డ్రగ్స్ కేసు: నిందితులా? బాధితులా?, ఇదే కీలక ప్రశ్న, తర్వాత జరిగేదేమిటి?

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: డ్రగ్స్‌ కేసులో తెలంగాణ 'సిట్‌' దర్యాప్తు వేగవంతం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో కొన్ని ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. ఈ కేసులో సినీ ప్రముఖులను విచారిస్తున్న సిట్ అధికారులు వారిని ఏ కోణంలో చూస్తున్నారన్నదే ప్రధాన ప్రశ్న.

ఇప్పటికే డ్రగ్స్‌ డీలర్ కెల్విన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ మాదక ద్రవ్యాల కేసులో ఇతరుల పాత్ర ఎలా ఉన్నా.. సినిమా వాళ్లకు మాత్రమే నోటీసులు జారీ అయ్యాయి. దర్శకుడు పూరీ జగన్నాథ్‌ నుంచి చార్మీ, ముమైత్‌ ఖాన్‌ దాకా 12 మందిని సిట్‌ ప్రశ్నిస్తోంది.

ఇదే ప్రధాన ప్రశ్న..

ఇదే ప్రధాన ప్రశ్న..

డ్రగ్స్ విక్రయించే స్మగ్లర్లకు మరణ శిక్ష విధిస్తున్నా వినియోగించే వారిపై సానుభూతి చూపే దేశాలు అనేకం ఉన్నాయి. ఇంతకీ ఈ డ్రగ్స్ కేసులో సినిమా వాళ్ల పాత్ర ఏమిటి? వాళ్లు కూడా డ్రగ్స్‌ విక్రయించారా? డ్రగ్స్‌ వాడకాన్ని ప్రోత్సహించారా? వాడుతున్నారా? వాడటానికి మాత్రమే పరిమితమైతే వారు చేసింది ఘోరమైన, క్రూరమైన నేరమేమీ కాదు! వారు నిందితులు కాదు! బాధితులు మాత్రమే! డ్రగ్స్ సరఫరా చేస్తే వారికి, వాటిని విక్రయించే వారికి కొన్ని దేశాల్లో మరణ శిక్ష విధిస్తారు. మరికొన్ని దేశాల్లో పలు రకాల శిక్షలు అమలులో ఉన్నాయి.

Tarun selfie video About His Drug allegation
విక్రయిస్తేనే శిక్ష.. వినియోగిస్తే చికిత్స

విక్రయిస్తేనే శిక్ష.. వినియోగిస్తే చికిత్స

మన దేశంలోనే కాదు చాలా దేశాల్లో డ్రగ్స్‌ వినియోగించే వారిని బాధితులుగానే పరిగణిస్తారు. కేవలం డ్రగ్స్ వాడకానికే పరిమితమైన వారి జీవితాలను బజారుకీడ్చే హక్కు ఎవ్వరికీ లేదని న్యాయ నిపుణులు కూడా చెబుతున్నారు. మన దేశంలో కొకైన్‌, మార్ఫీన్‌, హెరాయిన్‌ వాడితే ఏడాది వరకు జైలు శిక్ష, 20 వేల వరకు జరిమానా విధించవచ్చు. మిగిలిన డ్రగ్స్‌ వాడితే ఆరు నెలల వరకు జైలు శిక్ష విధించే అవకాశముంది. అయితే ‘డ్రగ్స్‌ వినియోగం నుంచి బయటపడాలనుకుంటున్నాం' అంటూ ప్రభుత్వ గుర్తింపు పొందిన ‘డీ అడిక్షన్‌' కేంద్రాల్లో చికిత్స తీసుకునేందుకు స్వచ్ఛందంగా సిద్ధమైతే మాత్రం ఈ శిక్షల నుంచి కూడా మినహాయింపు కూడా ఉంటుంది. వారు ఆ మహమ్మారి నుంచి బయటపడేందుకు అవకాశమిస్తారు.

చైనాలో కఠిన శిక్షలు...

చైనాలో కఠిన శిక్షలు...

చైనాలో డ్రగ్స్ అక్రమ రవాణా, విక్రేతలకు మాత్రం కఠిన శిక్షలు విధిస్తారు. ఉదాహరణకు చైనాలో ఒపియంను కిలోకు మించి ఉత్పత్తి చేస్తే మరణశిక్షే. చైనాలో డ్రగ్స్‌ వాడకానికి బానిసలైన వారిని మాత్రం ప్రభుత్వమే బయటపడేస్తుంది. అక్క డ ఇలాంటి వారిని మూడేళ్లపాటు నిర్బంధంగా ‘డీటాక్సిఫికేషన్‌' కేంద్రాలకు పంపుతారు.

పోర్చుగల్ లో నిషేధమే, కానీ...

పోర్చుగల్ లో నిషేధమే, కానీ...

పోర్చుగల్‌లో గంజా యి నుంచి హెరాయిన్‌ వరకు అన్ని రకాల డ్రగ్స్‌ వినియోగంపైనా నిషేధం ఉంది. ఒకవేళ ఈ నిషేధాన్ని ఉల్లంఘించినా నేరంగా పరిగణించరు. వారి అలవాటు మార్చేందుకు ప్రయత్నిస్తారు. డ్రగ్స్‌కు అలవాటైన వారిపై సానుభూతి ప్రదర్శిస్తారు. డ్రగ్స్ కు బానిసలైన వారికి పోర్చుగల్‌ ప్రభుత్వమే చికిత్స అందిస్తుంది. ఇక్కడ డ్రగ్స్‌ వాడకాన్ని నేరంగా కాకుండా ఓ ఆరోగ్య సంబంధ విషయంగా మాత్రమే చూస్తారు.

ఇరాన్, ఇండోనేషియా, సౌదీ అరేబియాలలో...

ఇరాన్, ఇండోనేషియా, సౌదీ అరేబియాలలో...

ఇరాన్‌, ఇండొనేషియాలో డ్రగ్స్‌ స్మగ్లర్లకు మరణ శిక్ష విధిస్తారు. సౌదీ అరేబియాలో డ్రగ్స్ విక్రయించినట్లు, సరఫరా చేసినట్లు నిర్ధారణ అయితే వారి తలను నడిబజారులో నరికేస్తారు. అయితే నిర్ణీత పరిమాణంలో డ్రగ్స్‌ కలిగి ఉన్న వారిని మాత్రం ఆ అలవాటు నుంచి బయటపడేయడంపై దృష్టి సారిస్తారు.

అమెరికాలో పలు రకాలుగా..

అమెరికాలో పలు రకాలుగా..

అమెరికాలోని చాలా రాష్ట్రాల్లో డ్రగ్స్‌ వినియోగించినా, దగ్గర పెట్టుకున్నా కనీసం రెండున్నరేళ్లు జైలు శిక్ష తప్పదు. గరిష్ఠంగా 40 నెలలు జైలుకు పంపిస్తారు. శిక్షలకు అదనంగా సామాజిక సేవ చేయాలని కూడా ఆదేశించవచ్చు. ‘నేను తప్పు చేయలేదు' అని చెప్పుకునే అవకాశం కూడా ఉండదు. ఇక డ్రగ్స్‌ విక్రేతలకు కనీసం 3 నుంచి 9 ఏళ్ల శిక్ష విధించవచ్చు. పిల్లలకు డ్రగ్స్‌ విక్రయించడాన్ని తీవ్రంగా పరిగణిస్తూ కనీసం పదేళ్ల జైలు శిక్ష విధిస్తారు. ఇక డ్రగ్స్‌ స్మగ్లర్లకు కనీసం 20 ఏళ్లు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. అయితే గంజాయి విషయంలో మాత్రం అమెరికాలోని పలు రాష్ట్రాలు ఉదారంగా వ్యవహరిస్తున్నాయి. వాషింగ్టన్‌ స్టేట్‌, కొలరాడోలో 28 గ్రాముల వరకు గంజాయి కొనుగోలు చేయవచ్చు. నిర్దిష్ట ప్రాంతాల్లో సొంతంగా ఆరు చొప్పున గంజాయి మొక్క లు కూడా పెంచుకోవచ్చు. అయితే ఇందుకు అక్కడి ప్రభుత్వానికి మాత్రం పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

డెన్మార్క్ లో ఇలా.. నెదర్లాండ్స్ లో అలా..

డెన్మార్క్ లో ఇలా.. నెదర్లాండ్స్ లో అలా..

డెన్మార్క్‌లో డ్రగ్స్‌ వినియోగం కోసం ప్రత్యేకంగా గదులు ఉంటాయి. ఆ గదుల్లోకి వెళ్లి ఎవరైనా డ్రగ్స్‌ తీసుకోవచ్చు. ఇక నెదర్లాండ్స్‌లో డ్రగ్స్‌ దిగుమతి, ఎగుమతి నేరం. గరిష్ఠంగా 16 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. వినియోగం విషయానికి వస్తే... ఇక్కడ పర్యాటకులు గంజాయిని వినియోగిస్తున్నా పోలీసులు పెద్దగా పట్టించుకోరు. చెక్‌ రిపబ్లిక్‌లోనూ స్వల్ప మొత్తంలో డ్రగ్స్‌ ఉన్న వారికి జరిమానాల్లాంటి చిన్న శిక్షలతో సరిపెడతారు.

ఉరుగ్వేలో.. అంతా ఓకే..

ఉరుగ్వేలో.. అంతా ఓకే..

గంజాయి వినియోగాన్ని చట్టబద్ధం చేసిన తొలి దేశం... ఉరుగ్వే. ఇక్కడ పరిమితికి లోబడి డ్రగ్స్‌ తయారు చేయవచ్చు, అమ్మొ చ్చు, వాడొచ్చు! డ్రగ్స్‌ నియంత్రణపై ఉన్న అంతర్జాతీయ ఒప్పందాన్ని కాదని మరీ ఉరుగ్వే గేట్లు తెరిచేసింది. ఇక్కడ మందుల షాపుల్లో ఒక్కొక్కరు నెలకు 40 గ్రాముల వరకు గంజాయి కొనుక్కోవచ్చు. విశేషం ఏమిటంటే... ఉరుగ్వేలో ‘కానబిస్‌ క్లబ్‌'లు ఉన్నాయి. ఈ క్లబ్‌లో సభ్యులు తాము సొంతంగా ఆరు చొప్పున గంజాయి మొక్కలను పెంచుకోవచ్చు.

స్పెయిన్ లో ఇలా...

స్పెయిన్ లో ఇలా...

స్పెయిన్‌ మరో అడుగు ముందుకు వేసి... ‘మా దేశంలో డ్రగ్స్‌పై నిషేధం లేదు' అని సగర్వంగా ప్రకటించుకుంటుంది. అయితే, ఇక్కడ మాదక ద్రవ్యాలను బహిరంగంగా తీసుకోరాదు. అదే సమయంలో... అక్రమంగా డ్రగ్స్‌ విక్రయిస్తే మాత్రం 20 ఏళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు.

జపాన్‌లో చాలా సీరియస్‌...

జపాన్‌లో చాలా సీరియస్‌...

అభివృద్ధి చెందిన దేశాలన్నింటిలో జపాన్‌లోనే డ్రగ్స్‌పై కఠినమైన శిక్షలు, నిబంధనలు అమలులో ఉన్నాయి. 68 రకాల మాదక ద్రవ్యాల ఉత్పత్తి, విక్రయంపై ఇక్కడ పూర్తిస్థాయి నిషేధం విధించారు. సాధారణ జలుబు, ఫ్లూ కోసం వాడే కొన్ని ఔషధాల వాడకంపైనా ఇక్కడ నియంత్రణ ఉందంటే.. ఇక మాదక ద్రవ్యాల విషయంలో జపాన్ ఏ స్థాయిలో చర్యలు తీసుకుంటుందో ఊహించుకోవచ్చు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Drugs case is creating sensation in tollywood industry. In this case SIT officials already started enquiry. Tollywood Director Puri Jagannath, Cameraman Shyam K Naidu, Actors Subbaraju, Tarun are faced SIT enquiry. On Monday it's turn for Hero Navadeep. Here an important question was araised. In which angle SIT Officials are seeing the Tollywood personalities? Whether they are Accused? or Victims?
Please Wait while comments are loading...