు. పదునైన విమర్శలతో రాజకీయ కార్టూన్లు వేయగల ధైర్యశాలి శేఖర్ అని, ఎంతటి అనారోగ్యంతో ఉన్నా కార్టూన్లు వేయడం మానలేదని, ఇదే ఆయన పనితనానికి నిదర్శనమని అన్నారు.

తాను ఎన్నో పత్రికల్లో పనిచేశాను గానీ ఆంధ్రజ్యోతిలో తన కార్టూన్లకు లభించిన స్వేచ్ఛ మరే పత్రికలోనూ లభించలేదని, అనారోగ్యంతో బాధపడుతున్న తనకు ఆంధ్రజ్యోతి అండగా నిలిచిందని శేఖర్ చెప్పారు. "నా బాధను తమ బాధగా భావించిన.. నా బాధను పోగొట్టడానికి ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించిన మిత్రులందరికీ రుణపడి ఉంటాను'' శేఖర్ అన్నారు.

ఈ కార్యక్రమంలో పలువురు కార్టూనిస్టులు, శేఖర్ మిత్రులు, శ్రేయోభిలాషులు, అభిమానులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా మద్రాస్ నుంచి సైతం కార్టూనిస్ట్‌లు వచ్చారు.

తెలంగాణ గుండెకాయ..

తెలంగాణ గుండెకాయ..

శేఖర్ కార్టూన్లు తెలంగాణ సమాజం గుండె కాయను పట్టిస్తుంది. గిదీ తెలంగాణ అంటూ ఆయన కార్టూన్ల పుస్తకాన్ని వెలువరించినప్పుడు విశేఖ ప్రజాదరణ లభించింది.

అవర్ లీడర్స్ అంటూ...

అవర్ లీడర్స్ అంటూ...

మన నాయకులు వీరేనంటూ శేఖర్ జాతీయ స్థాయి నాయకుల కేరిచర్లకు ప్రాణం పోశారు. వాటిలో వారి వ్యక్తిత్వాలు కూడా వ్యక్తమవుతాయి.

అనారోగ్యంతో బాధపడుతూ కూడా..

అనారోగ్యంతో బాధపడుతూ కూడా..

అనారోగ్యంతో బాధపడుతూ కూడా శేఖర్ కార్టూన్లు వేయడం మానలేదు. ఆయన నిత్యం తెలుగు ప్రజలను తన కార్టూన్ల ద్వారా పలకరిస్తూనే ఉన్నాడు.

శేఖర్ కోసం...

శేఖర్ కోసం...

కార్టూనిస్టు శేఖర్ కోసం ఆయన మిత్రులు, శ్రేయోభిలాషులు నిలిచారు. ఆయనను సముచితంగా సత్కరించారు.

సతీమణితో ఇలా..

సతీమణితో ఇలా..

జీవితంలో తన ఎదుగుదలకు 30 శాతం కారణం తన మిత్రులు, మరో 30 శాతం కారణం ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ కాగా మిగిలిన 40 శాతం కారణం తన భార్యేనని శేఖర్ తెలిపారు. తన భార్యే లేకుంటే తాను లేనన్నారు.

శేఖర్ కార్టూన్లకు జేజేలు..

శేఖర్ కార్టూన్లకు జేజేలు..

కార్టూనిస్టు శేఖర్‌కు విశేషమైన అభిమానులు ఉన్నారు. శేఖర్ కార్టూన్‌కు ఓ అభిమాని ఇలా జేజేలు పలికాడు

శేఖర్‌తో కుటుంబ సబ్యులు, మిత్రలూ..

శేఖర్‌తో కుటుంబ సబ్యులు, మిత్రలూ..

కార్టూనిస్టు శేఖర్ దంపతులతో మిత్రులు, శ్రేయోభిలాషులు ఇలా సత్కార కార్యక్రమంలో కనిపించారు.

మరిచిపోలేని సంఘటన..

మరిచిపోలేని సంఘటన..

అమెరికా ఆహ్వానంపై ఆదేశ పర్యటనకు వెళ్లిన తొలి తెలుగు కార్టూనిస్ట్ కావడం తన జీవితంలో మరచిపోలేని సంఘటన అన్నారు.

అభిమానమే ఆయుష్షు

అభిమానమే ఆయుష్షు

లక్షల మంది అభిమానులు శేఖర్‌పై చూపిస్తున్న అభిమానమే ఆయనకు ఆయుష్షు పోస్తుందని ఆంధ్రజ్యోతి సంపాదకడు కె.శ్రీనివాస్ అన్నారు.

చంద్ర ఇలా...

చంద్ర ఇలా...

ప్రముఖ చిత్రకారుడు చంద్ర శేఖర్ కార్టూన్ ప్రదర్శనను ప్రారంభించారు. ఆయన పక్కన పక్కన మరో ప్రముఖ చిత్రకారుడు, కార్టూనిస్టు మోహన్‌ను చూడవచ్చు. ప్రముఖ చలన చిత్రదర్శకుడు బి. నర్సింగరావును కూడా చూడవచ్చు.

హిందూ కార్టూనిస్టు సురేంద్ర

హిందూ కార్టూనిస్టు సురేంద్ర

శేఖర్ కార్టూన్ల రజతోత్సవ కార్యక్రమానికి హిందూ కార్టూనిస్టు సురేంద్ర కూడా వచ్చారు. కె. శ్రీనివాస్, నర్సింగరావు, చంద్రలను చూడవచ్చు.

శేఖర్ ఇలా..

శేఖర్ ఇలా..

పాతికేళ్ల తన కార్టూన్లు, చిత్రాల ప్రాభవాన్ని మిత్రుడికి చూసిపస్తూ శేఖర్ ఇలా కనిపించాడు. ఆయన చిత్రాలు గీయడమే వృత్తి.

English summary
Cartoonist sekhar has been fecilitated for completing 25 years in his career as political cartoonist.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X