• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

టీవిలో బాపు గురించిన బ్రేకింగ్ న్యూస్...

By Pratap
|

ఒక్క క్షణం...మైండ్ బ్లాకైందంటారే..అలా

...మరుక్షణం... లేచి అసంకల్పితంగా నా పుస్తకాలు, బీరువా వెతకటం మొదలు పెట్టాను... కొద్ది సేపటకి ఓ అందమైన జ్ఞాపకం... ఈ బాధను మరిపించటానికా అన్నట్లు పలకరించింది.

దాన్ని చూస్తూ...బాపు అనే రెండు అక్షరాలతో నాకెప్పటి నుంచీ పరిచయం... అని ప్రశ్నించుకుంటూ కాలం రంగుల రాట్నం ఎక్కి వెనక్కి ...వెనక్కి వెళ్తూంటే...

అప్పటికే బాపు శకం మొదలైంది...అటు సినిమాలు.. ఇటు కార్టూన్ లు..బొమ్మల రంగవల్లులు ఎటుచూసినా తెలుగు వారిని ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నాయి. దాంతో హటాత్తుగా బాపులా మారిపోవాలని బుద్ది నాలాంటి చాలా మందికి పుట్టింది. అప్పటికే బాపు బొమ్మల్ని చూసి గీస్తున్న అనుభవం ఉంది కనుక...ఇంకా బాగా గీయాలంటే ఏం చేయాలో తెలీక... ఎవర్ని అడగాలో అర్దంకాక ఎలాగో అడ్రస్ సంపాదించా(ఇప్పుడు ఎంత సంపాదించినా ఆ ఆనందం ఏది)...

ఓ నమస్కారం పెట్టి బొమ్మలు గీయాలి. ఎలా... అంటూ ఓ పెద్ద ఉత్తరం రాసేసా...రాసేసింది మొదలు...అసలు ఆయన చదివి ఉంటారా... జవాబు వస్తుందా లేదా...వస్తే ఏం ఉంటుంది అందులో...అంటూ ఆలోచనలు. అయినా ఆయన మనకెందుకు సమాధానం ఇస్తారులే...రోజుకు ఇలాంటి ఉత్తరాలు బోల్డు వస్తూంటాయి..అనే సందేహం..ఎందకంటే అప్పటికే ఆయన స్టారాతి స్టారు. కానీ మా అంచనాలు తలక్రిందులు చేస్తూ రిప్లై ఇచ్చేసారు....ఇదిగో ఇదే అది...

ఈ ఉత్తరం...చదివాక...నా ఫీలింగ్... రచయిత భాషలో చెప్పాలంటే.... మేరు పర్వతం గడ్డి పరకను పలకరించినట్లు... ఒళ్లు పులకరించినట్లు అంటారే...అదే సేమ్ ఫీలింగ్. కానీ ఆయన చెప్పినంత ఈజీ బొమ్మలేయటం కాదు అనేది తర్వాత తర్వాత తెలిసి వచ్చిందనుకోండి. కాలం గడుస్తోంది. ఈ ఉత్తర పరిచయం ఉత్త పరిచయంగా మిగలలేదు. తర్వాత కాలంలో ఈ సారి ఆయనని దగ్గరగా చూసే అదృష్టం కలిగింది.

ఆ రోజు ఆంధ్రా యూనివర్సిటీలో బాపు గారికి కళా ప్రపూర్ణ ప్రధానం. పరుగెట్టుకు వెళ్లి(ఆటోలోనే అనుకోండి) దగ్గరగా చూసాను. మొదటి సారి శిఖర దర్శనం. ఫుల్ ఖుషీ. తర్వాత కాలంలో డైరక్ట్ ఫేస్ టు ఫేస్ ఆయనతో మాట్లాడే అవకాశం వస్తుందనుకోలేదు. ఇది జరిగిన కొన్నాళ్ళకు... బ్రతుకు హైదరాబాద్‌కు తరిమింది.

అక్కడ ఆర్.కె టెలీ షో కి మనో యజ్ఞం అనే సీరియల్ కు రమణగారి అబ్బాయి డైరక్టరు. నేను స్క్రీన్ ప్లే రాస్తూండేవాడ్ని. ఆయన మాటల సందర్బంలో బాపు గారి దగ్గరకు వెళ్తున్నా వస్తారా..అన్నారు. అంతే ఎగురుకుంటూ నేనూ నా సహ రచయిత గంగోత్రి విశ్వనాధ్ కలసి వెళ్లాం. అక్కడకి వెళ్లాక ఆయన రిసీవ్ చేసుకున్న విధానం... ఆయన మాతో మాట్లాడిన మాటలు ఇప్పటికీ ఆశ్చర్యమే. అంత పెద్ద దర్శకుడు మా లాంటి చిన్నవాళ్లతో మాట్లాడటమంటే...

Chadavaram Chaitanya: Remembering Bapu

ఆ మాటల సందర్బంలో...ఆయన ... భాగవతంలో కృష్ణుడు వేషానికి ఓ కుర్రాడు కావాలండీ... మీ ఎరుకలో ఎవరైనా ఉంటే చెప్పండి... అని గ్యాప్ ఇచ్చి....

పెద్ద అందగాడు అక్కర్లేదు... ఎన్టీఆర్ లాగ ఉంటే చాలు అన్నారు. అబ్బో...ఈ అమిత మితభాషి మాట్లాడితే ఇలా ఉంటుందా... అనుకుని అప్పటికి శెలవు తీసుకుని ...నెక్ట్స్ ఆ అవకాసం మా అబ్బాయికే ఎందుకు ఇవ్వకూడదనిపించి వాడిని తీసుకుని వెళ్లాను.

ఆయన మా అబ్బాయిని చూసి... ఇంతకు ముందేమైనా చేసావా అన్నారు

మావాడు...ఒక చిన్న సినిమా లో చేసాను అన్నాడు.

వెంటనే ఆయన చిన్న సినిమా అంటే... అరగంటే ఉంటుందా... అని నవ్వారు. ఆయన దృష్టిలో చిన్నా, పెద్దా లేదు... సినిమా అంటే సినిమానే.

అదే ఆయన్ను ప్రత్యక్ష్యంగా ఆఖరి సారి చూడటం...

అంత గొప్పగా, గీయడం, అంత గొప్పగా సినిమాలు తీయడం, అంత పని... బహుశా ఐదారు జన్మలకి సరిపడే బండ చాకిరీని ఒక్క జన్మలోనే చేసిన వాళ్లు ...ఇంత కళాత్మకంగా చేసిన వాళ్లు భారతదేశంలోనే కాదు ప్రపంచలోనే లేరు. ఒకవేళ ఉంటే వాళ్లకీ నా సాష్టాంగ ప్రమాణాలు.

ఇంతకీ ఇప్పుడాయన ఎక్కడ ఉంటారు...

స్వర్గంలో .... నందనోద్యానవనంలో

బంగారుతూగుటుయ్యాల నెమ్మదిగా ఊగుతోంది...

అందులో కూర్చుని రమణగారు భాగవత కథలు చెప్తూండగా... మునులు, రుషులు పరవశులై వింటున్నారు.

ప్రక్కన అప్పుడే అక్కడికి వచ్చిన బాపు నెమ్మదిగా,నిశ్శబ్దంగా చిన్నగా నవ్వుతూ వచ్చి, రమణ ప్రక్కన కూర్చున్నారు. రమణ కళ్లలో రాముడు కనిపించినంత వెలుగు... అది చూసిన దేవుళ్ల, దేవతల కళ్లు చెమర్చాయి.

- చోడవరం చైతన్య (సినీ రచయిత)

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A cine writer Chodavaram Chaitanya has remembered his experoence with Bapu, the graet director of Telugu film world.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more