• search
 • Live TV
గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ఆడపిల్ల అని సరోగసి మోసం: తప్పించుకున్న దంపతులు

By Swetha Basvababu
|

హైదరాబాద్‌: మాతృత్వం అంటే ఏ వనితకైనా ఆనందమే మరి. అది జీవితంలో వచ్చే అత్యద్భుతమైన అనుభూతి. కొందరు దంపతులకు పిల్లలు పుట్టే బాగ్యం లేక గతంలో పలు ఇక్కట్ల పాలయ్యే వారు.

టెక్నాలజీ పురోభివృద్ధి సాధించిన తరుణంలో వారంతా అద్దె గర్భం ద్వారా తల్లయ్యే అదృష్టం సంపాదించుకుంటున్నారు. కానీ దాంట్లోనూ ఆడపిల్ల అంటే వెగటు పుట్టడం ఇబ్బందికర పరిణామం. సరోగసీ (అద్దెగర్భం) ప్రక్రియ మరో అమాయక మహిళ పాలిట శాపంగా మారింది.

గుంటూరు జిల్లా జంట... మహబూబ్‌నగర్ జిల్లా మహిళను ఆమె మానాన ఆమెను వదిలేసి ముఖం చాటేసిన ఘటన హైదరాబాద్ నగర పరిధిలో వెలుగు చూసింది.

గర్భంలో పెరుగుతున్నది ఆడపిల్ల అని తెలియడంతో 'సరోగసీ' దంపతులు ఆమెను నిర్దాక్షిణ్యంగా వదిలేశారు. పుట్టేబిడ్డకు, తమకు ఎలాంటి సంబంధం లేదంటూ అర్ధంతరంగా వెళ్లిపోయారు.

Cheating surrogacy revealed in Hyderabad

సరోగసీ ప్రక్రియను చేసిన వైద్యులూ ఆమెను మోసం చేశారు.

నెలలు నిండి దిక్కుతోచని స్థితిలో పడిపోయిన ఆమె హైదరాబాద్‌లోని పేట్లబురుజు ప్రసూతి ఆస్పత్రిలో చేరింది.

మూడు రోజుల కిందట పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. నా అన్నవారు లేక, పట్టించుకునే వారు లేక, అనారోగ్యంతో సతమతమవుతోంది.

ఈ సరోగసీ, మోసం విషయం బయటపడకుండా యత్నాలు జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ప్రస్తుతం పేట్లబురుజు ఆస్పత్రిలో ఆమెను అత్యవసర విభాగంలో ఉంచి, అటువైపు ఎవరూ వెళ్లకుండా భద్రత ఏర్పాటు చేయడం గమనార్హం.

రహస్యంగా డీఎంహెచ్ఓ, పోలీసులకు ఇలా ఫిర్యాదు

పేట్లబురుజు ఆస్పత్రి సూపరింటెండెంట్‌ నాగమణి.. ఈ వ్యవహారంపై జిల్లా వైద్యాధికారికి, చార్మినార్‌ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో చార్మినార్‌ పోలీసులు, జిల్లా వైద్యాధికారి పేట్లబురుజు ఆస్పత్రికి వచ్చి బాధితురాలితో మాట్లాడారు. కానీ ఈ విచారణ గుట్టుగా సాగడం గమనార్హం. కాగా బాధిత మహిళను ఆదివారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేసే అవకాశం ఉన్నదని సమాచారం.

  Man cheats girls in name of fake movie chances in Visakhapatnam

  నిబంధనలకు విరుద్ధంగా సరోగసీ చేసి, ఇప్పుడు వదిలేసిన ఆస్పత్రి యాజమాన్యం, దంపతుల విషయం బయటపడకుండా ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అందుకోసమే ఈ విషయంలో గోప్యత పాటిస్తున్నారని పేట్లబురుజు ఆస్పత్రి సిబ్బందే పేర్కొన్నారు. మీరైనా ఆ మహిళకు న్యాయం చేయాలని వారు వాపోవడం గమనార్హం. ప్రస్తుతం బాధిత మహిళకు సరోగసీలో మధ్యవర్తిగా వచ్చిన మహిళే సహాయకురాలిగా ఉందని.. ఆమె వెళ్లిపోతానంటే పోలీస్‌ కేసు పెడతామని బెదిరించడంతో ఉండిపోయిందని వారు తెలిపారు.

  ఇలా మొదలైన ప్రక్రియ

  మహబూబ్‌నగర్‌ జిల్లా అడ్డాకులకు చెందిన ఓ మహిళ (24) భర్తతో విభేదాల వల్ల కొంతకాలంగా భర్త నుంచి దూరంగా ఉంటోంది. ఆమెకు ఏడాది కింద ఓ మధ్యవర్తి ద్వారా గుంటూరు జిల్లాకు చెందిన దంపతులు పరిచయమయ్యారు. వారికి పిల్లలు లేకపోవడంతో.. సరోగసీ విధానంలో వారికి బిడ్డను కని ఇవ్వడానికి అంగీకారం కుదిరింది.

  ఇందుకు మరో మహిళ మధ్యవర్తిగా వ్యవహరించింది. హైదరాబాద్‌లోని ఎర్రగడ్డ ప్రాంతంలో ఉన్న ఓ ఆస్పత్రిలో 'సరోగసీ' ప్రక్రియను చేయించుకున్నారు. సుధారాణికి ఎనిమిదో నెల వచ్చే వరకు అంతా బాగానే ఉంది. తొమ్మిదో నెలలో స్కానింగ్‌ చేసినప్పుడు పుట్టబోయేది ఆడపిల్ల అని ఆ ఆస్పత్రి వైద్యులు చెప్పారు. దీంతో బిడ్డను పొందాలనుకున్న దంపతులు 'సరోగసీ'మహిళను అర్ధంతరంగా వదిలేశారు. పుట్టబోయే బిడ్డకు తమకు సంబంధం లేదంటూ వెళ్లిపోయారు. సరోగసీ ప్రక్రియ చేసిన ప్రైవేట్ ఆస్పత్రి ఆ మహిళను రానివ్వలేదు.

  అనాథలా పేట్లబురుజు హాస్పిటల్‌లో ప్రసవం

  ఆ మహిళకు ప్రసవ నొప్పులు రావడంతో సరోగసీకి మధ్యవర్తిగా వ్యవహరించిన మరో మహిళ ఆమెను హైదరాబాద్‌లోని పేట్లబురుజు ప్రసూతి ఆస్పత్రికి తీసుకొచ్చింది. ఈ నెల 20న మధ్యాహ్నం 12 గంటలకు ఆస్పత్రిలో చేర్చగా, అదే రోజు మధ్యాహ్నం 2.40 గంటలకు పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. పాప 2.9 కేజీల బరువుతో ఆరోగ్యంగా ఉందని వైద్యులు తెలిపారు. తల్లి మాత్రం తీవ్ర రక్తహీనతతో బాధపడుతూ.. అనారోగ్యంతో ఉందని తెలిసింది. చట్టవిరుద్ధంగా జరిగిన 'సరోగసీ', మోసం జరిగిన విషయాలు బయటపడకుండా ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అందులో భాగంగా తల్లీబిడ్డలను ప్రత్యేకంగా ఐసీయూలో ఉంచారని.. ఎవరూ అటువైపు వెళ్లకుండా భద్రత ఏర్పాటు చేశారని చెబుతున్నారు.

  బయటపడింది ఇలా

  సుధారాణికి సాధారణ ప్రసవం జరిగి బిడ్డ ఆరోగ్యంగా ఉన్నా కూడా.. ఆస్పత్రి సూపరింటెండెంట్‌ ఆ పాపను నర్సరీ విభాగానికి పంపారు. నర్సులు పాపను నర్సరీకి తీసుకెళ్లగా.. అక్కడి ఇన్‌చార్జి వైద్యురాలు బిడ్డను పరిశీలించి, 'ఆరోగ్యంగానే ఉంది కదా.. ఎందుకు తెచ్చారు?'అని నిలదీశారు. పాప వివరాలన్నీ ఇవ్వాలని కోరగా.. నర్సులు పత్రాలన్నీ తెచ్చి ఇచ్చారు.

  వాటిని పరిశీలించిన వైద్యురాలు... ఓ ప్రైవేటు ఆస్పత్రిలో సరోగసీ ద్వారా బాధిత మహిళ గర్భం దాల్చినట్లు గుర్తించారు. ఆరోగ్యంగా ఉన్న పాపను నర్సరీలో ఉంచాల్సిన అవసరం లేదని, తల్లివద్దే ఉంచాలని స్పష్టం చేశారు. దీంతో పాపను ఐసీయూకు మార్చారు. పాపకు ఏమైనా అయితే తీవ్ర సమస్యలు వస్తాయని.. తల్లీబిడ్డ డిశ్చార్జి అయ్యేవరకు కంటికి రెప్పలా కాపాడాలని సూపరింటెండెంట్‌ పీజీ వైద్యులకు సూచించినట్లు ఓ పీజీ విద్యార్థిని తెలిపారు.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Sarogacy cheating is revealed in Hyderabad. A Guntur couple approached Mahaboob Nagar Women for surrogacy process but in 9th month scanning revealed that girl infant. So, Guntur couple has left the hyderabad and sarogacy processed hospital also closed the doors. In this context Mahaboob nagar women admitted in Peetla burju hospital and delivered but hospital authorities kept it secrecy.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more