వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చెప్పుతో సమాధానం, తల్లి జ్ఞాపకాల్లో (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ ఏర్పాటు కోసం ఉద్యమించిన మహనీయురాలు ఈశ్వరీ బాయి అని ఆమె కూతురు, రాష్ట్ర మంత్రి జె.గీతారెడ్డి కొనియాడారు. ఈశ్వరీబాయి వర్ధంతిని పురస్కరించుకుని సోమవారం సికింద్రాబాదులోని మారేడుపల్లి సెయింట్ జాన్స్ చౌరస్తాలోని ఆమె విగ్రహానికి మంత్రి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈశ్వరీబాయి తెలంగాణ రావడానికి బాట వేసిన వ్యక్తి అని కొనియాడారు. కాగా, ఈశ్వరీబాయి స్మార పురస్కారాలను సోమవారమిక్కడి జూబ్లీహాల్‌లో ఎఐసిసి ఎస్సీ విభాగం చైర్మన్ కె.రాజు, ఆచార్య కొలకలూరి ఇనాక్‌లకు ప్రదానం చేశారు.

అణగారిన వర్గాల ప్రజల పక్షాన నిలబడి హక్కుల కోసం పోరాడిన ధీరవనిత ఈశ్వరీబాయి అని జస్టిస్ సుభాషణ్ రెడ్డి అన్నారు. అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆమె ఎనలేని పోరాటం చేశారని ఆయన అన్నారు. ఈశ్వరీబాయి చరిత్రను పాఠ్యాంశంగా చేర్చాలని ఆయన సూచించారు. తల్లి జ్ఞాపకాలను కార్యక్రమంలో గీతారెడ్డి నెమరేసుకున్నారు.

తల్లి జ్ఞాపకాలతో..

తల్లి జ్ఞాపకాలతో..

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన తల్లి ఈశ్వరి బాయి జ్ఞాపకాలను కూతురు, మంత్రి జె. గీతా రెడ్డి నెమరేసుకున్నారు.

కొప్పుల రాజుకు అవార్డు

కొప్పుల రాజుకు అవార్డు

ఈశ్వరీబాయి స్మారక అవార్డును ఎఐసిసి ఎస్సీ విభాదం చైర్మన్ కొప్పుల రాజుకు ప్రదానం చేస్తున్న దృశ్యం

కొలకలూరి ఇనాక్‌కు అవార్డు..

కొలకలూరి ఇనాక్‌కు అవార్డు..

ప్రముఖ సాహితీవేత్త, పద్మశ్రీ కొలకలూరి ఇనాక్‌కు ఈశ్వరీబాయి అవార్డును ప్రదానం చేస్తున్న దృశ్యం.

రవికుమార్‌కు సత్కారాం

రవికుమార్‌కు సత్కారాం

ఈశ్వరీబాయి వర్ధంతి సభలో రవికుమార్‌ను సత్కరిస్తున్న జె. గీతారెడ్డి. పక్కన సుభాష్న్ రెడ్డి, కొలకలూరి ఇనాక్

లాఠీ దెబ్బలకు సైతం..

లాఠీ దెబ్బలకు సైతం..

లాఠీదెబ్బలకు సైతం భయపడకుండా ఎదిరించి పోరాడిన ధీర వనిత ఈశ్వరీ బాయి అని గీతారెడ్డి అన్నారు.

చెప్పుతో సమాధానం

చెప్పుతో సమాధానం

దళితులను కించపరిచే విధంగా మాట్లాడితే చెప్పుతో సమాధానం చెప్పిన చరిత్ర ఈశ్వరీబాయికి ఉందని జె. గీతారెడ్డి అన్నారు.

English summary

 Minsiter J Geetha Reddy said that her mother Eswari bai faught for Telangana and for the rights of Daliths.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X