వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'కుమార్తెను వికలాంగుడికి.. అతని అక్క ఆ తండ్రికి రెండో భార్య'

పాకిస్తాన్ లో లింగ వివక్ష ఎంత దారుణంగా ఉందో చెప్పే ఘటన ఇది. పైపెచ్చు.. ఇదంతా దైవాదేశమే అన్న ఓ మూఢత్వం.

|
Google Oneindia TeluguNews

జాంపూర్: కొడుకులు లేరన్న కారణంగా రెండో పెళ్లి చేసుకోవాలనుకున్నాడు ఓ తండ్రి. అన్న మానసిక వికలాంగుడు కావడంతో.. పెళ్లికి దూరంగా ఉండిపోయింది ఓ అక్క. ఆ అక్కకు ఓ తోడు కావాలి. ఆ తండ్రికి కొడుకులనిచ్చే భార్య కావాలి.

ఇద్దరు కలిసి ఒప్పందానికి వచ్చారు. ఆ తండ్రి తన కూతురుని పణంగా పెట్టి రెండో పెళ్లికి సిద్దపడ్డాడు. పాకిస్తాన్ లో జరిగిన ఈ ఘటన ఇప్పుడో సంచలనంగా మారింది. ఆ దేశంలో లింగ వివక్ష ఎంత దారుణంగా ఉందో చెప్పే ఘటన ఇది. పైపెచ్చు.. ఇదంతా దైవాదేశమే అన్న ఓ మూఢత్వం.

మహమ్మద్ రంజాన్(36) పుట్టుకతోనే మానసిక వికలాంగుడు. అతని ఆలనా-పాలనా అంతా అక్క బాధ్యతే. ఆమె పెళ్లి చేసుకోవాలంటే రంజాన్ ను చూసుకోవడానికి మరో ఆడ తోడు కావాలి. అది భార్య అయితే కట్టిపడేసినట్టు అతనితోనే ఉంటుందనేది ఆమె భావన.

Father exchanges daughter, 13, with disabled man for second wife

ఆమెకు తగ్గట్టు వజీర్ అహ్మద్ అనే వ్యక్తి దొరికాడు. అతని బాధంతా కొడుకుల్లేరని, మొదటి భార్యకు అందరు ఆడపిల్లలే పుట్టడంతో.. మరో పెళ్లి చేసుకోవాలనేది అతని కోరిక. ఇందుకు భార్యకు ఎలాంటి అభ్యంతరం లేదు. దానికి తోడు తన కడుపున మగపిల్లవాడు పుట్టకపోవడం తన తప్పే కాబట్టి.. భర్త రెండో పెళ్లికి ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు అనేది ఆమె అమాయక వాదన.

మొత్తానికి వజీర్ అహ్మద్-రంజాన్ అక్కకు మధ్య ఒప్పందం కుదిరింది. వజీర్ అహ్మద్ తన 13ఏళ్ల కూతురు సైమాను మానసిక వికలాంగుడైన రంజాన్ కు ఇచ్చి పెళ్లి చేశాడు. అన్నను చూడటానికి ఓ తోడు దొరకడంతో.. రంజాన్ సోదరి వజీర్ అహ్మద్ ను పెళ్లాడింది. కొడుకు పుట్టాలన్న దురాశతో కూతురి జీవితాన్ని బలిచేయడం తప్పు కదా అని వజీర్ అహ్మద్ ను ప్రశ్రిస్తే.. అదంతా ఆమె దురదృష్టం భగవంతుడు ఆమెను అలా ఆదేశించాడు అని సమాధానం చెబుతున్నాడు.

ఇదే ప్రశ్న వజీర్ అహ్మద్ భార్యను అడిగితే 'ఆడపిల్లలు ఇంటికి భారం.. వారు రజస్వల కాగానే ఇంటినుంచి వెళ్లగొట్టాలి. లేదంటే.. వేరే వ్యక్తితో పారిపోవడమో.. లేదంటే అక్రమ సంబంధాలు పెట్టుకోవడం చేస్తే.. పరువుపోతుంది.' అంటూ సమాధానం చెప్పింది.

ఇంకా ఆశ్చర్యకరమైన విషయమేంటంటే.. కూతురి జీవితాన్ని నాశనం చేసినందుకు గాను వజీర్ అహ్మద్ కు జైలు శిక్ష పడగా.. స్వయంగా కూతురు సైమానే 'తనకు పదహారేళ్లున్నాయని, తన తండ్రి పెళ్లి చేయడంలో తప్పు లేదని' అధికారులకు వెల్లడించింది.

పాకిస్తాన్ లో ఇలా ఆడపిల్లలను ఇచ్చి పుచ్చుకునే ధోరణి ఏళ్లుగా కొనసాగుతోంది. అక్కడి ఉర్దూలో ఈ ఆచారాన్ని వాట్టా-సట్టా అని పిలుస్తారు. ఆడపిల్లను కట్నంగా ఇవ్వడం లేదా విరోధులుగా ముద్రపడ్డ కుటుంబాల మధ్య వివాదాలను సర్దుమణిగేలా చేయడం కోసం ఆడపిల్లలను ఇచ్చి పుచ్చుకుంటుంటారు. కొన్నిసార్లు వారసుడిని కనివ్వడం కోసం స్వంత కుంటుంబంలో వ్యక్తినే పెళ్లాడిన పరిస్థితులు కూడా ఉంటాయి.

ఆమె దృష్టిలో ఆడజన్మ ఎత్తినందుకు పిల్లలను కని తీరాల్సిందే. అది చిన్నపిల్లలైనా సరే. తనకు తండ్రి అంటే భయమని, కానీ తనకు ఎవరితో పెళ్లి చేయాలనేది ఆయన ఇష్టమేనని అమాయకంగా సమాధానం చెబుతోంది సైమా. సైమా లాంటి చిన్నారుల జీవితాలు ప్రస్తుతం పాకిస్తాన్ లో కోకొల్లలు.

ఆమె పుట్టి పెరిగిన గిరిజన వాతావరణం, మతం పేరిట మూఢ విశ్వాసాలను ఆచరణలో పెట్టడం ఇలాంటి చిన్నారుల జీవితాలను బలితీసుకుంటున్నాయి.

English summary
Mohammad Ramzan can neither hear nor speak, and he has a childlike mind. But he knew his wife, Saima, was too young when she was given to him as a bride.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X