వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కారణమిదే: 3 ఏళ్ళలో 93 శాతం తగ్గిన డేటా టారిఫ్

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: మొబైల్‌ ఇంటర్నెట్ రేట్లు గత మూడేళ్ళలో భారీగా తగ్గాయని డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికం శాఖ ప్రకటించింది. ఇంటర్నెట్ రేట్లు భారీగా తగ్గడంతో మూడేళ్ళలో మొబైల్స్‌లో డేటాను ఉపయోగించేవారు అధికమయ్యారని టెలికం శాఖ అభిప్రాయపడింది.

టెలికం రంగంలో ఏడాది కాలంగా అనేక మార్పులు చోటు చేసుకొంటున్నాయి. ఈ మార్పుల కారణంగా మొబైల్స్ వినియోగదారులు ఎక్కువగా ఇంటర్నెట్‌ను వినియోగిస్తున్నారు.

రిలయన్స్ జియో మార్కెట్లోకి ప్రవేశంతో టెలికం ఆపరేటర్లు కూడ తమ టారిఫ్ ప్లాన్లను మార్చుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. అంతేకాదు ఇంటర్నెట్ వినియోగంపై కూడ ఎక్కువైంది.

3 ఏళ్ళలో తగ్గిన ఇంటర్నెట్ ధరలు

3 ఏళ్ళలో తగ్గిన ఇంటర్నెట్ ధరలు

మొబైల్ ఇంటర్నెట్ ధరలు మూడేళ్ళలో ఎన్నడూలేని విధంగా భారీగా తగ్గిపోయాయని డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికం శాఖ అబిప్రాయపడింది. 3 ఏళ్ళలో సుమారు 93 శాతం మొబైల్ ఇంటర్నెట్ ధరలు బాగా తగ్గిపోయాయని ప్రకటించింది. ఇంటర్నెట్ ధరలు తగ్గడం వల్ల మొబైల్‌ డేటా వినియోగం సుమారు 25 రెట్లు పెరిగిందని డివోటి అభిప్రాయపడింది.

జియో రంగ ప్రవేశంతో మార్పులు

జియో రంగ ప్రవేశంతో మార్పులు

2014లో ఒక్కో జీబీకి 33 రూపాయాల ధర ఉండేది 2017 వచ్చేసరికి ఒక్కో జీబీకి రూ.21 ఖర్చు చేసినట్టుగా గణాంకాలు చెబుబుతున్నాయని డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికం ప్రకటించింది. మొత్తంగా 93 శాతం టారిఫ్ తగ్గిందని డివోటి ప్రకటించింది. 2016 లో రిలయన్స్ జియో మార్కెట్లోకి ఎంట్రీ అయ్యాక టారిఫ్ రేట్లు మరింత తగ్గాయని డివోటి ప్రకటించింది. రిలయన్స్ రంగ ప్రవేశం తర్వాత కేవలం 4 రూపాయాలకే ఒక్క జీబీ వినియోగదారులకు లభ్యమౌతోందని డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికం ప్రకటించింది.

25 రెట్లు పెరిగిన ఇంటర్నెట్ వినియోగం

25 రెట్లు పెరిగిన ఇంటర్నెట్ వినియోగం

ఇంటర్నెట్ వినియోగం సుమారు 25 రెట్లు పెరిగిందని డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికం ప్రకటించింది. ఒక్కో వినియోగదారుడు మూడేళ్ళ క్రితం ఉపయోగించిన ఇంటర్నెట్ కంటే సుమారు 25 రెట్ల వాడకం పెరిగిందని ప్రకటించారు. 2014లో ఒక్క నెలలో 62 జీబీ డేటా వినియోగిస్తే 2017 నాటికి ఒక్కో నెలలో 1.6 జీబీ వాడినట్టు గణాంకాలు ప్రకటించాయి.

 ఇంటర్నెట్ వినియోగంలో టాప్

ఇంటర్నెట్ వినియోగంలో టాప్

ప్రపంచంలో అత్యధికంగా ఇంటర్నెట్‌ను ఉపయోగిస్తున్న దేశాల్లో ఇండియా అగ్రస్థానంలో నిలుస్తోంది. ఒక్కో నెలలో 1.3 మిలియన్ జీబీలు నమోదౌతున్నాయని డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికం ప్రకటించింది. అమెరికా, చైనా కంటే ఇండియాలోనే ఇంటర్నెట్ ఉపయోగిస్తున్నవారి సంఖ్య అధికంగా ఉందని ఈ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. 2014-17 మధ్యకాలంలో ఇంటర్నెట్‌ యూజర్లు 251 మిలియన్ల నుంచి 429 మిలియన్లకు పెరిగినట్టు రిపోర్టు చేసింది. అటు బ్రాడ్‌బ్యాండ్‌ యాక్సస్‌ యూజర్లు కూడా 2014 మార్చిలో 61 మిలియన్‌ సబ్‌స్క్రైబర్లుంటే, 2017 సెప్టెంబర్‌లో 325 మిలియన్ల సబ్‌స్క్రైబర్లకు పెరిగినట్టు వెల్లడించింది. ట్రాయ్‌ డేటా ప్రకారం 2017 డిసెంబర్‌ చివరి నాటికి ఇంటర్నెట్‌ సబ్‌స్క్రైబర్లు 445.9 మిలియన్లకు ఎగిసినట్టు తెలిసింది.

స్మార్ట్‌ఫోన్లు కూడ కారణమే

స్మార్ట్‌ఫోన్లు కూడ కారణమే

ఇండియాలో ఇంటర్నెట్ వినియోగానికి స్మార్ట్‌పోన్ల వాడకం పెరుగుదల కూడ కారణమేనని డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికం ప్రకటించింది. భారత్‌లో స్మార్ట్‌ఫోన్ల వాడకం పెరిగింది. 190 మిలియన్ స్మార్ట్ ‌ఫోన్ల నుండి 390 మిలియన్ స్మార్ట్‌ఫోన్లకు చేరుకొంది. దీంతో ఇంటర్నెట్ యూజర్లు పెరిగారు. స్మార్ట్‌ఫోన్ల వాడకం సుమారు 66 శాతం పెరిగిందని డివోటి పెరిగింది.

English summary
Mobile Internet rates plunged by 93 per cent while data usage per user surged by over 25 times in three years to 2017, the Department of Telecom (DoT) said today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X