వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోచ్ ఎంపికలో ట్విస్ట్, కుంబ్లే కంపెనీలో లక్ష్మణ్‌కు షేర్లు

|
Google Oneindia TeluguNews

ముంబై: టీమిండియా హెడ్ కోచ్‌గా అనిల్ కుంబ్లే ఎంపిక పైన కొత్త కోణం వెలుగు చూసింది! హెడ్ కోచ్ రేసులో రవిశాస్త్రి కూడా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే, సెలక్టర్లు కుంబ్లే వైపు మొగ్గు చూపారు. తనను ఎంపిక చేసుకోకపోవడంపై రవిశాస్త్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయమై గంగూలీ-శాస్త్రి మధ్య వాగ్యుద్ధం సాగింది.

కోచ్‌గా కుంబ్లేను ఎంపిక చేసిన కమిటీలో సచిన్ టెండుల్కర్, వీవీఎస్ లక్ష్మణ్, సౌరవ్ గంగూలీ తదితరులు ఉన్నారు. ఈ కమిటీ సూచన మేరకే కుంబ్లే ఎంపికయ్యారు. కుంబ్లే ఎంపిక.. 'పరస్పర ప్రయోజన' కోణం కనిపిస్తున్నట్లుగా ఉందని ఆంగ్ల మీడియాలో వార్తలు వచ్చాయి.

kumble-laxman

కుంబ్లే క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన తర్వాత, 2011లో టెన్విక్ స్పోర్ట్స్ పేరిట ఓ కంపెనీని పెట్టాడు. టెన్నిస్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణే, టేబుల్ టెన్నిస్ క్రీడాకారుడు శరత్ కమల్‌లు కూడా కుంబ్లే కంపెనీలో షేర్ హోల్డర్లు.

ఈ కంపెనీతో వీవీఎస్ లక్ష్మణ్ 2012లో 16,666 ఈక్విటీ షేర్లను కొన్నాడు. ఆ షేర్లు ఈ ఏడాది ప్రారంభం నాటికి రెట్టింపయ్యాయి. ప్రస్తుతం టెన్వీ స్పోర్ట్స్‌లో లక్ష్మణ్‌కు 33,332 షేర్లు ఉన్నాయి. తాను పెట్టుబడి పెట్టిన కంపెనీ అధినేతగా ఉన్నందునే లక్ష్మణ్ కోచ్ పదవికి... కుంబ్లేను ఎంపిక చేశారన్న వాదనలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో కుంబ్లే కంపెనీలో లక్ష్మణ్‌కు వాటాలున్న సంగతి సచిన్, గంగూలీలకు తెలుసో లేదో తెలియదని చెబుతున్నారు.

English summary
Interviewer VVS Laxman and interviewee Anil Kumble 'business partners'?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X