వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శ్రీకారం: గొల్కోండ అమ్మవారికి తొలిబోనం(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

గోల్కొండ: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఊరూరా జరుపుకునే ఆషాఢం జాతర అంగరంగవైభవంగా ఆరంభమైంది. సంప్రదాయ పద్ధతులతో గోల్కొండ జగదాంబిక మహంకాళికి గురువారం తొలిబోనం సమర్పించి బోనాల ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు.

మధ్యాహ్నం వరకు ఛోటా బజార్‌లోని పూజారి అనంతాచారి నివాసంలో ప్రత్యేక పూజలందుకున్న జగదాంబిక అమ్మవారిని లంగర్‌హౌస్‌ నుంచి వచ్చిన తొట్టెల వూరేగింపుతో కోట పైకి తీసుకెళ్లారు.

అమ్మవారి వెనుక ఎత్తైన ఉగ్రనరసింహుడు ఆకట్టుకున్నాడు. పోతరాజులు, శివసత్తులు, యువకులు నృత్యాలతో సందడిచేశారు. కోటపై ఆలయంలో ఒడి బియ్యం నింపి హోమం నిర్వహించారు. కరీంనగర్‌కు చెందిన జిమిడికా వాయిద్య కళాకారులు ఆకర్షణగా నిలిచారు.

అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రులు

బోనాల ఉత్సవాల సందర్భంగా లంగర్‌హౌస్‌ నుంచి చేపట్టిన అమ్మవారి తొట్టెల ఊరేగింపు కార్యక్రమంలో మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, శ్రీనివాస్‌యాదవ్‌, పద్మారావు, మేయర్‌ రామ్మోహన్‌, పోలీస్‌ కమిషనర్‌ మహేందర్‌ పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు.

పశ్చిమమండలం డీసీపీ వెంకటేశ్వరరావు, టాస్క్‌ఫోర్సు డీసీపీ లింబారెడ్డి, ఆసిఫ్‌నగర్‌ ఏసీపీ గౌస్‌మొయినుద్ధీన్‌, గోల్కొండ ఇన్‌స్పెక్టర్‌ సయ్యద్‌ ఫయాజ్‌ బందోబస్తు నిర్వహించారు. ఉత్సవ కమిటీ సభ్యులు గోవింద్‌రాజు, గుడిమల్కాపూర్‌ కార్పొరేటర్‌ బంగారి ప్రకాశ్‌, శివశంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

గొల్కోండ బోనాలు

గొల్కోండ బోనాలు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఊరూరా జరుపుకునే ఆషాఢం జాతర అంగరంగవైభవంగా ఆరంభమైంది.

పట్టువస్త్రాలతో మంత్రులు, మేయర్

పట్టువస్త్రాలతో మంత్రులు, మేయర్

సంప్రదాయ పద్ధతులతో గోల్కొండ జగదాంబిక మహంకాళికి గురువారం తొలిబోనం సమర్పించి బోనాల ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు.

అమ్మవారు

అమ్మవారు

మధ్యాహ్నం వరకు ఛోటా బజార్‌లోని పూజారి అనంతాచారి నివాసంలో ప్రత్యేక పూజలందుకున్న జగదాంబిక అమ్మవారిని లంగర్‌హౌస్‌ నుంచి వచ్చిన తొట్టెల ఊరేగింపుతో కోట పైకి తీసుకెళ్లారు.

ఊరేగింపు

ఊరేగింపు

అమ్మవారి వెనుక ఎత్తైన ఉగ్రనరసింహుడు ఆకట్టుకున్నాడు.

పట్టువస్త్రాలతో మంత్రులు, మేయర్

పట్టువస్త్రాలతో మంత్రులు, మేయర్

బోనాల ఉత్సవాల సందర్భంగా లంగర్‌హౌస్‌ నుంచి చేపట్టిన అమ్మవారి తొట్టెల ఊరేగింపు కార్యక్రమంలో మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, శ్రీనివాస్‌యాదవ్‌, పద్మారావు, మేయర్‌ రామ్మోహన్‌, పోలీస్‌ కమిషనర్‌ మహేందర్‌ పాల్గొన్నారు.

బోనాల సందడి

బోనాల సందడి

పోతరాజులు, శివసత్తులు, యువకులు నృత్యాలతో సందడిచేశారు.

బోనాల సందడి

బోనాల సందడి

కోటపై ఆలయంలో ఒడి బియ్యం నింపి హోమం నిర్వహించారు.

బోనాల సందడి

బోనాల సందడి

కరీంనగర్‌కు చెందిన జిమిడికా వాయిద్య కళాకారులు ఆకర్షణగా నిలిచారు.

పోతరాజుల నృత్యం

పోతరాజుల నృత్యం

బోనాల సందర్భంగా పోతురాజుల నృత్యాలు.

బందోబస్తు

బందోబస్తు

పశ్చిమమండలం డీసీపీ వెంకటేశ్వరరావు, టాస్క్‌ఫోర్సు డీసీపీ లింబారెడ్డి, ఆసిఫ్‌నగర్‌ ఏసీపీ గౌస్‌మొయినుద్ధీన్‌, గోల్కొండ ఇన్‌స్పెక్టర్‌ సయ్యద్‌ ఫయాజ్‌ బందోబస్తు నిర్వహించారు.

భక్తజనం

భక్తజనం

అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు భారీగా తరలిన భక్తులు.

అమ్మవారి ఊరేగింపు

అమ్మవారి ఊరేగింపు

అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రులు ప్రత్యేక పూజలు నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు.

అమ్మవారి ఊరేగింపు

అమ్మవారి ఊరేగింపు

బోనాల ఉత్సవాల సందర్భంగా లంగర్‌హౌస్‌ నుంచి చేపట్టిన అమ్మవారి తొట్టెల ఊరేగింపు కార్యక్రమంలో మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, శ్రీనివాస్‌యాదవ్‌, పద్మారావు, మేయర్‌ రామ్మోహన్‌, పోలీస్‌ కమిషనర్‌ మహేందర్‌ పాల్గొన్నారు.

బోనమెత్తిన మహిళలు

బోనమెత్తిన మహిళలు

సంప్రదాయ పద్ధతులతో గోల్కొండ జగదాంబిక మహంకాళికి గురువారం తొలిబోనం సమర్పించి బోనాల ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు.

చిందేసిన భక్తురాలు

చిందేసిన భక్తురాలు

బోనాల సందర్భంగా పోతురాజులతోపాటు నృత్యం చేస్తున్న మహిళా భక్తురాలు

English summary
The State government has made elaborate arrangements for the traditional Bonalu festival in the twin cities of Hyderabad and Secunderabad. Bonalu started from Golconda goddess Jagadambika.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X