హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రావణ దహనం: ఆకట్టుకున్న బాణసంచా (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: జంటనగరాల్లో దసరా వేడకలు కన్నుల పండువగా అంగ రంగా వైభవంగా నిర్వహించారు. దసరా పండుగను పురస్కరించుకుని నగరంలో 'దసరా సమ్మేళనం', 'రావణ దహనం' కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది ప్రజలు హాజరయ్యారు.

అంబర్ పేట దేవస్థాన సేవా సమితి ఆధ్వర్యంలో గురువారం రాత్రి అంబర్ పేట మున్సిపల్ మైదానంలో 'దసరా సమ్మేళనం', 'రావణ దహనం' పేరిట కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు.

కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, రాజ్యసభ సభ్యులు వి. హనుమంతురావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్యే కిషన్ రెడ్డి, అంబర్ పేట దేవస్థాన సేవా సమితి ఛైర్మన్ దుర్గా ప్రసాద్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కాల్చిన బాణసంచా ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది.

రావణ దహనం: ఆకట్టుకున్న బాణసంచా

రావణ దహనం: ఆకట్టుకున్న బాణసంచా

జంటనగరాల్లో దసరా వేడకలు కన్నుల పండువగా అంగ రంగా వైభవంగా నిర్వహించారు. దసరా పండుగను పురస్కరించుకుని నగరంలో 'దసరా సమ్మేళనం', 'రావణ దహనం' కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది ప్రజలు హాజరయ్యారు.

రావణ దహనం: ఆకట్టుకున్న బాణసంచా

రావణ దహనం: ఆకట్టుకున్న బాణసంచా

అంబర్ పేట దేవస్థాన సేవా సమితి ఆధ్వర్యంలో గురువారం రాత్రి అంబర్ పేట మున్సిపల్ మైదానంలో 'దసరా సమ్మేళనం', 'రావణ దహనం' పేరిట కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు.

రావణ దహనం: ఆకట్టుకున్న బాణసంచా

రావణ దహనం: ఆకట్టుకున్న బాణసంచా

కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, రాజ్యసభ సభ్యులు వి. హనుమంతురావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్యే కిషన్ రెడ్డి, అంబర్ పేట దేవస్థాన సేవా సమితి ఛైర్మన్ దుర్గా ప్రసాద్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కాల్చిన బాణసంచా ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది.

రావణ దహనం: ఆకట్టుకున్న బాణసంచా

రావణ దహనం: ఆకట్టుకున్న బాణసంచా

నగరంలో దసరా సంబురాలు పలు ప్రాంతాలలో అంబురాన్నంటాయి. వేల సంఖ్యలో హాజరైన జనంకు బాణసంచా వెలుగులు కనువిందు చేయగా నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందర్ని ఆకట్టుకున్నాయి.

రావణ దహనం: ఆకట్టుకున్న బాణసంచా

రావణ దహనం: ఆకట్టుకున్న బాణసంచా

కుత్బుల్లాపూర్ నియోజక వర్గం గాజుల రామారం శ్రీ చిత్తారమ్మ టెంపుల్ దగ్గర విజయదశమి సందర్భంగా రావణ దహన కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ నియోజక వర్గ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ పాల్గొన్నారు.

రావణ దహనం: ఆకట్టుకున్న బాణసంచా

రావణ దహనం: ఆకట్టుకున్న బాణసంచా

ఈ సందర్భంగా చిత్తారమ్మ దేవాలయం దగ్గర రావణ దహన కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయదశమి సందర్భంగా కుత్బుల్లాపూర్ నియోజగ వర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆయన అన్నారు.

రావణ దహనం: ఆకట్టుకున్న బాణసంచా

రావణ దహనం: ఆకట్టుకున్న బాణసంచా

ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ఛైర్మన్ కూన అంజయ్య గౌడ్, ఇంద్రసేనా రెడ్డి, ఇంద్రసేనా గుప్త, రవి, సహదేవ్, రాజిరెడ్డి, వర్మలతో పాటు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. మరోవైపు ఉప్పల్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో జమ్మికొమ్మకు పూజలు నిర్వహించిన అనంతరం పాలపిట్ట దర్శనం అనంతరం రావణ దహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

రావణ దహనం: ఆకట్టుకున్న బాణసంచా

రావణ దహనం: ఆకట్టుకున్న బాణసంచా

ఈ వేడుకల్లో మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ, ఎమ్మెల్యే ప్రభాకర్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఎం.శివారెడ్డి, ఏసిపి రవిచంథన్‌రెడ్డి, ఇన్‌స్పెక్టర్ నర్సింహారెడ్డి, జోనల్ కమిషనర్ రఘుప్రసాద్ తదితరులు పాల్గొని దసరా శుభాకాంక్షలు తెలిపారు.

రావణ దహనం: ఆకట్టుకున్న బాణసంచా

రావణ దహనం: ఆకట్టుకున్న బాణసంచా

హబ్సిగూడలో దసరా ఉత్సవ సమితి అధ్యక్షుడు సల్ల చంద్రారెడ్డి ఆధ్వర్యంలో దసరా వేడుకలు ఘనంగా జరిగాయి. వేలాది మంది ప్రజలు పాల్గొని సంబురాలు నిర్వహించారు. జమ్మిచెట్టుకు చంద్రారెడ్డి పూజలు నిర్వహించి ప్రారంభించారు. అనంతరం రావణ దహన కార్యక్రమాన్ని నిర్వహించి అలయ్ బలయ్‌తో దసరా శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

రావణ దహనం: ఆకట్టుకున్న బాణసంచా

రావణ దహనం: ఆకట్టుకున్న బాణసంచా

ఇక బోడుప్పల్‌లోని వేర్వేరు ప్రాంతాలలో దసరా సంబురాలు ఘనంగా జరిగాయి. ఇందిరానగర్‌లో మాజీ వార్డు సభ్యులు రాసాల వెంకటేశ్‌యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. పీర్జాదిగూడ బుద్ధానగర్‌లో ఎంపిటిసి వికె నాదంగౌడ్, కాలనీ అసోసియేషన్ సభ్యులు, వివిధ పార్టీల నేతలు ఆనందంతో దసరా వేడుకలను నిర్వహించారు.

 రావణ దహనం: ఆకట్టుకున్న బాణసంచా

రావణ దహనం: ఆకట్టుకున్న బాణసంచా

దసరా శరన్నవ రాత్రి మహోత్సవాలు ముగిశాయి. వేడుకల్లో భాగంగా శుక్రవారం చివరి రోజు ఉప్పల్ వెలుగుట్టపైన శ్రీదుర్గామల్లిఖార్జున స్వామి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పంచామృతాభిషేకం, కుంకుమార్చన నిర్వహించారు. వందలాది మంది భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి శోభాయాత్రతో నిమజ్జనం చేశారు.

English summary
Dussehra Celebrations at Amberpet, Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X