వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఛాయా 'చిత్రలిపి': ఎవరేమన్నారు? (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

సందర్శకుల కోరిక మేరకు రవీంద్రభారతి ప్రాంగణంలోని ఐసిసిఆర్‌ ఆర్ట్‌ గ్యాలరీలో నిర్వహింపబడుతున్న కందుకూరి రమేష్‌ బాబు ఛాయా 'చిత్రలిపి ఆదివారం 19 వ తేదీ వరకూ పొడగింపబడింది. గ్యాలరీ వేళలు ఉదయం 11 గం.నుంచి సాయంత్రం 7 వరకు. అందరికీ ఆహ్వానం. ప్రవేశం ఉచితం.

'చిత్రలిపి'పై అభిప్రాయ మాలిక

సామాన్యుల హృదయలిపి రమేష్‌ బాబు 'చిత్రలిపి'.
-ఎన్‌.ముక్తేశ్వరరావు, కార్యదర్శి, భాషా సాంస్కృతిక శాఖ, ఆం.ప్ర.

'చిత్రలిపి' పేర్న ప్రదర్శింపబడుతున్న ఈ ఛాయాచిత్ర ప్రదర్శనలో పండగకు సంబంధించిన సంబరమే కాకుండా గ్రామాలలోని జన జీవితాన్ని కూడా చెప్పకనే చెప్పాడు రమేష్‌ బాబు. అందుకు ఆయన్ని అభినందిస్తున్నాను. -బి.నరసింగరావు, ప్రసిద్ధ సినీ దర్శకులు.

సామాన్యుల జీవితాల్లోని అసామాన్యమైన విషయాలకు అత్యల్పం నుంచి అనల్పాలను సృజించే వాడే సృజన కారుడు. బహుశా సామాన్యశాస్త్రం నుంచి సాహిత్యంలో, చిత్రకళలో, ఫొటోగ్రఫిలో ఇదే రమేష్‌ జీవనమైనందుకు అభినందన.

భిన్నత ఈ యుగపు స్వభావం. చిత్రలిపి తెలంగాణ, సామాన్య నగరంలోని బస్తీ జీవన లిపి... మొదటిది...అందుకు హృదయపూర్వక అభినందనలు. -అల్లం నారాయణ, సంపాదకులు, నమస్తే తెలంగాణ.

సామాన్య శాస్త్రం ఛాయా చిత్రలిపి 1

సామాన్య శాస్త్రం ఛాయా చిత్రలిపి 1

హైదరాబాదులోని రవీంద్ర భారతిలో ఏర్పాటైన కందుకూరి రమేష్ బాబు ఛాయాచిత్ర ప్రదర్శన పలువురిని ఆకట్టుకుంటోంది. దీంతో ప్రదర్శనను ఈ నెల 19వ తేదీ వరకు పొడగించారు.

సామాన్య శాస్త్రం ఛాయా చిత్రలిపి 2

సామాన్య శాస్త్రం ఛాయా చిత్రలిపి 2

సామాన్య శాస్త్రం ఛాయా చిత్రలిపిగా కందుకూరి రమేష్ బాబు చెబుతున్నారు. వైవిధ్య భరితమైన ముగ్గుల దృశ్యాలను ఆయన కెమెరాలో బంధించి ప్రదర్శిస్తున్నారు.

సామాన్య శాస్త్రం ఛాయా చిత్రలిపి 3

సామాన్య శాస్త్రం ఛాయా చిత్రలిపి 3

దైవశక్తిని ఆపాదించి ప్రజలు కొన్ని వృక్షాల మొదళ్లను ఇలా అలంకరిస్తారు. దాన్ని కూడా రమేష్ చిత్రలిపి కిందికి తీసుకుని వచ్చాడు.

సామాన్యశాస్త్రం ఛాయా చిత్రలిపి 4

సామాన్యశాస్త్రం ఛాయా చిత్రలిపి 4

మహిళలు ముగ్గు వేసి, బోగి పళ్లు పెట్టి, మందార పువ్వుతో ఇలా అలంకరించారు. ఓ కళాత్మక సౌందర్యం ఇందులో ఉట్టిపడుతుంది.

సామాన్య శాస్త్రం ఛాయా చిత్రలిపి 5

సామాన్య శాస్త్రం ఛాయా చిత్రలిపి 5

ఇంటి కడపను కూడా మహిళలు ఇలా అలంకరించి, గొబ్బెమ్మలు పెట్టి పూజిస్తారు. ఇంటి ముంగిలి కళాప్రదర్శనకు ఆటపట్టు అవుతుంది.

సామాన్య శాస్త్రం ఛాయా చిత్రలిపి 6

సామాన్య శాస్త్రం ఛాయా చిత్రలిపి 6

సంక్రాంతి పర్వదినానికి కోళ్లకు సంబంధం ఉంది. సంక్రాంతి సందర్భంగా కొన్ని ప్రాంతాల్లో కోడి పందేలు జరుగుతాయి. అయితే, గొబ్బెమ్మల చుట్టూ పరిచిన నవధాన్యాలు కోళ్లకు ఆహారం అవుతాయి.

సామాన్య శాస్త్రం ఛాయా చిత్రలిపి 7

సామాన్య శాస్త్రం ఛాయా చిత్రలిపి 7

ఓ మహిళ తన ముగ్గుతో చేపలను చిత్రీకరించింది. నీటిలో చేపలు ఈదులాడుతున్న భ్రాంతిని ఆమె ముగ్గు ద్వారా కల్పించింది.

సామాన్య శాస్త్రం ఛాయా చిత్రలిపి 8

సామాన్య శాస్త్రం ఛాయా చిత్రలిపి 8

అమ్మాయిలు ముగ్గులను తీర్చిదిద్దుతుంటే, తినేది కావచ్చునని ఓ గోవు ఇలా ముందుకు వచ్చి చూస్తోంది. అంత సజీవంగా దృశ్యం కళ్లకు కడుతుంది.

సామాన్య శాస్త్రం చిత్రలిపి 9

సామాన్య శాస్త్రం చిత్రలిపి 9

ముగ్గులు వేయడానికి ఏకాగ్రత అవసరం. సంక్రాంతి సందర్భంగా మహిళలు పోటీ ముగ్గులు వేస్తారు. సుదీర్ఘమైన ముగ్గులు వేయడానికి కూడా ఇష్టపడుతారు.

ఒక్క మాటలో చెప్పాలంటే, కందుకూరి రమేష్‌ బాబు జీవితాన్ని ముగ్గులోకి దింపాడు. ' -రాళ్లబండి కవితా ప్రసాద్‌, సంచాలకులు, భాషా సంస్కృతిక శాఖ

జీవితం కళాత్మకం.
జీవితమే కళా సౌందర్యం.
జీవితం చిత్రలిపి' వంటిది. దాని నిజబింబం కందుకూరి రమేష్‌ బాబు ఛాయా చిత్రలిపి. -కాసుల ప్రతాపరెడ్డి, సంపాదకులు, తెలుగు వన్‌ ఇండియా డాట్‌ ఇన్‌

చిత్రలిపి ప్రదర్శన...వాకిట్లో 'అమ్మ' ముగ్తేస్తున్నట్లుంది. -గణేష్‌, టీవీ 9, హైదరాబాద్‌.

రమేష్‌ బాబు సామాన్యశాస్త్రం 'చిత్రలిపి' చూసి చాలా సంతోషించాను. సామాన్యుల సాంస్కృతిక సందర్భాన్ని సార్వజనీనం చేసే, పట్టాభిషిక్తం చేసే పనిలో తానున్నట్లు నా కన్పించింది.
కొత్తరాతి యుగం ప్రాచీనత, సామాన్యుల ఆధునికత ఈ బొమ్మల్లో నాకగుపించింది. పరిసరాల్ని అందంగా, శుభ్రంగా, సృజనాత్మక శ్రమతో తీర్చిదిద్దటం ఈ చిత్రాల్లో అంతటా కన్పిస్తుంది.

రాతి గోడల కింద బ్రౌన్‌ రంగు పూసి, దానిపై తెల్లగీతల ముగ్గు వేసిన చిత్రం, బెస్త బాలమణి ఒకే కన్ను -మూడు చేపల ముగ్గు ఒక ప్రాచీన సృజాత్మక లోకం వైపు నన్ను తీసుకెళ్లాయి.
సామాన్యుల సాంస్కృతిక శాస్త్రాన్ని సాధికారం చెయ్యడానికి తన సృజనాత్మక శ్రమతో ప్రయత్నిస్తున్న రమేష్‌కి హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు. -కృపాకర్‌ మాదిగ

ఇక్కడ పెట్టిన ఆర్ట్‌ అన్నింటిలోనూ మా ఊరు కనిపించింది. సంక్రాంతి ముగ్గులు, కనుమ రోజు వేసే రథం ఆ రథాన్ని లాక్కుంటూ వెళ్లి పక్కింటి దాకా వదిలివేస్తాం. ఆ జ్ఞపకాలన్నీ ఇక్కడ మళ్లీ గుర్తుకు వచ్చాయి. -హేమలత, జూనియర్‌ ఆసిస్టెంట్‌, భాషా సాంస్కృతిక శాఖ

సంక్రాంతి పర్వదినాల సందర్భంగా చిరంజీవి కందుకూరి రమేష్‌ బాబు నిర్మాణంలోచిత్రలిపిచాలా ముచ్చటగా, ఆనందంగా అనిపించింది. శుభాకాంక్షలు. -పద్మశ్రీ నాగేశ్వరరావు, సురభి అధినేత, హైదరాబాద్‌.

రాసి పోస్తే ముగ్గు!
రాసినవి,తీసినవి కూరిస్తే 'చిత్రలిపి'. -సురేష్‌ కాలేరు, హైదరాబాద్

English summary
Kandukuri Ramesh Babu's chitralipi exhibition has been extended till January 19. Film personality B Narsing Rao and others extended their opinion on Chitralipi
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X