వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జయప్రదతో శ్రీదేవి కోల్డ్‌వార్: ఇద్దర్నీ గదిలో వేసి తాళం, మోహన్ బాబు ఫంక్షన్‌లో మళ్లీ...

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలుగు సినీ రంగంలో ఓ వెలుగు వెలుతున్న జయప్రద, జయసుధలకు శ్రీదేవి పోటీగా నిలిచారు. బాలీవుడ్‌లో మాధురీ దీక్షిత్‌కు గట్టి పోటీ ఇచ్చారు. ఆ తర్వాత బాలీవుడ్‌లోనూ జయప్రదకు, శ్రీదేవికి మధ్య గొడవలు వచ్చాయి.

Recommended Video

హార్ట్ ఎటాక్‌‌తో దుబాయ్‌లో 'అతిలోక సుందరి' శ్రీదేవి కన్నుమూత!!

జయప్రదకు, శ్రీదేవికి మధ్య రాజీ చేయడానికి బాలీవుడ్ అప్పటి హీరోలో రాజేష్ ఖన్నా, జితేంద్ర తీవ్రంగా ప్రయత్నించారు. కానీ, అవి ఫలించలేదు. ఇద్దరి మొండిపట్టు వారి ప్రయత్నాలను తిప్పికొట్టాయి. ఆ తర్వాత విశాఖపట్నంలో వారిద్దరి మధ్య వివాదం మరోసారి కొట్టిచ్చినట్లు బయటపడ్డాయి.

వారిద్దరినీ గదిలో పెట్టి....

వారిద్దరినీ గదిలో పెట్టి....

శ్రీదేవికి, జయప్రదకు మధ్య రాజీ కుదిర్చేందుకు రాజేష్ ఖన్నా, జితేంద్ర తీవ్రంగా ప్రయత్నించారు. వారిద్దరిని ఓ గదిలో వేసి బయటి నుంచి తాళం వేశారు. అలా చేస్తే వారిద్దరు మాట్లాడుకుంటారనేది వారి ఆలోచన. ఆ తర్వాత గంట సేపటికి వారు తాళం తీశారు. అయితే, వారిద్దరు మాట్లాడుకోకుండానే బయటకు వచ్చారు. ఇది 1984 ప్రాంతంలో జరిగిన సంఘటన.

అమర్ సింగ్ ద్వారా రాజీ...

అమర్ సింగ్ ద్వారా రాజీ...

దాదాపు పాతికేళ్ల పాటు శ్రీదేవికి, జయప్రదకు మధ్య మనస్పర్థలు కొనసాగాయి. 1984లో వారిద్దరు కలిసి తోఫా, మక్సద్ సినిమాల్లో నటించారు. సెట్స్‌‌లో వారిద్దరు మాట్లాడుకునేవారు కాదు. ఆ సమయంలోనే రాజేష్ ఖన్నా, జితేంద్ర వారిద్దరు ఉన్న గదికి తాళం వేశారు. గంట తర్వాత తాళం తీసి చూస్తే ఇరువురు వ్యతిరేక దిశలో కూర్చుని ఉన్నారు.

మరోసారి విశాఖపట్నంలో..

మరోసారి విశాఖపట్నంలో..

విశాఖపట్నంలో 2016లో మోహన్ బాబు 40 ఏళ్ల సినీ ప్రస్థానం వేడుక జరిగింది. ఈ వేడుకలో శ్రీదేవితో పాటు జయప్రద, జయసుధ కూడా పాల్గొన్నారు. ఈ వేడుకలో శ్రీదేవి మోహన్ బాబు ప్రస్థానానికి సంబంధించిన విలువైన దాన్ని ఆవిష్కరించారు. దాన్ని జయప్రదకు, జయసుధకు అందిస్తారని మోహన్ బాబు ప్రకటించారు. అయితే, శ్రీదేవి నుంచి దాన్ని అందుకోవడానికి జయసుధ, జయప్రద ముందుకు కదలలేదు. దీంతో శ్రీదేవికి, జయప్రదకు మధ్య వివాదం మరోసారి బయటపడింది.

వారు ఇలా వ్యవహరించారు...

వారు ఇలా వ్యవహరించారు...

2014 ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో జయప్రద అమర్ సింగ్ తరఫున ప్రచారం చేశారు. ఆయనకు శ్రీదేవి కూడా సన్నిహితంగానే ఉండేవారు. ఆమె కూడా ఓసారి ప్రచారానికి వచ్చింది. ఆ సమంలో అమర్ సింగ్ శ్రీదేవికి జయప్రదను పరిచయం చేశారు. అయితే, జయప్రద ఎవరో తెలియనట్లు శ్రీదేవి వ్యవహరించిందని అంటారు. దాంతో దానిపై జయప్రద తీవ్రంగా స్పందించింది. శ్రీదేవికి ఇంకా ఇగో తగ్గలేదని జయప్రద వ్యాఖ్యానించింది.

అమర్ సింగ్

అమర్ సింగ్

శ్రీదేవికి, జయప్రదకు మధ్య రాజకీయ నాయకుడు అమర్ సింగ్ రాజీ కుదిర్చారు. వారిద్దరి మధ్య ఆయన మధ్యవర్తిగా వ్యవహరించారు. విభేదాలను పరిష్కరించడానికి ముందుకు వచ్చిన అమర్‌సింగ్‌కు కృతజ్ఢతలు కూడా చెప్పారు.

English summary
When they worked together in Tohfa and Maqsad in 1984, not a word was spoken between the two on the sets.During Maqsad, the film's leading men Rajesh Khanna and Jeetendra locked the two ladies together in one makeup room. When the door was opened an hour later, the two sat in opposite corners staring in opposite directions.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X