• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సెల్యూలాయిడ్ జీవితమే సందేహస్పదం: సావిత్రి నుంచి శ్రీదేవి వరకు అందరిదీ అదే బాట?

By Swetha Basvababu
|

ముంబై: బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు యావత్ భారతావనిలోని అభిమానులు తమ అఖిల భారత అభిమాన కథా నాయిక శ్రీదేవి మరణంతో శోక సముద్రంలో మునిగిపోయారు. ఆమె పార్ధివ దేహం రాక కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న వేళ.. అందరి మనస్సులు చూరగొన్న అతిలోక సుందరి మరణం వెనుక సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. మేనల్లుడి పెళ్లి కోసమని దుబాయ్ వెళ్లిన శ్రీదేవి అక్కడే మృతి చెందింది.

ఆమె మరణానికి కారణాలేమైనా.. ఆమె భర్త బోనీ కపూర్‌ను దుబాయి పోలీసులు మూడున్నర గంటల పాటు విచారించడంతోపాటు అంతా కొలిక్కి వచ్చే వరకు దేశం విడిచి వెళ్లొద్దని ఆదేశించినట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి శ్రీదేవి కూడా మిగతా సినీ నటీమణుల జాబితాలోనే చేరిపోయారా? కుట్ర కోణం నుంచి సినీ నటీమణులు తప్పించుకోలేరా? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

  Actresses Who Left Us Too Soon
  శ్రీదేవి మరణంపై రకరకాల సందేహాలు ఇలా

  శ్రీదేవి మరణంపై రకరకాల సందేహాలు ఇలా

  54 ఏళ్ల వయస్సు అంటే మరీ అంత పెద్ద వయస్సేం కాకపోవడంతో అనుమానాలు బలపడుతున్నాయి. కార్డియాక్ అరెస్ట్‌తో మరణించారని తొలి కబురు. తర్వాత ప్రమాదవశాత్తు బాత్ టబ్‌లో పడి మరణించారని ఆల్కహాల్ సేవించారని పోస్ట్ మార్టం నివేదిక వచ్చింది. దీనిపై టీవీ చానెళ్లు, సోషల్ మీడియాలోనూ అడ్డూ అదుపూ లేని చర్చ జరుగుతోంది. శ్రీదేవి మాదిరిగానే దక్షిణ భారత సినీ నటీమణులు పలువురు అనుమానాస్పదంగా, యుక్త వయస్కులుగా ఉండగానే మరణించారు. అలనాటి మహా నటి సావ్రితి 47 ఏళ్లకే మరణిస్తే.. 14 ఏళ్ల క్రితం చనిపోయిన సౌందర్య వయస్సు 34 ఏళ్లే మరి. వీరంతా సినీ రంగంలో తమ ప్రొఫెషన్ పట్ల అంకిత భావంతో పని చేసిన వారే.

  సంసారం సినిమాతో ఇలా సావిత్రి తెరంగ్రేటం

  సంసారం సినిమాతో ఇలా సావిత్రి తెరంగ్రేటం

  ‘సంసారం' సినిమాతో సెల్యూలాయిడ్‌పై వెలుగు వెలిగిన సావిత్రి తర్వాత పలు తెలుగు సినిమాల్లో ఆదర్శప్రాయమైన పాత్రలు పోషించారు. పురాణ గాథల నుంచి సామాజిక అంశాలే నేపథ్యంగా నిర్మించిన సినిమాల్లో నటించారు. తొలిసారి ‘పెళ్లి చేసి చూడు' సినిమాలో ఆమె లీడ్ పాత్ర పోషించారు. దక్షిణాది తారలు అక్కినేని నాగేశ్వర్ రావు, ఎన్టీఆర్, జెమినీ గణేశన్ తదితర ప్రముఖ కథా నాయకులతో పలు సినిమాల్లో నటించారు. తర్వాతీ దశలో జెమినీ గణేశన్‌ను వివాహం చేసుకున్నారు. కారణాలేమైనా జెమినీ గణేశన్‌తో వైవాహిక జీవితంతో అంతా బాగాలేదన్న విమర్శలు ఉన్నాయి. ఈ క్రమంలో తాగుడుకు బానిసై.. చివరి దశలో ఆరోగ్య సమస్యలతో గుర్తించని పరిస్థితి నెలకొంది. దక్షిణాది సినీ రంగాన్ని ‘మహారాణి'గా ఏలిన సావిత్రి.. చివరకు దురదృష్టకరమైన రీతిలో కన్నుమూయడం విషాదమే.

  బెంగళూరు నుంచి కరీంనగర్ వెళ్తుండగా విమాన ప్రమాదంలో డెత్

  బెంగళూరు నుంచి కరీంనగర్ వెళ్తుండగా విమాన ప్రమాదంలో డెత్

  నాలుగు దక్షిణ భారతీయ భాషల్లో నటించిన ప్రముఖ సినీ కథా నాయిక సౌందర్య. అత్యధికంగా తెలుగు భాషలో నిర్మించిన సినిమాల్లో నటించారు. 1990వ దశకంలో అత్యుత్తమమైన సినీ కథా నాయికల్లో ఆమె వరకు. 1992లో కన్నడ చిత్రం గంధర్వ చిత్రంలో సినీ రంగ ప్రవేశం చేశారు. వెంకటేశ్, చిరంజీవి, నాగార్జున, రజనీకాంత్‌లతో తెలుగు, తమిళ భాషల్లో నటించారు. 2004 ఎన్నికల్లో బీజేపీ తరఫున కరీంనగర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసిన ప్రస్తుత మహారాష్ట్ర గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావుకు మద్దతుగా ప్రచారం చేసేందుకు బెంగళూరు నుంచి కరీంనగర్ వస్తుండగా విమాన ప్రమాదంలో మరణించారు.

  టాలీవుడ్, బాలీవుడ్‌లను ఊపు ఊపేసిన దివ్యభారతి

  టాలీవుడ్, బాలీవుడ్‌లను ఊపు ఊపేసిన దివ్యభారతి

  అంతకుముందు శ్రీదేవిలాగే 16 ఏళ్ల వయసులోనే హీరోయిన్‌గా దివ్యభారతి మారింది. ఆమెలాగే మంచి అందగత్తె. అనతికాలంలోనే టాలీవుడ్, బాలీవుడ్‌లను ఊపేసింది. కానీ 19 ఏళ్ల వయసులోనే మరణించింది. 1990లో వెంకటేశ్ నటించిన బొబ్బిలి రాజా సినిమాతో తెరంగేట్రం చేసిన ఆమె.. మూడేళ్లే సినిమా ఇండస్ట్రీలో ఉన్నా.. ఎన్నో హిట్ సినిమాల్లో నటించింది. తెలుగులో ఆమె నటించిన బొబ్బిలి రాజాతోపాటు అసెంబ్లీ రౌడీ, రౌడీ అల్లుడు, ధర్మక్షేత్రంలాంటి సినిమాలన్నీ హిట్టే. హిందీలోనూ షోలా ఔర్ షబ్నమ్, దీవానా, విశ్వాత్మలాంటి హిట్ సినిమాలు ఉన్నాయి. తెలుగులో తొలిముద్దు సినిమా చేస్తున్నపుడే ఆమె చనిపోయింది. దీంతో ఈ మూవీలో కొంత భాగాన్ని అప్పట్లో ఆమెలాగే ఉండే రంభతో పూర్తి చేశారు. 1993, ఏప్రిల్5న ముంబైలోని తన అపార్ట్‌మెంట్‌లో ఐదో అంతస్తు నుంచి కింద పడి మృతి చెందింది. మద్యం మత్తులో బాల్కనీ నుంచి కింద పడిందని, ఎవరో తోసేశారని, ఆత్మహత్య చేసుకుందని.. ఇలా రకరకాల వార్తలు వచ్చాయి. ఆమె ఎలా కింద పడిపోయిందన్నది మాత్రం తేలనేలేదు. పోస్టుమార్టమ్ రిపోర్ట్ మాత్రం ప్రమాదవశాత్తు కిందపడి చనిపోయినట్లు స్పష్టంచేసింది. దీనిపై విచారణ చేపట్టిన ముంబై పోలీసులు 1996లో కేసును మూసేశారు. ప్రమాదవశాత్తు జరిగిన మరణంగా వాళ్లు తేల్చేశారు.

  తక్కువ కాలంలోనే 450కి పైగా సినిమాల్లో నటన

  తక్కువ కాలంలోనే 450కి పైగా సినిమాల్లో నటన

  1980వ దశకంలో ధైర్య సాహసవంతమైన సినీ నటి సిల్క్ స్మిత. ప్రజల హ్రుదయాల్లో గూడుగట్టుకున్న సినీ నటి అంటే అతి శయోక్తి కాదు. విజయలక్ష్మి అంటే ఆమె బంధువులు, సన్నిహితులకు తెలుసు. 1960 - 1996 వరకు సినీ రంగంలో తనదైన ముద్ర వేసిన కథా నాయిక సిల్క్ స్మిత. 1979లో తమిళ మూవీ ‘వండిచక్కారం' సినిమాలో ‘సిల్క్' పాత్ర పోషించడంలో ఫేమ్ అయ్యారు.. ప్రజల ద్రుష్టిని ఆకర్షించారు. అతి తక్కువ కాలంలో పేరు సంపాదించుకున్పారు. హిందీ. తెలుగు, తమిళ భాషల్లో 450కి పైగా భాషల్లో నటించారు. తెలుగు సినీ రంగంలో ఆమె పేరు ప్రసిద్ది చెందిన వ్యక్తిగత జీవితం ఒడిదొడుకుల మయం. ఆమె మరనం ఇప్పటికీ మిస్టరీ అని చెబుతారు. జీవితంలో వరుస వైఫల్యాలు ఎదురవుతుండటంతో బలవన్మరణానికి పాల్పడ్డారని సన్నిహితులు అంటారు.

  2010లో ముంబైలో ఇలా వివేకా బాబాజీ ఆత్మహత్య

  2010లో ముంబైలో ఇలా వివేకా బాబాజీ ఆత్మహత్య

  బ్రిటిష్ అమెరికా సంతతి యువతి జియాఖాన్ (1988 - 2013) న్యూయార్క్‌లో జన్మించినా.. బాలీవుడ్ లో 2007లో ‘నిషాద్' సినిమాలో రంగ ప్రవేశం చేశారు. అదీనూ అమితాబ్ బచ్చన్ సరసన నటించారు. అదే సినిమాకు ఫిల్మ్ ఫేర్ అవార్డును అందుకున్నారు. పలు ప్రాంతీయ భాషా చిత్రాల్లో నటించిన జియాఖాన్ అకస్మిక మరణానికి గురి కావడానికి గగనాన తిరుగాడే మేఘాల మాదిరే అయ్యింది. దీనికి ఆమె స్నేహితు సూరజ్ పంచోలీకి ఏదో సంబంధం ఉన్నదని వినికిడి.

  మిస్ మారిషస్ టైటిల్ అందుకున్న వివేకా బాబాజీ 2002లో ‘యెహ్ కైసీ మొహబ్బత్ హై' సినిమాలో దీక్ష, కృష్ణ సరసన నటించారు. అంతగా ఆడకపోవడంతో బాక్సాఫీసు వద్ద ఆమెను గుర్తించే వారు లేకుండా పోయారు. 1990ల్లో వాణిజ్య ప్రకటనల ద్వారా అందరికీ తెలిసారు. 1994లో మనీలా ఫిల్మ్ ఫెస్టివల్ కుంభకోణంలో ఆమె ప్రధాన సూత్రధారి అని అనుమానాలు ఉన్నాయి. 2010లో ముంబైలోని బంద్రాలోని తన అపార్ట్‌మెంట్‌లో సీలింగ్ ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మ చేసుకోవడం ఫ్యాషన్ ప్రపంచాన్ని షాక్‌కు గురి చేసింది.

  జయలలిత మరణం వెనుక ఇలా అనుమాన మేఘాలు

  జయలలిత మరణం వెనుక ఇలా అనుమాన మేఘాలు

  పురుచ్చితలైవి అంటే జయలలిత తెలియని వారు లేరు. 2016 డిసెంబర్ ఐదో తేదీన అనారోగ్యంతో మరణించిన ‘అమ్మ'గా తమిళులందరికీ ఎంతో ఇష్టమైన అభిమాన నాయకురాలు. ఎంజీఆర్, శోభన్ బాబు తదితరులతో నటించిన జయలలిత.. తర్వాత ఎంజీఆర్ పిలుపు మేరకు అన్నాడీఎంకేలో చేరారు. ఆయన మరణించే నాటికి రాజ్యసభ సభ్యురాలిగా ఉన్నారు. కానీ ఆమె వ్యతిరేకులు జానకీ రామచంద్రన్‌ను తెర మీదకు తెచ్చారు. కానీ రాజకీయాలు తెలియని జానకీ రామచంద్రన్ వెనుకబడిపోయారు. నాటి నుంచి 2016లో మరణించే నాటి వరకు జయలలిత తమిళనాట ప్రధాన పాత్ర పోషించారు. కానీ చెన్నై అపోలో ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి మరణించే వరకు రకరకాల సందేహాలు వ్యక్తం అయ్యాయి. ఆమె స్థానే అధికార దండాన్ని చేపట్టాలని కలలు కన్న చిన్నమ్మ ‘శశికళ' జైలు పాలైన తర్వాత జయలలిత మరణంపై విచారణకు ఆదేశించారు.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Bollywood fans are mourning the loss of actress Sridevi Kapoor, who died over the weekend. Kapoor, 54, died due to an “accidental drowning” in a bathtub, a forensic report from police in Dubai said. Indian cinema is currently mourning the sudden demise of actor Sridevi who was aged 54. A feeling, that she went away too young, is seen across the nation and many even expressed shock over the reason of her death, cardiac arrest.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more