హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

24 గంటల్లో 2,176సార్లు: తెలుగు యువకుడి రికార్డ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

City youth sure of Guinness record
హైదరాబాద్: రూబిక్స్ క్యూబ్‌ను కలపడం ద్వారా తెలుగు యువకుడు గిన్నిస్ రికార్డ్‌లో స్థానం దక్కించుకోనున్నాడు. కాలక్షేపం కోసం రూబిక్స్ క్యూబ్ ను చాలామంది చేతితో పట్టుకుని అన్ని రంగులను ఒక క్రమంలోకి తేవడానికి ప్రయత్నిస్తుంటారు. ఒకసారి అలా తేవడమే చాలా కష్టం.

అయితే అదే రూబిక్స్ క్యూబ్‌ను కొన్ని వేలసార్లు కలిపి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణానికి చెందిన యువకుడు రికార్డ్ సృష్టించాడు. ఎం.ఫార్మసీ పూర్తిచేసి, బెంగళూరులోని క్విన్‌టైల్స్‌లో పని చేస్తున్న గాదిరాజు కృష్ణంరాజు రూబిక్స్ క్యూబ్‌లను కలపడంలో రికార్డు సృష్టించాడు.

24 గంటల వ్యవధిలో 2,176 సార్లు క్యూబ్‌లను కలపడం ద్వారా ఈ రికార్డు సృష్టించాడు. హైదరాబాద్‌లో శనివారం మధ్యాహ్నం ఒంటి గంటకు రికార్డు నమోదుకు దిగిన కృష్ణంరాజు ఆదివారం మధ్యా హ్నం ఒంటి గంటకు 2,176 మార్లు వీటిని కలిపి గిన్నీస్‌రికార్డు సృష్టించాడు.

రూబిక్స్ క్యూబ్ క్రీడకు సంబంధించి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన జడ్జి షణ్ముఖ్ ఆధ్వర్యంలో ఈ రికార్డు నమోదైంది. 1000 సార్లు కలిపితే గిన్నిస్ రికార్డు సాధించినట్లే. అటువంటిది కృష్ణంరాజు ఏకంగా అంతడు రెండు రెట్లు రూబిక్స్ క్యూబ్‌లను కలిపి సరికొత్త రికార్డును సృష్టించాడు.

అలాగే రూబిక్స్ క్యూబ్‌ను కృష్ణంరాజు రెండు చేతులతో 14 సెకన్లలో, ఒకచేత్తో 29 సెకన్లలో పూర్తి చేసి మరో రికార్డు సృష్టించాడు. కృష్ణంరాజు తండ్రి గాదిరాజు వెంకట నర్సింహరాజు రహదారుల శాఖలో ఉద్యోగి. తల్లిదండ్రుల స్ఫూర్తితో కృష్ణంరాజు ఈ అరుదైన రికార్డు సాధనకు దిగాడు.

తెలుగు పద్యానికి ప్రపంచస్థాయి గుర్తింపు లభించింది. ప్రముఖ సినీ కవి, దర్శకుడు జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు రచించిన నైమిశ వెంకటేశ శతకంలోని 108 పద్యాలను 1850 మంది ధారణ పట్టి ఏకకాలంలో ఏక కంఠంతో గానం చేశారు.

గుంటూరులోని సంపత్ నగర్లోని శ్రీ శారదాపరమేశ్వరి అమ్మవారి దేవాలయ ప్రాంగణంలో ఆదివారం ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులు పరిశీలించారు. 108 పద్యాల గానం అనంతరం తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఫౌండర్ డైరెక్టర్ చింతపట్ల వెంకటాచారి తమ సంస్థ తరఫున కార్యక్రమాన్ని ప్రపంచ రికార్డుగా ప్రకటించారు.

English summary
Guess how many Rubik’s cubes a person can solve within 24 hours? The answer to that would be a record-creating 2176 if K. Raju Gadiraju, is to be believed. The 25-year old, who began the arduous task to crossing the 1000 mark to create a Guinness record at Prasad’s Imax on Saturday, far exceeded his own expectations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X