వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘కాకా’ కన్నుమూత: కెసిఆర్, బాబు నివాళి(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రాజకీయ కురువృద్ధుడు, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) మాజీ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి గడ్డం వెంకటస్వామి (కాకా) సోమవారం రాత్రి కన్నుమూశారు. ఏడున్నర నెలలక్రితం తన ఫామ్‌హౌస్‌లో కాలు జారిపడిన కాకా, అప్పటినుంచి బంజారాహిల్స్‌లోని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందారు. కిడ్నీ సంబంధిత వ్యాధికూడా సోకడంతో 92 ఏండ్ల కాకా ఆరోగ్య పరిస్థితి ఆదివారం రాత్రి విషమించింది.

వైద్యులు ఆయనను ఐసీయూలో ఉంచి డయాలసిస్ చేస్తుండగానే సోమవారం రాత్రి 8.45 గంటలకు మరణించారు. ఆయన మరణ వార్త తెలియగానే వివిధ పార్టీలకు చెందిన నాయకులు కేర్ ఆస్పత్రికి తరలివచ్చారు. కాకా అమర్ రహే అంటూ అభిమానులు నినాదాలు చేస్తుండగా ఆయన భౌతికకాయాన్ని రాజ్‌భవన్ మార్గంలోని సోమాజిగూడలో ఉన్న కాకా రెండో కుమారుడు, మాజీ ఎంపీ వివేక్ నివాసానికి తరలించారు. వెంకటస్వామి అంత్యక్రియలను మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు పంజాగుట్టలోని శ్మశాన వాటికలో నిర్వహించాలని కుటుంబసభ్యులు నిర్ణయించారు.

వెంకటస్వామి మృతిపై ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తంచేశారు. రాష్ట్రంలో, జాతీయ స్థాయిలో వివిధ పదవులు చేపట్టి వెంకటస్వామి దేశానికి ఎంతో సేవలు అందించారన్నారు. తెలంగాణ రాష్ట్రంకోసం ఆయన ఎంతో ఆరాటపడేవారని, తెలంగాణకోసం పరితపించిన నేత అని సీఎం కొనియాడారు. వెంకటస్వామి మృతిపై ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అధికారిక లాంఛనాలతో కాకా అంత్యక్రియలు జరుపాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మకు సీఎం ఆదేశాలు జారీ చేశారు.

వెంకటస్వామి(ఫైల్)

వెంకటస్వామి(ఫైల్)

రాజకీయ కురువృద్ధుడు, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) మాజీ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి గడ్డం వెంకటస్వామి (కాకా) సోమవారం రాత్రి కన్నుమూశారు.

చికిత్స పొందుతూ..

చికిత్స పొందుతూ..

ఏడున్నర నెలలక్రితం తన ఫామ్‌హౌస్‌లో కాలు జారిపడిన కాకా, అప్పటినుంచి బంజారాహిల్స్‌లోని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందారు. కిడ్నీ సంబంధిత వ్యాధికూడా సోకడంతో 92 ఏండ్ల కాకా ఆరోగ్య పరిస్థితి ఆదివారం రాత్రి విషమించింది.

ఆస్పత్రి వద్ద కాకా కుమారుడు వినోద్

ఆస్పత్రి వద్ద కాకా కుమారుడు వినోద్

వైద్యులు ఆయనను ఐసీయూలో ఉంచి డయాలసిస్ చేస్తుండగానే సోమవారం రాత్రి 8.45 గంటలకు మరణించారు.

గద్దర్

గద్దర్

కాకా మరణ వార్త తెలియగానే వివిధ పార్టీలకు చెందిన నాయకులు కేర్ ఆస్పత్రికి తరలివచ్చారు.

పొన్నాల

పొన్నాల

కాకా అమర్ రహే అంటూ అభిమానులు నినాదాలు చేస్తుండగా ఆయన భౌతికకాయాన్ని రాజ్‌భవన్
మార్గంలోని సోమాజిగూడలో ఉన్న కాకా రెండో కుమారుడు, మాజీ ఎంపీ వివేక్ నివాసానికి తరలించారు.

కడియం శ్రీహరి

కడియం శ్రీహరి

వెంకటస్వామి అంత్యక్రియలను మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు పంజాగుట్టలోని శ్మశాన వాటికలో నిర్వహించాలని కుటుంబసభ్యులు నిర్ణయించారు.

డికె అరుణ

డికె అరుణ

వెంకటస్వామి మృతి వార్త విని ఆస్పత్రి వద్దకు చేరుకున్న మాజీ మంత్రి డికె అరుణ.

డి శ్రీనివాస్

డి శ్రీనివాస్

కేర్ ఆస్పత్రి వద్ద కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ డి శ్రీనివాస్.

గీతారెడ్డి

గీతారెడ్డి

కేర్ ఆస్పత్రి వద్దకు చేరుకున్న మాజీ మంత్రులు గీతారెడ్డి, శంకర్రావు.

పొన్నం ప్రభాకర్

పొన్నం ప్రభాకర్

కేర్ ఆస్పత్రికి చేరుకున్న మాజీ పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్.

కాకా మృతదేహం

కాకా మృతదేహం

కేర్ ఆస్పత్రి నుంచి కాకా మృతదేహాన్ని ఆయన కుమారుడు వివేక్ ఇంటికి తరలించిన దృశ్యం.

నివాళులు

నివాళులు

వెంకటస్వామి మృతదేహం వద్ద నివాళులర్పిస్తున్న నాయకులు.

కుటుంబసభ్యులతో జన్మదిన వేడుకలు(ఫైల్)

కుటుంబసభ్యులతో జన్మదిన వేడుకలు(ఫైల్)

తన కుటుంబసభ్యులతో చివరి పుట్టన రోజు జరుపుకున్న వెంకటస్వామి.

దివంగత సిఎం వైయస్‌తో..(ఫైల్)

దివంగత సిఎం వైయస్‌తో..(ఫైల్)

దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డితో జి వెంకటస్వామి.

అప్పటి స్పీకర్ మీరాకుమార్‌తో..(ఫైల్)

అప్పటి స్పీకర్ మీరాకుమార్‌తో..(ఫైల్)

యూపిఏ ప్రభుత్వంలో స్పీకర్‌గా పని చేసిన మీరాకుమార్‌తో వెంకటస్వామి.

కొడుకు వివేక్‌తో కలిసి మీడియాతో..(ఫైల్)

కొడుకు వివేక్‌తో కలిసి మీడియాతో..(ఫైల్)

కొడుకు, మాజీ ఎంపి వివేక్‌తో కలిసి మీడియాతో మాట్లాడుతున్న వెంకటస్వామి.

నేతల నివాళి

నేతల నివాళి

మాజీ మంత్రి శ్రీధర్ బాబు, మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్, అంజన్ కుమార్ యాదవ్‌లు, తదితరులు నివాళులర్పించారు.

ప్రణభ్ ముఖర్జీతో(ఫైల్)

ప్రణభ్ ముఖర్జీతో(ఫైల్)

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో వెంకటస్వామి. ఆయనతోపాటు ఇద్దరు కుమారులు వివేక్, వినోద్‌లు కూడా ఉన్నారు.

చంద్రాబు నివాళి

చంద్రాబు నివాళి

తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, తెలంగాణ టిడిపి అధ్యక్షుడు ఎల్ రమణ, మంగళవారం ఉదయం కాకా మృతదేహం వద్ద నివాళులర్పించారు.

నివాళులు అర్పించిన టి, ఏపి సిఎంలు

తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంగళవారం ఉదయం కాకా మృతదేహం వద్ద నివాళులర్పించారు. సీనియర్ కాంగ్రెస్ నేత వెంకటస్వామి మృతిపై పలువురు రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధులు తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. సోమవారం రాత్రి మృతిచెందిన వెంకటస్వామి మృతదేహానికి నివాళులు అర్పించేందుకు నేతలు పెద్ద సంఖ్యలో బంజారాహిల్స్‌లోని కేర్ దవాఖానకు, ఆ తర్వాత ఆయన కుమారుడు వివేక్ నివాసానికి చేరుకున్నారు.

English summary
G. Venkatswamy (85), senior-most Congress leader from undivided Andhra Pradesh, died after prolonged illness at a corporate hospital here on Monday evening.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X