వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రొఫెసర్ ఉద్యోగం ఇస్తానంటే వద్దన్నా: బాబు(ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: అభివృద్ధి పరంగా రాబోయే రోజుల్లో భారత్, చైనాల మధ్యే పోటీ ఉంటుందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. సోమవారం నాడు విశాఖలో ఏర్పాటు చేసిన ప్రతిభా పురస్కారాల కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశాఖలో నాలెడ్జ్‌ మిషన్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం విద్యార్ధులకు ప్రతిభా పురస్కారాలను అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం ప్రంగించారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం వేగంగా అభివృద్ధి చెందుతోందని, చైనాను అధిగమించే శక్తి మనకు ఉందని అన్నారు. విభజన సమస్యలను సవాల్‌గా తీసుకొని ముందుకు సాగుతామన్నారు. సంక్షోభంలోనే అవకాశాలుంటాయని, దొరికిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ముందుకుపోవాలని ముఖ్యమంత్రి విద్యార్ధులకు సూచించారు.

 ప్రొఫెసర్ ఉద్యోగం ఇస్తానంటే వద్దన్నా: బాబు

ప్రొఫెసర్ ఉద్యోగం ఇస్తానంటే వద్దన్నా: బాబు

అభివృద్ధి పరంగా రాబోయే రోజుల్లో భారత్, చైనాల మధ్యే పోటీ ఉంటుందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. సోమవారం నాడు విశాఖలో ఏర్పాటు చేసిన ప్రతిభా పురస్కారాల కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు.

 ప్రొఫెసర్ ఉద్యోగం ఇస్తానంటే వద్దన్నా: బాబు

ప్రొఫెసర్ ఉద్యోగం ఇస్తానంటే వద్దన్నా: బాబు

ఈ సందర్భంగా విశాఖలో నాలెడ్జ్‌ మిషన్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం విద్యార్ధులకు ప్రతిభా పురస్కారాలను అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం ప్రంగించారు.

 ప్రొఫెసర్ ఉద్యోగం ఇస్తానంటే వద్దన్నా: బాబు

ప్రొఫెసర్ ఉద్యోగం ఇస్తానంటే వద్దన్నా: బాబు

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం వేగంగా అభివృద్ధి చెందుతోందని, చైనాను అధిగమించే శక్తి మనకు ఉందని అన్నారు. విభజన సమస్యలను సవాల్‌గా తీసుకొని ముందుకు సాగుతామన్నారు.

 ప్రొఫెసర్ ఉద్యోగం ఇస్తానంటే వద్దన్నా: బాబు

ప్రొఫెసర్ ఉద్యోగం ఇస్తానంటే వద్దన్నా: బాబు

సంక్షోభంలోనే అవకాశాలుంటాయని, దొరికిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ముందుకుపోవాలని ముఖ్యమంత్రి విద్యార్ధులకు సూచించారు.

 ప్రొఫెసర్ ఉద్యోగం ఇస్తానంటే వద్దన్నా: బాబు

ప్రొఫెసర్ ఉద్యోగం ఇస్తానంటే వద్దన్నా: బాబు

2025 నాటికి ఇంగ్లీష్‌ అధికంగా మాట్లాడే దేశంగా భారత్‌ ఎదుగుతుందని అభిప్రాయపడ్డారు. ఐటీ ఉద్యోగులు మనదేశంలోనే అధికంగా ఉన్నారని, రాబోయే రోజుల్లో భారత్‌, చైనా మధ్యే పోటీ ఉంటుందన్నారు.

 ప్రొఫెసర్ ఉద్యోగం ఇస్తానంటే వద్దన్నా: బాబు

ప్రొఫెసర్ ఉద్యోగం ఇస్తానంటే వద్దన్నా: బాబు

సరైన ప్రణాళికతో పనిచేస్తే అనుకున్న లక్ష్యాలను సాధించొచ్చని పేర్కొన్న ఆయన ఈ సందర్భంగా తెలుగు తేజం సత్య నాదెళ్ల గురించి మాట్లాడారు.

 ప్రొఫెసర్ ఉద్యోగం ఇస్తానంటే వద్దన్నా: బాబు

ప్రొఫెసర్ ఉద్యోగం ఇస్తానంటే వద్దన్నా: బాబు

"ఎస్వీ యూనివర్సిటీలో ఒకరోజున అక్కడ పనిచేస్ వైస్ ఛాన్సలర్ నాకు ప్రొఫెసర్ ఉద్యోగం ఇస్తానంటే వద్దన్నాను. ప్రజాసేవ చేస్తే బాగుంటుందనుకున్నా. ఆ సంకల్పంతోనే ఈ స్ధాయికి వచ్చాను" అని చంద్రబాబు విద్యార్ధులకు చెప్పారు.

 ప్రొఫెసర్ ఉద్యోగం ఇస్తానంటే వద్దన్నా: బాబు

ప్రొఫెసర్ ఉద్యోగం ఇస్తానంటే వద్దన్నా: బాబు

హైదరాబాద్, బెంగుళూరు, చెన్నైలతో పోటీ పడాలంటే కేంద్ర సాం అందాలని ప్రధాని మోడీ, కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ ఈ మేరకు హామీ ఇచ్చారని చంద్రబాబు అన్నారు.

 ప్రొఫెసర్ ఉద్యోగం ఇస్తానంటే వద్దన్నా: బాబు

ప్రొఫెసర్ ఉద్యోగం ఇస్తానంటే వద్దన్నా: బాబు

కోస్తా తీరంలో ఉండే రాష్ర్టాలు ఎంతో అభివృద్ధి చెందాయని, కోస్తాను ఎగుమతులు, దిగుమతులకు స్థావరంగా మారుస్తామని అన్నారు.

 ప్రొఫెసర్ ఉద్యోగం ఇస్తానంటే వద్దన్నా: బాబు

ప్రొఫెసర్ ఉద్యోగం ఇస్తానంటే వద్దన్నా: బాబు

నైపుణ్యం, విజ్ఞానం గల విద్యార్ధి లోకం ప్రభుత్వానకి తమ వంతు సహకరించాలని కోరారు. కళాశాల స్ధాయిలోనే విద్యార్ధులు కొత్త ఆవిష్కరణలు చేసేలా నాలెడ్జి మిషన్ కార్యక్రమాన్ని ప్రారంభించామని చెప్పారు.

 ప్రొఫెసర్ ఉద్యోగం ఇస్తానంటే వద్దన్నా: బాబు

ప్రొఫెసర్ ఉద్యోగం ఇస్తానంటే వద్దన్నా: బాబు

టెక్నాలజీతో ఎన్నో లాభాలున్నాయన్న ఆయన రాబోయే రోజుల్లో వర్సిటీల్లో వైఫై సౌకర్యం కల్పిస్తామని, ప్రతి ఇంటికి ఇంటర్నెట్‌ కనెక్షన్‌ ఇస్తామని హామీ ఇచ్చారు.

 ప్రొఫెసర్ ఉద్యోగం ఇస్తానంటే వద్దన్నా: బాబు

ప్రొఫెసర్ ఉద్యోగం ఇస్తానంటే వద్దన్నా: బాబు

మన రాష్ట్రంలో ప్రతి ఇంట్లో ఒక ఐటీ ఉద్యోగి, మరో ఐటీ పెట్టుబడిదారు ఉండాలన్నదే తమ అభిమతమని చెప్పారు.

 ప్రొఫెసర్ ఉద్యోగం ఇస్తానంటే వద్దన్నా: బాబు

ప్రొఫెసర్ ఉద్యోగం ఇస్తానంటే వద్దన్నా: బాబు

‘‘హుద్‌హుద్‌ తుపాను వచ్చినప్పుడు అందరూ విశాఖ పని అయిపోయిందన్నారు. కానీ విశాఖకు ఇప్పుడు తిరుగుండదు'' అని సీఎం పేర్కొన్నారు. విశాఖను ఎడ్యూకేషన్‌, టూరిస్ట్‌, ఇండస్ర్టియల్‌ హబ్‌గా తీర్చిదిద్దుతామని, విశాఖ నుంచి కాకినాడ వరకు బీచ్‌ రోడ్‌ నిర్మిస్తామని సీఎం బాబు వెల్లడించారు.

English summary
The state government is working towards providing technology along with quality education. Availing the opportunities optimally and coming out as best entrepreneurs is the responsibility of the students, Chief Minister N Chandrababu Naidu has said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X