వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రూట్ మారిన రుణం, వెయ్యి లైక్స్‌తో రూ.1లక్ష: టాటా సరికొత్త ప్రోగ్రామ్..

కష్టాల్లో ఉన్న ఎవరైనా సరే.. తమ యథార్థ గాథను టాటా క్యాపిటల్ పేజీలో పోస్టు చేస్తే.. నిర్వాహకులు దాన్ని పరిశీలిస్తారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఇప్పుడంతా సోషల్ మీడియా మేనియా. స్నేహాలు.. కొత్త పరిచయాలకే కాదు.. ఆర్థిక వ్యవహారాలకు కూడా సోషల్ మీడియా ఇప్పుడో వేదిక. మీరెప్పుడైనా గమనించారా?.. చాలాసార్లు సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు చక్కర్లు కొడుతుంటాయి.

'పలానా వ్యాధితో బాధపడుతున్న అబ్బాయి/అమ్మాయికి ఫేస్ బుక్ వాళ్లు ఇంత డబ్బులివ్వడానికి ఒప్పుకున్నారు.. దయచేసి దీన్ని షేర్ చేయండి' అంటూ ఫేస్‌బుక్ లో పోస్టులు కనిపిస్తుంటాయి. ఇందులో నిజమెంతంటే? కచ్చితంగా చెప్పలేని పరిస్థితి.

కానీ అధికారికంగా ఇలాంటి తరహా కార్యక్రమానికి టాటా క్యాపిటల్ సంస్థ ఇప్పుడు శ్రీకారం చుట్టింది. మీరు చేయవల్సిందల్లా.. మీ యదార్థ గాథను www.doright.in లో పోస్టు చేయడమే. కుటుంబ నేపథ్యం, ఎదుర్కొంటున్న సమస్యల గురించి వివరంగా పోస్టులో పేర్కొనాలి. ఇలాంటి పోస్టులకు వెయ్యికి పైచిలుకు లైక్స్ వస్తే గనుక.. రూ.1లక్ష రుణం ఇవ్వడానికి టాటా క్యాపిటల్ ముందుకు వస్తుంది.

ధనలక్ష్మి భాయ్‌.. :

ధనలక్ష్మి భాయ్‌.. :

హైదరాబాద్‌కు చెందిన ధనలక్ష్మీ భాయ్ అనే మహిళ వృత్తిరీత్యా టైలర్. భర్త చనిపోవడంతో కుటుంబ పోషణ మొత్తం ఆమె పైనే పడింది. ఉన్న ఒక్క కుమారుడికి ఎలాంటి ఉద్యోగం లేదు. దీంతో తన ఆర్థికావసరాలు మరింత భారంగా మారాయి. ఇలాంటి తరుణంలో తెలిసినవాళ్లు టాటా క్యాపిటల్ సంస్థ గురించి తెలిపారు.

అలా.. తన తన కష్టాలకు అక్షర రూపమిస్తూ నేపథ్యంతో సహా ధనలక్ష్మీ భాయ్ అందులో పేర్కొన్నారు. టాటా క్యాపిటల్ వెబ్ సైట్ లో దాన్నిపోస్టు చేయడంతో.. నిర్వాహకులు పోస్టును పరిశీలించారు. ఆపై సలామ్ స్టోరీస్ పేజీలో దాన్ని ప్రచురించారు.

Recommended Video

Tax Benefit on Housing Loans: Union Budget 2017 - Oneindia Telugu
1000లైక్స్‌తో.. రుణం మంజూరు:

1000లైక్స్‌తో.. రుణం మంజూరు:

సలామ్ స్టోరీస్ పేజీలో ధనలక్ష్మి భాయ్‌ యదార్థ గాథకు నెటిజెన్స్ పెద్ద ఎత్తున స్పందించారు. వెయ్యి మందికి పైగా ఆ పోస్టును లైక్ చేశారు. ఇక్కడ లైక్ చేయడమంటే సలాం కొట్టడం కిందే లెక్క. అలా ధనలక్ష్మీ భాయ్ పోస్టుకు వచ్చిన స్పందన చూశాక.. టాటా క్యాపిటల్ నిర్వాహకులు ఆమెకు రూ.1లక్ష రుణం ఇవ్వడం విశేషం.

'సలామ్ లోన్స్'గా టాటా క్యాపిటల్ ఈ రుణాలకు నామకరణం చేసింది. ఈ ఏడాది అగస్టులోనే ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపింది. నిరుపేదలు, ఆర్థిక స్వావలంబన కోసం ఎదురుచూస్తున్న మహిళలు, ఫైనాన్స్ వ్యాపారుల చేతిల్లో బాధితులుగా మిగిలిపోతున్న వారికోసం ఇలాంటి కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు టాటా క్యాపిటల్ వెల్లడించింది.

స్వయం ఉపాధి మార్గం:

స్వయం ఉపాధి మార్గం:

స్వయం ఉపాధి మార్గానికి టాటా క్యాపిటల్ లాంటి సంస్థలు ఇస్తున్న ప్రోత్సాహం చాలామందిని తమ కాళ్ల మీద నిలబడగలిగేలా చేయగలదు. నిజానికి బ్యాంకింగ్, బ్యాంకింగేతర సంస్థల మధ్య నెలకొన్న పోటీ కూడా ఈ తరహా రుణాల మంజూరుకు కారణమని కొంతమంది నిపుణులు చెబుతున్నారు. వ్యక్తిగత, వాహన, గృహ రుణాల జారీలో ప్రైవేటు ఆర్థిక సంస్థలు, ప్రైవేటు బ్యాంకులు, బ్యాంకింగేతర సంస్థల మధ్య తీవ్ర పోటీ నెలకొనడంతో ఇలాంటి వినూత్న కార్యక్రమాలు వస్తున్నాయన్నారు.

పారదర్శకతకు ప్రాధాన్యం:

పారదర్శకతకు ప్రాధాన్యం:

ఇలాంటి రుణాలను పూర్తి పారదర్శకంగా మంజూరు చేసేందుకు తాము ప్రయత్నిస్తున్నామని కంపెనీ టాటా క్యాపిటల్ వర్గాలు చెబుతున్నాయి. రుణ జారీకి సంబంధించిన దరఖాస్తులు పూర్తి చేయడం, షూరిటీ పత్రాల వంటి అంశాల్లో రుణగ్రహీతలకు సహాయపడుతామని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. ఇప్పటివరకు సుమారు 700-800మంది నిరుపేదలు రుణాల కోసం తమ వ్యథాభరిత గాథలను వెబ్ సైట్ లో పోస్టు చేసినట్లు తెలిపారు. మరో ఏడాదిలోనే ఈ సంఖ్య రెట్టింపు అవుతుందని అంచనా వేస్తున్నారు.

English summary
Access to credit is a critical ingredient to fulfill one's dreams and unfortunately the same is often denied to certain sections of the society who need it the most.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X