విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నిజమైన హీరోలు వారే: నటి సమంత(ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: 'అందరికీ మంచి జరగాలని, మంచి చేయాలని చాలా మంది కోరుకుంటారు. కానీ ఆ మంచి ఎలా చేయాలో తెలీదు. అలాంటి వారు అవయదానం చేస్తే బాగుంటుంది' అని అన్నారు సినీ నటి, ప్రత్యూష సపోర్ట్ వ్వవస్థాపకులు సమంత. జీవన్‌దాన్, ప్రత్యూష సపోర్ట్‌తో కలిసి మాక్య్‌క్యూర్ హాస్పిటల్ అవయవదాన ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని మాదాపూర్‌లోని ట్రైడెంట్ హోటల్‌లో శనివారం నిర్వహించింది.

ఈ కార్యక్రమంలో తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ, బాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీ చంద్‌తో పాటు జీవన్‌దాన్ ఛైర్మన్, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ ఎం రమణి, అనిల్ కృష్ణ, డాక్టర్లు మంజుల, శరత్ రెడ్డి, కృష్ణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

నిజమైన హీరోలు వారే: నటి సమంత

నిజమైన హీరోలు వారే: నటి సమంత


ఈ సందర్భంగా మరణాంతరం లేదా మెడికల్‌గా బ్రెయిన్‌డెడ్ అయినట్లు డాక్టర్లు నిర్ధారించిన సమయంలో తన అవయవాలని తీసుకుని అవసరమైన వారికి అమర్చేందుకు తన సమ్మతిని సమంత తెలియజేయడంతో పాటుగా అతిథుల చేత కూడా ప్రమాణం చేయించారు.

నిజమైన హీరోలు వారే: నటి సమంత

నిజమైన హీరోలు వారే: నటి సమంత


అనంతరం అనురాగ్ శర్మ మాట్లాడుతూ తాను ఇప్పటికే మూడుసార్లు అవయవదానం చేస్తానని వాగ్ధానం చేశానని చెబుతూ ఓ పోలీస్‍‌గా తాను మరణాన్ని అతి దగ్గరగా చూస్తుంటానని అన్నారు.

నిజమైన హీరోలు వారే: నటి సమంత

నిజమైన హీరోలు వారే: నటి సమంత


మెడికల్‌గా బతికే అవకాశాలు లేవనే సందర్భంలో ఆ వ్యక్తి కుటుంబ సభ్యులు అవయవదానం వైపు మొగ్గుచూపితే బాగుంటుంది అని అన్నారు.

 నిజమైన హీరోలు వారే: నటి సమంత

నిజమైన హీరోలు వారే: నటి సమంత


అవయవదానం కేసులు వస్తే తాము గ్రీన్ కారిడార్ రూపొందించటంలో సహాయపడతామని ఈ సందర్భంగా తెలిపారు. అనిల్ కృష్ణ మాట్లాడుతూ ఒకరు అవయవదానం చేయడం వల్ల కనీసం ఆరుగురిని బతికించవచ్చు అని అన్నారు.

నిజమైన హీరోలు వారే: నటి సమంత

నిజమైన హీరోలు వారే: నటి సమంత


బాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీ చంద్‌ మాట్లాడుతూ అవయవదానానికి సంబంధించి ఓ మొబైల్ యాప్‌ని క్రియేట్ చేస్తే బాగుంటుందని సూచించారు.

English summary
The actress is organising “The Organ Donation Pledge” campaign on Saturday at a hotel in Madhapur. Not only will she take the pledge to donate her organs, she also wants her fans to do the same. “We just had a Rota virus campaign for babies in Vijayawada, free vaccinations,” informs the actress, adding that a lakh babies die every year from it.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X