హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గణేష్ నిమజ్జనం: పోలీస్ వ్యూహం, ఆటపాటలతో యువత డ్యాన్స్

By Nageshwara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహింంచిన గణేశ్ నిమజ్జనోత్సవాలను నగర పోలీసులు విజయవంతంగా ముగించారు. నవరాత్రులు ఆరాధించిన గణనాథుడికి జంట నగరాలు ఘనమైన వీడ్కోలు పలికాయి. ఏకదంతుడికి చివరి పూజలు నిర్వహించిన భక్తులు నగర వీధుల్లో ఊరేగింపుగా గురువారం ఘనమైన వీడ్కోలు పలికారు.

నగరంలోని పలు ప్రధాన జలాశయాల్లో గణేశ్ నిమజ్జనం కోలాహలంగా జరిగింది. హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేసేందుకు ఊరేగింపుగా బయలుదేరిన బృందాలు, ఉత్సవ విగ్రహాలతో ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు ప్రధాన వీధులన్నీ కిక్కిరిశాయి. ప్రతిష్టాత్మకమైన ఖైరతాబాద్ గణేశుడు నిమజ్జనం మధ్యాహ్నానికి పూర్తి అయింది.

ఓర్పు, టెక్నాలజీ, ఫ్రెండ్లీ పోలీసింగ్ వల్లే ఇదంతా సాధ్యమైంది. ఎక్కడా భక్తులకు అసౌకర్యం కలుగకుండా మేయర్ బొంతు రామ్మోహన్‌తోపాటు జీహెచ్‌ఎంసీ అధికార యంత్రాంగం పరిస్థితులపై నిరంతర నిఘా ఏర్పాటు చేసింది. గణేష్ ఉత్సవసమితి ప్రతినిధులు, మండపాల నిర్వాహకులతో చర్చలు జరిపి ఆ మేరకు ఉదయం ఆరు గంటలకే శోభాయాత్ర మొదలయ్యేలా చర్యలు తీసుకున్నారు.

సీఎం కేసీఆర్ అభినందనలు

సీఎం కేసీఆర్ అభినందనలు

గణేశ్ నిమజ్జనం సజావుగా సాగడంపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సంతోషం వ్యక్తం చేశారు. భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ నిమజ్జనానికి ఎలాంటి ఆటంకం, అవాంఛనీయ సంఘటన జరుగకుండా ఆద్యంతం అప్రమత్తంగా ఉండి విధులు నిర్వహించిన అధికార యంత్రాంగానికి, సహకరించిన గణేశ్ ఉత్సవ కమిటీలకు సీఎం అభినందనలు తెలిపారు.
 పోలీసుల పనితీరు భేష్: హోంమంత్రి నాయిని

పోలీసుల పనితీరు భేష్: హోంమంత్రి నాయిని


ఎటువంటి అవాంఛనీయ ఘటన జరుగకుండా వినాయక నిమజ్జనం ప్రశాంతంగా నిర్వహించిన రాష్ట్ర పోలీసుల పనితీరు భేష్ అని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ప్రశంసించారు. డీజీపీ అనురాగ్‌శర్మ, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డితో కలిసి ఆయన నిమజ్జనోత్సవాలను హెలికాప్టర్‌లో ఏరియల్ సర్వే చేశారు.

 జీహెచ్‌ఎంసీకి కేటీఆర్ అభినందనలు

జీహెచ్‌ఎంసీకి కేటీఆర్ అభినందనలు


ప్రతికూల వాతావరణంలో సైతం నిమజ్జనాన్ని విజయవంతంగా నిర్వహించినందుకుగాను రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీ రామారావు జీహెచ్‌ఎంసీని అభినందించారు.

 సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు : సీపీ మహేందర్‌రెడ్డి

సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు : సీపీ మహేందర్‌రెడ్డి

ప్రభుత్వంలోని అన్ని విభాగాలు, ప్రజలు, మండపాల నిర్వాహకులు, భక్తులు సమష్టిగా ప్రశాంత వాతావారణంలో నిమజ్జనం నిర్వహించేందుకు సహకరించారని, వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నట్లు నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి అన్నారు. ఖైరతాబాద్ గణేశ్ మండపం నిర్వాహకుల సహకారంతో ఈ సారి ముందుగా భారీ వినాయకుడిని నిమజ్జనం చేశామన్నారు. అనుకున్న సమయానికి నిమజ్జనోత్సవాన్ని పూర్యయేలా చర్యలు తీసుకున్నామని, బందోబస్తులో పాల్గొన్న సిబ్బంది అందించిన సేవలు ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు నిదర్శనమని సీపీ అభినందించారు.

 ఖైరతాబాద్ గణనాథుడిని కళ్లారా దర్శించుకునే భాగ్యం : మేయర్

ఖైరతాబాద్ గణనాథుడిని కళ్లారా దర్శించుకునే భాగ్యం : మేయర్


చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి నగర ప్రజలందరికీ ఖైరతాబాద్ గణనాథుడిని కళ్లారా చూసుకునే భాగ్యం కలిగిందని మేయర్ బొంతు రామ్మోహన్ పేర్కొన్నారు. ప్రతిసారీ అర్థరాత్రో, లేక మరుసటిరోజు తెల్లవారుజామునో నిమజ్జనం చేయడంవల్ల చాలామంది భక్తులు ఖైరతాబాద్ గణనాథుడిని ప్రత్యక్షంగా దర్శిచుకునే పరిస్థితి ఉండేది కాదని ఆయన చెప్పారు. గతానికి భిన్నంగా ఈసారి అర్ధరాత్రికల్లా ప్రముఖ విగ్రహాలన్నీ నిమజ్జనం అయ్యేలా తాము రూపొందించిన ప్రణాళికలు విజయవంతమైందని మేయర్ సంతృప్తి వ్యక్తంచేశారు. సీసీ టీవీల ద్వారా వచ్చే ఇన్‌పుట్స్ ఆధారంగా ఎక్కడా శోభాయాత్రకు అడ్డంకులు లేకుండా తగిన చర్యలు తీసుకున్నట్లు రామ్మోహన్ తెలిపారు.

 రోడ్లు, పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి : కమిషనర్

రోడ్లు, పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి : కమిషనర్


నగరవ్యాప్తంగా దాదాపు 380కి.మీ.లమేర సాగిన శోభాయాత్రకు ఎక్కడా ఇబ్బంది కలుగకుండా ఉండేందుకు రోడ్డు మరమ్మతు పనులు నిర్వహించినట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్ డా.బి. జనార్దన్‌రెడ్డి తెలిపారు. ముఖ్యంగా ప్రధాన మార్గాల్లో గుంతలు లేకుండా చేయడంవల్ల యాత్ర సజావుగా సాగినట్లు ఆయన పేర్కొన్నారు. అలాగే, రోడ్లపై పడిన వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. యాత్ర కొనసాగే మార్గాల్లో భక్తులకు అసౌకర్యం కలుగకుండా ప్రత్యేక యాక్షన్ టీమ్‌లను నియమించామన్నారు. ప్రత్యేక వాహనాల ద్వారా ఎప్పటికప్పుడు వ్యర్థాలను తరలించినట్లు కమిషనర్ వివరించారు.

 ముందస్తు అవగాహనతోనే

ముందస్తు అవగాహనతోనే


గురువారం రాత్రి 12 గంటల వరకు వినాయక విగ్రహాల నిమజ్జనం పూర్తి చేయాలనే లక్ష్యంతో మండపాల నిర్వాహకులకు పోలీసులు అవగాహన కల్పించి అందుకు అనుగుణంగా వారి నుంచి గణనాథులను తరలించే విధంగా సఫలీకృతులయ్యారు. ఉదయం నుంచి వర్షం పడడంతో పోలీసులు అనుకున్న సమయానికి చాలావరకు విగ్రహాలు నిమజ్జనానికి కదలిరాలేదు. ఖైరతాబాద్ గణేష్ విగ్రహాన్ని ఈ సారి ఉదయం పూటనే నిమజ్జనం చేయడం విశేషం. బాలాపూర్ విగ్రహాన్ని కూడా త్వరగా చార్మినార్ మీదుగా తరలించడంలో పోలీసులు విజయం సాధించారు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత కాలనీలు, బస్తీల నుంచి విగ్రహాలు కదలడం ప్రారంభమయ్యాయి. ఆ తరువాత శోభాయాత్ర ఊపందుకుంది.

 కమాండ్ కంట్రోల్ నుంచి సూచనలు

కమాండ్ కంట్రోల్ నుంచి సూచనలు

ప్రశాంతంగా వినాయక నిమజ్జనం ముగించడంలో కీలక పాత్ర పోషించిన హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డిసహా నగర పోలీసుశాఖను డీజీపీ అనురాగ్‌శర్మ అభినందించారు. ప్రధాన శోభయాత్ర జరిగే రూట్‌తోపాటు నగరంలోని వివిధ ప్రాంతాలలో ఏర్పాటు చేసిన సుమారు 12 వేల సీసీ కెమెరాలను పోలీస్‌స్టేషన్, జోనల్ కమాండ్ కంట్రోల్, కమిషనర్ కార్యాలయంలోని ప్రధాన కమాండ్ కంట్రోల్ కేంద్రానికి అనుసంధానం చేశారు. క్వాలిటీతో కూడిన వీడియోలతో క్షేత్ర స్థాయిలో ట్రాఫిక్ జామ్, ఇతర ఇబ్బందులను గుర్తించి వెంటనే స్థానికంగా ఉన్న అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక్కడ అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, సీసీ కెమెరాల టెక్నికల్ బృందాలు పర్యవేక్షించాయి.

 అధికారుల పర్యవేక్షణ

అధికారుల పర్యవేక్షణ

ఉదయం నుంచే హైదరాబాద్ సీపీ మహేందర్‌రెడ్డి ఒక పక్క కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నుంచి నిమజ్జన యాత్ర కొనసాగుతున్న తీరును పరిశీలిస్తూ, క్షేత్రస్థాయి అధికారులకు తగిన సూచనలిచ్చారు. చార్మినార్, మోంజామార్కెట్, ట్యాంక్‌బండ్ తదితర ప్రాంతాలలో ఆయన పర్యవేక్షించారు. హైదరాబాద్ సీపీతోపాటు ఉన్నతాధికారులు శ్రీనివాసరావు, జితేందర్, స్వాతిలక్రా, ప్రమోద్‌కుమార్, మురళీకృష్ణ ఇతర అధికారులు ఎప్పటికప్పుడు నిమజ్జనయాత్ర జరుగుతున్న తీరును గమనించారు.షీ టీమ్స్ నిఘా కూడా కొనసాగింది.

 అడుగడుగునా పోలీసులు

అడుగడుగునా పోలీసులు

నగర వ్యాప్తంగా అడుగుడుగునా పోలీస్‌లు బందోబస్తులో కన్పించారు. నగరంతోపాటు ఇతర జిల్లాల నుంచి వచ్చిన సిబ్బంది, కేంద్ర పారామిలటరీ తదితర విభాగాల నుంచి 25 వేల మంది సిబ్బంది బందోబస్తులో పాల్గొన్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు.

 సోషల్ మీడియాలో సమాచారం

సోషల్ మీడియాలో సమాచారం


వినాయక నిమజ్జనం జరుగుతున్న తీరును ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా నగర పోలీసులు తెలియజేశారు. ఖైరతాబాద్ వినాయకుడు నిమజ్జనానికి తరలించే విషయాలను ఉదయం నుంచే ఫేస్‌బుక్, ట్విట్టర్, వాట్సాప్‌లలో పోలీసులు సమాచారాన్ని అప్‌లోడ్ చేశారు. వీటితో పాటు ట్రాఫిక్ పోలీసులు కూడా ట్రాఫిక్ రద్దీ, ట్రాఫిక్ మళ్లింపు, పార్కింగ్ ప్రాంతాల గురించి సమాచారాన్నిచ్చారు.

 జంట కమిషనరేట్లలో ప్రశాంతం

జంట కమిషనరేట్లలో ప్రశాంతం

సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధిలో వినాయక నిమజ్జనం విజయవంతమైంది. రెండు కమిషనరేట్ల పరిధిలో మొత్తం 28 చెరువు ప్రాంతాల్లో భక్తులు ఆనందోత్సాహాలతో నిర్వహించారు. సైబరాబాద్ పోలీసు కమిషనర్ సందీప్ శాండిల్య, రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ స్వీయ పర్యవేక్షణలో ఎటువంటి ఉద్రిక్తతలు, వాగ్వాదాలు లేకుండా ప్రశాంతంగా ఉత్సవాలు ముగిసాయి. 10 వేల మందితో నిర్వహించిన బందోబస్తు భక్తులకు ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పింది.

 మహాఘట్టాన్ని తిలకించిన లక్షన్నర మంది

మహాఘట్టాన్ని తిలకించిన లక్షన్నర మంది


శ్రీ శక్తి పీఠ శివనాగేంద్ర మహాగణపతికి నగర చరిత్రలోనే మధ్యాహ్నం వరకే నిమజ్జనం చేశారు. గడిచిన దశాబ్ధాల కాలంలో ఖైరతాబాద్ గణేశుడిని చిట్టచివర నిమజ్జనం చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది శాంతిభద్రతలు, గతానుభావాలను దృష్టిలో ఉంచుకొని మొదటి సారిగా నిమజ్జనం చేసేందుకు ఉత్సవ కమిటీ నిర్ణయించింది. మునుపెన్నడూ లేని విధంగా ఖైరతాబాద్ గణేశుడి దర్శనానికి లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. ఈ క్రమంలో మధ్యాహ్నం 12.30గంటల నుంచి 1గంట వరకు ఎడతెరపి లేకుండా వర్షం కురవడంతో భక్తులు ఒక్కసారిగా చెల్లాచెదురయ్యారు.

 పదుల సంఖ్యలో తప్పిపోయిన చిన్నారులు

పదుల సంఖ్యలో తప్పిపోయిన చిన్నారులు

ఇదిలా ఉండగా పదుల సంఖ్యలో చిన్నారులు తప్పిపోయారు. దీంతో మహానిమజ్జనం ముగిసిన మూడు గంటల పాటు చిన్నారుల కోసం తల్లిదండ్రులు వెతకడం, పోలీసులు, జీహెచ్‌ఎంసీ సిబ్బంది మైకు ద్వారా అనౌన్స్‌మెంట్ చేయడం కనిపించింది. మహా గణపతి నిమజ్జనాన్ని సెల్‌ఫోన్లలో రికార్డ్ చేయడానికి యువత పోటీపడ్డారు. మహాగణపతి నిమజ్జన యాత్ర ఆద్యంతం సందడిగా సాగింది.

నిరంతర పర్యవేక్షణ

నిరంతర పర్యవేక్షణ

నిరంతర పర్యవేక్షణ
మేయర్ బొంతు రామ్మోహన్‌తోపాటు జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్ధన్‌రెడ్డి నిరంతరం పర్యవేక్షణ కొనసాగించారు. ఉదయం నుంచే మేయర్ ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాల్లో పర్యటించడంతోపాటు హుస్సేన్‌సాగర్‌లో బోటుయాత్ర నిర్వహిస్తూ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు. కమిషనర్ జనార్దన్‌రెడ్డి సైతం ట్యాంక్‌బండ్ వద్ద ఏర్పాట్లను స్వయంగా పరిశీలించి పారిశుధ్య సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కోరారు. అలాగే, నిమజ్జన కార్యక్రమాన్ని హోంమంత్రి నాయిని నర్సింహరెడ్డి, డీజీపీ అనురాగ్‌శర్మ, పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి పర్యవేక్షించారు.

 నిమజ్జన విధుల్లో గుండెపోటుతో హోంగార్డు మృతి

నిమజ్జన విధుల్లో గుండెపోటుతో హోంగార్డు మృతి


వినాయక నిమజ్జనాన్ని పురస్కరించుకుని నగరానికి బందోబస్తు నిమిత్తం వచ్చిన ఓ హోంగార్డు (నెం 94) అనారోగ్యంతో హఠాన్మరణం పొందాడు. ఈ సంఘటన సుల్తాన్‌బజార్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వరంగల్ జిల్లా కాగజ్‌నగర్‌కు చెందిన హోంగార్డు కె.ప్రసాద్ (53)కు నగరంలో వినాయక బందోబస్తు డ్యూటీ వేశారు. దీంతో అతను ఈ నెల 11న సుల్తాన్‌బజార్ పోలీస్‌స్టేషన్‌లో రిపోర్టు చేయగా గుజరాత్‌గల్లీలోని నవీన్ కుమార్‌యాదవ్ అనే మండప నిర్వాహకుడు ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద బందోబస్తు చేస్తున్నారు. శోభాయాత్ర రాత్రి 8 గంటల సమయంలో అబిడ్స్ చర్మాస్ వద్దకు చేరుకోగానే అతను ఒక్కసారిగా కుప్పకూలాడు. ఫిట్స్‌గా భావించి అక్కడే విధులు నిర్వహిస్తున్న సిబ్బంది అతన్ని కింగ్‌కోఠిలోని కామినేని ఆస్పత్రికి తరలించారు. అతనికి ఆస్పత్రిలో ప్రథమ చికిత్స అందిస్తుండగానే మృతి చెందాడు.

English summary
Amidst incessant drizzle, a stream of processions carrying Ganesh idols were seen near Hussainsagar lake. Early in the day, the tallest idol in the city, a 58-feet Khariatabad Ganesh procession moved through Khairatabad, Telephone Bhavan and surrounding areas before reaching Tank Bund for immersion.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X