వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కృష్ణం వందే జగద్గురమ్‌లో కెసిఆర్ భార్య (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ ధర్మదాయ శాఖ, తిరుమల తిరుపతి దేవస్థానం, సర్వార్థ సంక్షేమ సమితి సంయుక్త్ధ్వార్యంలో హైదరాబాదు నగరంలోని టిటిడి కల్యాణ మండపంలో ‘కృష్ణం వందే జగద్గురుం శ్రీ మద్భాగవత సప్తాహం 'శుక్రవారం ప్రారంభమైంది. పరమహంస, పరివ్రాజకాచార్య, జగద్గురు, శ్రీ సిద్దేశ్వరి పీఠాధిపతి- కుర్తాళం శ్రీశ్రీశ్రీ సిద్ధేశ్వరానంద భారతీస్వామీ భాగవత ప్రవచనములు ప్రారంభమయ్యాయి.

ఈనెల 21వరకు జరగనున్న కార్యక్రమాన్ని శుక్రవారం సాయంత్రం తెలంగాణ రాష్ట్ర దేవాదాయ ధర్మదాయ శాఖ ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణచారి అతిధులుగా హజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు సతీమణి శోభ హాజర్యాయురు హైకోర్టు న్యాయమూర్తి నూతి రామ్మోహన్‌రావు, దేవాదాయశాఖ కమిషనర్ శివశంకర్, సరస్వతి ఉపాసకులు దైవజ్ఞశర్మ, సర్వార్థ సంక్షేమ సమితి అధ్యక్షుడు పివి మనోహర్‌రావు హజరయ్యారు.

దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. వారం రోజుల పాటు మహాభారత ప్రవచనాల కార్యక్రమాన్ని నిర్వహిస్తుండటం సందేశాత్మకం అని అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ భక్తిపర్వంతో యాదగిరి గుట్ట ఆలయాన్ని ప్రసిద్ధి చేయటానికి అనేక కార్యక్రమాలు చేపట్టారని అన్నారు.

దేవాలయాల అభివృద్ధికి కృషి

దేవాలయాల అభివృద్ధికి కృషి

తెలంగాణలోని దేవాలయాల పునరుద్ధరణకు ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చెప్పారు. న్యాయమూర్తి నూతి రామ్మోహన్‌రావు మాట్లాడుతూ భక్తిమార్గం ద్వారా భగవంతుడ్ని చేరుకోవటం సులభం అన్నారు.

భక్తి మార్గానికి...

భక్తి మార్గానికి...

భక్తిమార్గానికి, భాగవతానికి మంచిన సులువైన మార్గం లేదని
కమిషనర్ శివశంకర్ అన్నారు. దైవజ్ఞశర్మ మాట్లాడుతూ జీవనముక్తికి భాగవతం మార్గమని, సద్గతికి భాగవతం మార్గం సుగమం చేస్తుందన్నారు.

దేవుడున్నాడన్న భావన

దేవుడున్నాడన్న భావన

తెలంగాణ ప్రభుత్వ సలహాదారు రమణాచారి స్వాగతోపన్యాసం చేస్తూ భక్తి భావన పెంపొందించేందుకు, ఈ రోజుల్లో దేవుడున్నాడన్న భావన పెంచటంతోపాటు ప్రజల్లో ఆధ్యాత్మిక పెంపొందించేందుకు ఈ ప్రవచన కార్యక్రమాలు ఎంతో దోహద పడతాయని చెప్పారు.

అభిభాషణ

అభిభాషణ

భక్తజనాన్ని ఉద్ధేశించిన స్వామీజి అనుగ్రహభాషణం చేశారు. వ్యాస మహార్షి సంస్కృతంలో అందించిన భాగవతంను బమ్మెర పోతన తెలుగులో అనువదించినట్లు తెలిపారు. భాగంగా ప్రతిరోజు సాయంత్రం ఆరున్నర గంటల నుంచి ఎనిమిదిన్నర వరకు ప్రవచనాలు కొనసాగుతాయని నిర్వాహకులు పివి మనోహర్‌రావు వెల్లడించారు.

English summary
Telangana CM K Chandrasekhar Rao's wife Shobha participated Krishnam Vande Jagadgurom programme in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X