అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

డే ఎట్ సీ: యుద్ధనౌకల విన్యాసాలు (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

అమరావతి: యుద్ధనౌకలపై దాడి చేయడం, నడి సంద్రంలో చిక్కుకున్న వారిని హెలికాప్టర్ సాయంతో రక్షించడం, అత్యాధునిక ఆయుధాలతో శత్రువులపై విరుచుకుపడడం, ప్రయాణిస్తున్న నౌకలోంచి వేరొక నౌకలోకి తాడు సాయంతో వెళ్లడం, తదితర విన్యాసాలను తూర్పు నావికాదళ సిబ్బంది ప్రదర్శించి సంబ్రమాశ్చర్యాలకు గురిచేశారు.

డిసెంబర్ 4వ తేదీన నేవీ డే సందర్భంగా ప్రతి ఏటా నిర్వహించే 'డే ఎట్ సీ' కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా నావికాదళం అధికారుల విధులు, సముద్రంలో వారు నిర్వహించే వృత్తిగత అంశాలు, షిప్‌ల నిర్వహణ, యుద్ధ సమయంలో వ్యవహరించే తీరు, శత్రుమూకల దాడులను ఎదుర్కొవడం తిప్పికొట్టడం వంటి పలు అంశాలను ప్రదర్శించారు.

డే ఎట్ సీ: యుద్ధనౌకల విన్యాసాలు

డే ఎట్ సీ: యుద్ధనౌకల విన్యాసాలు

ఈ విన్యాసాలను 25 పాఠశాలల నుంచి వచ్చిన విద్యార్ధులు, తల్లిదండ్రులు, మీడియా ప్రతినిధులు, తదితరులు సుమారు 3200 మంది మూడు యుద్ధ నౌకల్లోంచి ప్రత్యక్ష్యంగా తిలకించి ఆనందించారు.

డే ఎట్ సీ: యుద్ధనౌకల విన్యాసాలు

డే ఎట్ సీ: యుద్ధనౌకల విన్యాసాలు

ఉదయం తొమ్మిదిన్నరకు ప్రారంభమైన యుద్ధనౌకల ప్రయాణం ప్రారంభం నుంచ ఆశ్చర్యాన్ని కలిగించింది. మూడు నౌకలు ప్రారంభమైన 45 నిమిషాలకు చేతక్ హెలికాప్టర్‌లో సిబ్బంది చేసిన విన్యాసాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.

డే ఎట్ సీ: యుద్ధనౌకల విన్యాసాలు

డే ఎట్ సీ: యుద్ధనౌకల విన్యాసాలు

యుద్ధ సమయంలో, విపత్కర పరిస్థితుల్లో సముద్రంలో చిక్కుకున్న వారిని హెలికాప్టర్ నుంచి తాళ్ల సహాయంతో దిగి రక్షించడం ఎలాగో చేసి చూపించిన తీరు చూపరులను అబ్బురపరిచింది.

డే ఎట్ సీ: యుద్ధనౌకల విన్యాసాలు

డే ఎట్ సీ: యుద్ధనౌకల విన్యాసాలు

పది నిమిషాలకు పైగా ఓకేచోట హెలికాప్టర్‌ను నిలిపి అందులోంచి మెరుపువేగంతో తాళ్ల సాయంతో సిబ్బంది సముద్రంలోకి దిగిన తీరు గగుర్పాటుకు గురి చేసింది. అంతకు ముందు మూడు యుద్ధ నౌకల చుట్టూ హెలికాప్టర్ తిరగి హెచ్చరికలు పంపడం, పరిస్థితిని సమీక్షించడం ఆకట్టుకుంది.

డే ఎట్ సీ: యుద్ధనౌకల విన్యాసాలు

డే ఎట్ సీ: యుద్ధనౌకల విన్యాసాలు

అంతకు ముందు ఇంటర్నేషనల్ ప్లీట్ రివ్యూ, నేవీ డేను సందర్భంగా విద్యార్ధులకు నిర్వహించిన పలు పోటీల్లో విజేతలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన కమాండర్ మనీష్ శర్మ బహుమతులను అందించారు.

డే ఎట్ సీ: యుద్ధనౌకల విన్యాసాలు

డే ఎట్ సీ: యుద్ధనౌకల విన్యాసాలు

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇన్ని రోజుల పాటు నిర్వహించిన పోటీలకు విద్యార్ధుల నుంచి మంచి స్పందన వచ్చిందన్నారు. విద్యార్ధిల్లో దాగి ఉన్న టాలెంట్‌ను వెలికి తీసేందుకు ఇలాంటి పోటీలు ఉపయోగపడతాయన్నారు. ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా విద్యార్ధులకు నేవీపై అవగాహన కలుగుతుందన్నారు.

డే ఎట్ సీ: యుద్ధనౌకల విన్యాసాలు

డే ఎట్ సీ: యుద్ధనౌకల విన్యాసాలు

శత్రుమూకల స్థావరాలను స్మాల్ హౌఫ్ ఫైరింగ్ ద్వారా మట్టుపెట్టిన విధానాన్ని కళ్లకు కట్టినట్టు చూపించారు. మొదటి ఇల్యూమినేషన్ బాంబును టార్గెట్‌గా చేసుకుని దానిపై ఫైరింగ్ చేసి అంతమొందించి చూపించారు.

 డే ఎట్ సీ: యుద్ధనౌకల విన్యాసాలు

డే ఎట్ సీ: యుద్ధనౌకల విన్యాసాలు

సముద్రంలోని యుద్ధనౌకలకు అవసరమైన ఇంధనాన్ని ఎలా అందిస్తారో ప్రత్యక్షంగా చూపారు. యుద్ధ సమయంలో నౌకల సమూహానికి ఆయిల్ మార్చడాన్ని ఫ్లీట్ అంటారు. ప్రధానంగా ఈ విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి.

English summary
Children had a gala time as Navy personnel displayed their fighting skills on the eastern fleet ships during the ‘Day-at-Sea’ programme, organised as a part of the Navy Day celebrations here Saturday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X