• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

నిమజ్జనం: యవత డ్యాన్స్, పోటెత్తిన జనం(ఫోటోలు)

By Nageswara Rao
|

హైదరాబాద్: నవరాత్రులు పూజలు అందుకున్న గణనాథుడి నిమజ్జానికి అశేష సంఖ్యలో తరలివచ్చిన భక్తజనం, రంగు రంగుల విద్యుత్ దీపాలు, వివిధ రకాల పూలతో ఆకర్షణీయంగా మస్తాబు చేసిన వాహనాల్లో ఆసీనులై హుస్సేన్ సాగర్‌కు తరలుతున్న గణేషులకు అడుగడుగునా భక్తజనం చేసిన జయజయ ధ్వానాలు ఆబాలగోపాలాన్ని ఊర్రూతలూగించింది.

కళాకారుల ప్రదర్శనలతో ఆదివారం సామూహిక గణేష్ నిమజ్జన ఊరేగింపు లష్కర్ పురవీధుల్లో శోభాయమానంగా జరిగింది. ప్యాట్నీ సెంటర్, ప్యారడైజ్, సీటీవో, రాష్ట్రపతి రోడ్డు, సరోజినీ దేవీ రోడ్డు, మినిస్టర్ రోడ్డు తదితర ప్రధాన రహదారుల మీదుగా వినాయక ప్రతిమలను హుస్సేన్ సాగర్‌కు తరలించారు.

11 రోజులుగా వివిధ ఆకృతుల్లో కొలువైన బొజ్జ గణపయ్యకు భక్తులు ఆట పాటలతో ఆదివారం వీడ్కోలు పలికారు. ఒకరినిమించి ఒకరు మంటపాల నిర్వాహకులు అలంకరణలపై దృష్టి పెట్టడంతో వాస్తవానికి చాలాచోట్ల శోభాయాత్ర ఆలస్యంగా ప్రారంభమైంది. దీంతో నిమజ్జనం ఆదివారం అర్థరాత్రి వరకూ సాగుతూనే ఉంది.

 నిమజ్జనం: యవత డ్యాన్స్, పోటెత్తిన జనం

నిమజ్జనం: యవత డ్యాన్స్, పోటెత్తిన జనం

సోమవారం ఉదయం లేదా మధ్యాహ్యానికి నిమజ్జనం పూర్తికావొచ్చని అధికార్లు అంచనా వేస్తున్నారు. ఇదిలావుంటే, ఖైరాదాబాద్‌లో ఏర్పాటు చేసిన త్రిశక్తిమయ మోక్ష గణపతిని నిమజ్జనానికి తరలించడం ఆలస్యమయ్యేలా ఉంది.

నిమజ్జనం: యవత డ్యాన్స్, పోటెత్తిన జనం

నిమజ్జనం: యవత డ్యాన్స్, పోటెత్తిన జనం

అరుదైన చంద్ర గ్రహణం కారణంగా గ్రహణ ఘడియలు దాటిన తరువాతే శాస్త్రోక్తంగా గణనాథుని శోభాయాత్రకు చేరుస్తారని అంటున్నారు. శోభాయాత్ర ఆలస్యమయ్యే పరిస్థితులను ముందుగానే అంచనా వేసి అసెంబ్లీ, కౌన్సిల్ సమావేశాలను మంగళవారానికి వాయిదా వేశారు.

 నిమజ్జనం: యవత డ్యాన్స్, పోటెత్తిన జనం

నిమజ్జనం: యవత డ్యాన్స్, పోటెత్తిన జనం

సాగరతీరం జనహారంగా మారింది. వినాయక విగ్రహాలను చూసేందుకు సచివాలయం ముందు చౌరస్తాలో భారీ స్క్రీన్‌లను ఏర్పాటు చేశారు. నగరంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన గణేష్ విగ్రహాలను తెలుగుతల్లి ప్లై ఓవర్ కిందుగా ట్యాంక్ బండ్ మీదకు మళ్లించారు.

 నిమజ్జనం: యవత డ్యాన్స్, పోటెత్తిన జనం

నిమజ్జనం: యవత డ్యాన్స్, పోటెత్తిన జనం

ఇదిలావుంటే, ఏటా మాదిరిగానే శోభాయాత్రకు భక్తులు అశేషంగా తరలి రావడంతో చార్మినార్, మొజంజాహి మార్కెట్, అబిడ్స్, హుస్సేన్‌సాగర్, ఖైరతాబాద్, మెహిదీపట్నం తదితర ప్రాంతాలన్నీ క్రిక్కిరిసాయి. వినాయక్‌సాగర్‌కు తొమ్మిది వైపులనుంచీ గణనాథుల ఊరేగింపులు తరలివచ్చాయి.

నిమజ్జనం: యవత డ్యాన్స్, పోటెత్తిన జనం

నిమజ్జనం: యవత డ్యాన్స్, పోటెత్తిన జనం

ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్డు చుట్టూ భారీ క్రేన్లు నిరంతరంగా పని చేస్తున్నాయి. శోభాయాత్రలో ఎలాంటి ఇబ్బందికర పరిణామాలు తలెత్తకపోవడంతో పోలీస్ యంత్రాంగం ఊపిరిపీల్చుకుంది. అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా తీసుకున్న ముందు జాగ్రత్త చర్యలు ఫలితాన్ని ఇవ్వడంతో పోలీసులు ఊపిరితీసుకున్నారు.

నిమజ్జనం: యవత డ్యాన్స్, పోటెత్తిన జనం

నిమజ్జనం: యవత డ్యాన్స్, పోటెత్తిన జనం

మంటపాల నిర్వాహకులు కొంచెం ఆలస్యంగా యాత్ర ప్రారంభించడంతో చార్మినార్ నుంచి మొజంజాహి మార్కెట్ మీదుగా వినాయక్‌సాగర్ (హుస్సేన్ సాగర్)కు శోభాయాత్ర చేరుకోవడానికి మధ్యాహ్నం 3గంటలు దాటింది.

 నిమజ్జనం: యవత డ్యాన్స్, పోటెత్తిన జనం

నిమజ్జనం: యవత డ్యాన్స్, పోటెత్తిన జనం

గతంలో మధ్యా హ్నం ఒంటి గంటలోగా బాలాపూర్ గణేశ్ ఊరేగింపుతోపాటు పాతనగరంలోని పలు ఊరేగింపులు చార్మినార్ దాటేసేవి. అయితే ఈ దఫా మంటపాల నిర్వాహకులు మధ్యా హ్నం ఒంటిగంట వరకు వాహనాల అలంకరణలోనే నిమగ్నమయ్యారు.

 నిమజ్జనం: యవత డ్యాన్స్, పోటెత్తిన జనం

నిమజ్జనం: యవత డ్యాన్స్, పోటెత్తిన జనం

దీంతో నిమజ్జనం రాత్రి పొద్దుపోయేంత వరకూ సాగుతూనే ఉంది. సోమవారం మధ్యాహ్నం 10 గంటలు లేదా మధ్యాహ్నం వరకూ నిమజ్జనం కొనసాగే అవకాశం ఉందని అధికారుల అంచనా. వీటిని దృష్టిలో పెట్టుకునే అసెంబ్లీ, కౌన్సిల్ సమావేశాలను మంగళవారానికి వాయిదా వేశారు.

 నిమజ్జనం: యవత డ్యాన్స్, పోటెత్తిన జనం

నిమజ్జనం: యవత డ్యాన్స్, పోటెత్తిన జనం

సోమవారం నిర్వహిస్తే అసెంబ్లీకి సమీపంలోని వినాయక్ సాగర్‌కు శోభాయాత్ర కొనసాగుతుండటం ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడి ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, అధికారులకు ఇబ్బందులు ఏర్పడుతాయని, పోలీసులు కూడా బందోబస్తులో ఉంటారని ముందుగానే భావించి మంగళవారానికి ఉభయ సభలను వాయిదా వేశారు.

 నిమజ్జనం: యవత డ్యాన్స్, పోటెత్తిన జనం

నిమజ్జనం: యవత డ్యాన్స్, పోటెత్తిన జనం

ఇలాఉండగా నిమజ్జనాన్ని చూసేందుకు భక్తులు ఆశేషంగా తరలి రావడంతో చార్మినార్, మొజంజాహి మార్కెట్, ఆబిడ్స్, హుస్సేన్‌సాగర్, ఖైరతాబాద్, మెహిదీపట్నం తదితర ప్రాంతాలన్నీ క్రిక్కిరిసాయి. వినాయక్‌సాగర్‌కు తొమ్మిది వైపులనుంచీ గణనాథుల ఊరేగింపులు తరలి వచ్చాయి.

 నిమజ్జనం: యవత డ్యాన్స్, పోటెత్తిన జనం

నిమజ్జనం: యవత డ్యాన్స్, పోటెత్తిన జనం

వేల సంఖ్యలో వినాయకుల నిమజ్జనం కొనసాగుతోంది. ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్డు చుట్టూ 23 భారీ క్రేన్లు ఏర్పాటు చేశారు. వినాయక్ సాగరేకాకుండా నగరంలో, నగర శివారులో మొత్తం 28 చెరువుల్లో 60 భారీ క్రేన్లు ఏర్పాటు చేశారు.

 నిమజ్జనం: యవత డ్యాన్స్, పోటెత్తిన జనం

నిమజ్జనం: యవత డ్యాన్స్, పోటెత్తిన జనం

మినీ ట్యాంక్ బండ్‌గావున్న సరూర్‌నగర్ చెరువుకూ చుట్టుపక్కల నుంచి పెద్ద సంఖ్యలో గణనాథులు రావడంతో పరిసరాలు కిటకిటలాడాయి. గణనాథుల ఎత్తు ఎక్కువగా ఉండటంతో ప్లైవోవర్లు, కరెంటు తీగలున్న రోడ్లపై ఇబ్బందులు ఎదురయ్యాయి.

 నిమజ్జనం: యవత డ్యాన్స్, పోటెత్తిన జనం

నిమజ్జనం: యవత డ్యాన్స్, పోటెత్తిన జనం

నారాయణగూడ ఫ్లైవోవర్ వద్ద రెండు గణనాథుల విగ్రహాలు ఫ్లైవోవర్‌కంటే ఎక్కువ ఎత్తు ఉండటంతో చిక్కు ఏర్పడింది. దీంతో పోలీసులు మరో మార్గంలోకి ఊరేగింపును మళ్లించారు. ఖైరతాబాద్ వినాయకుడి ఊరేగింపు రాత్రి బాగా ఆలస్యంగా ప్రారంభించినందున సోమవారం నిమజ్జనం జరిగే అవకాశం ఉంది.

 నిమజ్జనం: యవత డ్యాన్స్, పోటెత్తిన జనం

నిమజ్జనం: యవత డ్యాన్స్, పోటెత్తిన జనం

చైతన్యపురి, దిల్‌షుక్ నగర్, సరూర్‌నగర్, మలక్‌పేట, సైదాబాద్, మెహిదీపట్నం, జూపార్కునుంచి పెద్ద సంఖ్యలో విగ్రహాలు వినాయక్ చౌక్ (మొజంజాహి మార్కెట్)కు చేరుకుంటుండంతో ఆ ప్రాంతం కిటకిటలాడింది.

 నిమజ్జనం: యవత డ్యాన్స్, పోటెత్తిన జనం

నిమజ్జనం: యవత డ్యాన్స్, పోటెత్తిన జనం

భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి నాయకులు మార్కెట్ వద్ద ఏర్పాటు చేసిన వేదికపై నుంచి ఉత్సవ సమితి నాయకులు, వివిధ పార్టీల నాయకులు ప్రసంగిస్తూ ఊరేగింపులకు స్వాగతం పలికారు. పాతనగరం నుంచి వచ్చిన వాహనాలకు చార్మినార్ వద్ద ఏర్పాటు చేసిన వేదిక నుంచి స్వాగతం పలికారు.

 నిమజ్జనం: యవత డ్యాన్స్, పోటెత్తిన జనం

నిమజ్జనం: యవత డ్యాన్స్, పోటెత్తిన జనం

మొజంజాహి మార్కెట్ వేదిక నుంచి కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి వెంకయ్య నాయుడు ఊరేగింపులకు స్వాగతం పలుకుతూ మాట్లాడారు. ప్రజల్లో అధ్యాత్మిక సంపద పెంచాల్సిన అవసరం ఉందన్నారు. అధ్యాత్మిక భావన పెంచేందుకు వినాయక పండుగ, ఊరేగింపులు ఉపయోగపడుతుందన్నారు.

 నిమజ్జనం: యవత డ్యాన్స్, పోటెత్తిన జనం

నిమజ్జనం: యవత డ్యాన్స్, పోటెత్తిన జనం

అన్ని మతాలు సమానమని, క్రమశిక్షణ, ఐక్యమత్యాన్ని పెంపొందించేందుకు ఇది ఉపయోగపడుతుందన్నారు. బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి పి మురళీధర్ రావు మాట్లాడుతూ హిందువుల్లో ఐక్యతను పెంచేందుకు నాడు పటేల్ ఈ ఊరేగింపును ప్రారంభించారని గుర్తు చేశారు.

 నిమజ్జనం: యవత డ్యాన్స్, పోటెత్తిన జనం

నిమజ్జనం: యవత డ్యాన్స్, పోటెత్తిన జనం

భాగ్యనగరంలోనే కాకుండా ముంబై, బెంగళూరులోనూ వినాయకుడి పండుగ, ఊరేగింపును ఘనంగా నిర్వహిస్తున్నారన్నారు. ఇంకా కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనా శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే బద్దం బాల్‌రెడ్డి, భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి అధ్యక్షుడు రాఘవరెడ్డి, ప్రధాన కార్యదర్శి భగవంత్‌రావు తదితరులు మాట్లాడారు.

 నిమజ్జనం: యవత డ్యాన్స్, పోటెత్తిన జనం

నిమజ్జనం: యవత డ్యాన్స్, పోటెత్తిన జనం

పాతనగరంలోని బాలాపూర్ గ్రామంలో ఆదివారం ఉదయం జరిగిన లంబోదరుని లడ్డూ వేలం కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, పి మహేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ రామచంద్రరావు, ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే బద్దం బాల్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి తనయుడు కార్తీక్‌రెడ్డి పాల్గొన్నారు. తర్వాత శోభాయాత్ర ప్రారంభమైంది.

 నిమజ్జనం: యవత డ్యాన్స్, పోటెత్తిన జనం

నిమజ్జనం: యవత డ్యాన్స్, పోటెత్తిన జనం

బాలాపూర్‌తోపాటు సున్నితమైన ప్రాంతాల్లో పోలీసు అధికారులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. సిసి కెమెరాలు ఏర్పాటు చేశారు. రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, డిజిపి అనురాగ్ శర్మ, పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి ఏరియల్ సర్వే జరిపారు.

English summary
The festive revelry marking the farewell of the elephant god was evident in every lane and junction of the city of pearls. From auctioning of laddoos to breaking in to dance for devotional songs, the streets reverberated with “Ganpati Bappa Morya” as thousands of Ganesh idols made their way to various designated ponds and lakes of Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X