• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

గ్రీస్ సంక్షోభం: అసలేం జరిగింది? బయటపడుతుందా?

By Nageswara Rao
|

ఆర్ధిక సంక్షోభంలో ఉన్న గ్రీస్‌కు రుణ చెల్లింపులు ఇప్పట్లో ఒక కొలిక్కి వచ్చే సూచనలు కనిపించడం లేదు. గ్రీస్ ప్రధాని అలెక్సిస్ సిప్రాస్‌ ఆదివారంలోగా స్పష్టమైన ప్రతిపాదనలతో ముందుకు రావాలని యూరోపియన్ దేశాలు ఆల్టిమేటం జారీ చేశాయి.

అసలేం జరిగింది?

యూరప్ ఖండంలోని కొన్ని 28 దేశాలు కలిసి యూరో జోన్‌గా ఏర్పడ్డాయి. వాటిల్లో గ్రీస్ ఒకటి. యూరో జోన్‌లోని దేశాలన్నింటిలో కెరన్సీ ఒకటే. యూరో జోన్‌లో ఉన్న దేశాలన్నీ కలిపి ఒక బ్యాంకును ఏర్పాటు చేసుకున్నాయి. దాని పేరు యూరోపియన్ బ్యాంక్. యూరో జోన్‌లో ఉన్న దేశాలన్నింటికీ ఇదే రుణాలను మంజూరు చేస్తుంది.

ఇందులో భాగంగా గ్రీస్ యూరో జోన్‌లోని దేశాల నుంచి పెద్ద మొత్తంలో రుణాన్ని పొంది, తిరిగి చెల్లించడంలో విఫలమైంది. దీంతో గ్రీస్‌లో ఆర్ధిక సంక్షోభం ఏర్పడింది. దీంతో గ్రీస్‌లోని బ్యాంకులకు రుణాన్ని మంజూరు చేయాల్సిందిగా కోరింది. దీంతో గ్రీస్‌కు అప్పులిచ్చి బయటకు తెచ్చేందుకు ఐఎంఎఫ్‌, ఇయు, యుసిబి (ఆర్ధిక త్రయం) బెయిల్‌ ఔట్‌ ప్యాకేజీతో ముందుకు వచ్చాయి.

ఇందులో భాగంగా పలు కఠినమైన షరతులను పెట్టాయి. అందులో వృద్ధాప్యపు పెన్షన్లు, నిరుద్యోగ పెన్షన్లు, ప్రజారోగ్యం, విద్య. వగైరాలపై ఖర్చులను తగ్గించడంతో సహా అనేక పొదుపు చర్యలున్నాయి. ఈ షరతులను అంగీకరించాలా వద్దా అని తెలుకునేందుకు గత ఆదివారం గ్రీస్ ప్రధాని ప్రజలకు రిఫరెండం నిర్వహించారు.

ఆదివారం నాడు జరిగిన ఓటింగ్‌లో 61.31 శాతం మంది ప్రజలు 'నో' కే ఓటు వేశారు. ఈ షరతులు తమ పాలనా విధానాల్లో జోక్యంగా, తమ ఆత్మగౌరవానికి భంగంగా పేర్కొన్న గ్రీస్‌ ప్రభుత్వం వీటిని తిరస్కరించింది. పైగా వీటిని అమలు చేస్తే ఇప్పటికే తీవ్రమైన మాంద్యంలో ఉన్న గీస్‌ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉంది. నిరుద్యోగం పతాకస్థాయికి చేరే అవకాశం ఉంది.

గ్రీస్ రెఫరెండం ప్రక్రియలో 'నో' అంటే:
* గ్రీస్‌లో ఆర్ధిక సంక్షోభం పెరుగుతుంది.
* యూరోజోన్ నుంచి గ్రీస్ బయటకు వస్తుంది.
* యూరోజోన్ దేశాలన్నీ వినియోగిస్తున్న యూరో స్ధానంలో, గతంలో వాడిన 'డ్రక్మా' కరెన్సీ మళ్లీ అమల్లోకి వస్తుంది.
* గ్రీసుకు అప్పులిచ్చిన అంతర్జాతీయ ఆర్ధిక సంస్ధలు, దేశాలన్నింటికీ 'ఎగవేతదారు'గా మారుతుంది.
* గ్రీసుకు అత్యధిక మొత్తంలో అప్పు ఇచ్చిన జర్మనీకి ఇది పెద్ద దెబ్బ.
* గ్రీస్‌లోని బ్యాంకులన్నీ దివాలా తీస్తాయి. ఇప్పటికే గ్రీస్‌లోని మూడు పెద్ద బ్యాంకులు మూతపడ్డాయి.
* ఉద్యోగులకు వేతనాలు, ఫించన్ల చెల్లింపు ప్రశ్నార్ధకం. ప్రజలు చాలా ఇబ్బందులు పడతారు.

గ్రీస్ రెఫరెండం ప్రక్రియలో 'యస్' అంటే:
* యూరోజోన్‌లోనే కొనసాగుతుంది.
* యూరోజోన్‌లోని కరెన్సీనే వర్తిస్తుంది.
* అంతర్జాతీయ ఆర్ధిక సంస్ధలకు రుణం చెల్లించాల్సి వస్తుంది.
* ప్రజలపై పన్ను భారం పడుతుంది.
* సిప్రాస్ ప్రభుత్వం రాజీనామా చేయాల్సి వస్తుంది. దీంతో దేశంలో రాజకీయ అనిశ్చితి ఏర్పడుతుంది.

భారత్‌పై గ్రీస్ ప్రభావం?

భారత్‌పై గ్రీస్ ప్రభావం?

గ్రీసు ఆర్ధిక సంక్షోభ ప్రభావం భారత్‌పై తక్కువగా ఉటుందని, అందుకు కారణం మన ఆర్థిక వ్యవస్థ మూలాలు పటిష్టంగా ఉండటమేనని కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్ధిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ పేర్కొన్నారు. బెయిలవుట్ ప్యాకేజీ షరతులను గ్రీస్ ప్రజలు రిఫరెండంలో 'నో' చెప్పిన నేపథ్యంలో అక్కడ సంక్షోభం మరింత తీవ్రతరం అవడం, యూరోజోన్‌ నుంచి గ్రీస్ బయటకు రానున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంతో అరవింద్ సుబ్రమణియన్ మాట్లాడుతూ గ్రీస్ సంక్షోభం నుంచి మనకు మూడు విధాలుగా రక్షణ ఉంటుందన్నారు. ఈ ప్రతికూలతలను తట్టుకోగలిగే సామర్థ్యం మన ఆర్థిక వ్యవస్థకు ఉందన్నారు. ఎందుకంటే దేశంలో స్థూల ఆర్థిక పరిస్థితులు అత్యంత స్థిరంగా ఉన్నాయి. తగినన్ని విదేశీ మారక నిల్వలు కూడా ఉండటంతోపాటు పెట్టుబడులకు అత్యంత ఆకర్షణీయమైన దేశాల్లో ఒకటిగా భారత్ నిలుస్తోందని తెలిపారు.

అయితే రూపాయి మారకపు విలువపై మాత్రం ఆ ప్రభావం పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇప్పటి వరకూ ఎలాంటి అసాధారణ పరిస్ధితులు తలెత్తలేదని స్పష్టం చేశారు.

మూతపడ్డ బ్యాంకులు, ఏటీఎం‌‌లలో నగదు ఖాళీ?

మూతపడ్డ బ్యాంకులు, ఏటీఎం‌‌లలో నగదు ఖాళీ?

గ్రీసులో బ్యాంకులన్నీ మూసివేస్తున్నట్లు గ్రీక్ బ్యాంక్ అసోసియేషన్ తెలిపింది. ఏటీఎంలలో 60 యూరోలను తీసుకునే అనుమతి కొనసాగుతూనే ఉంది. తమ చెల్లింపులకు సరైన హామీ లభిస్తే తప్ప, కొత్తగా గ్రీస్‌ బ్యాంకులకు నగదు సమకూర్చే ప్రసక్తే లేదని యూరోపియన్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ (ఇసిబి) స్పష్టం చేసింది.

ఎటిఎంల్లో కూడా నగదు నిల్వలు ఖాళీ అవడంతో ఏం చేయాలని గ్రీస్‌ ప్రజలకు అర్ధం కావడం లేదు. ఆదివారంలోగా ఏదో ఒక ఒప్పందం కుదరక పోతే గ్రీస్‌ యూరో నుంచి బయటికి రాక తప్పదు. అదే జరిగితే గ్రీస్‌ ఆర్థిక సంక్షోభం మరింత తీవ్రమవుతుందని భావిస్తున్నారు.

రంగంలోకి దిగిన అమెరికా అధ్యక్షుడు ఒబామా?

రంగంలోకి దిగిన అమెరికా అధ్యక్షుడు ఒబామా?

యూరోజోన్ నుంచి గ్రీస్ వైదొలగనుందన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో పెద్దన్న రంగంలోకి దిగాడు. గ్రీస్ ఆర్ధిక సంక్షోభం, ఇకపై తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించడానికి గ్రీస్ ప్రధాని అలెక్సిస్‌ సిప్రాస్‌‌తో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఫోన్‌లో మాట్లాడినట్లు వైట్ హౌస్ వర్గాలు పేర్కొన్నాయి. గ్రీస్, యూరోపియన్ దేశాల నేతలు సర్దుకుపోవాలని ఒక ఒప్పందానికి రావాలని ఒబామా సూచించినట్లు వైట్ హౌస్ ఒక ప్రకటనలో వెల్లడించింది.

గ్రీస్, యూరోజోన్ అంగీకారం కుదుర్చుకోవాలని అందురూ భావిస్తున్నట్లు తెలిసింది. గ్రీసుకు పెద్ద మొత్తంలో జర్మనీ రుణాన్ని ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఒబామా గ్రీస్ ప్రధానితో పాటు జర్మన్‌ ఛాన్సలర్‌ ఏంజెలా మెర్కెల్‌కు కూడా ఫోన్‌ చేశారని, వారు కూడా గ్రీస్‌ సంక్షోభం నుంచి బయటకు రావడానికి ఒక ఒప్పందానికి రావాలని కోరుకుంటున్నట్లు వైట్‌హౌస్‌ తెలిపింది.

మరోవైపు గ్రీసును యూరోజోన్ నుంచి తప్పించి రిస్క్ చేయలేమని, ఈ పరిణామం ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపేడుతుందని ఫ్రాన్స్ ప్రధాని మానుయెల్ వాల్స్ అన్నారు. యూరోపియన్ యూనియన్‌తో గ్రీసు ఒప్పందం కుదిరించుకునేందుకు ఇప్పటికీ అవకాశాలున్నాయన్నారు.

డెడ్‌లైన్ ఆదివారం?

డెడ్‌లైన్ ఆదివారం?

ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకున్న గ్రీసుకు యూరోపియిన్ దేశాలు నేతలు తుది గడువుని విధించాయి. అప్పుల్లో కూరుకుపోయి రుణ ఎగవేతదారుగా మారిన గ్రీసును ఎలా గట్టెక్కించాలనుకుంటున్నారో చెప్పాలని, దీనికి సంబంధించిన ప్రతిపాదనలతో ఆదివారంలోగా ముందుకు రావాలని గ్రీస్ ప్రధాని అలెక్సిస్ సిప్రాస్‌కు యూరో నేతలు స్పష్టం చేశారు.

గ్రీస్‌ ప్రధాని సిప్రాస్‌ మాత్రం ఐఎంఎఫ్‌, ఇయు దేశాల షరతులను అంగీకరించే ప్రసక్తే లేదని మరోసారి పరోక్షంగా తెలియజేశారు. బుధవారం యూరోపియన్‌ పార్లమెంట్‌లో ప్రసంగిస్తూ ఉద్దీపన ప్యాకేజీల పేరుతో గ్రీసును వాడుకుంటున్నారని ప్రధాని అలెక్సిస్ ఆరోపించారు.

యూరోజోన్ సమస్యల సుడిగుండంలో ఉన్నప్పుడు గ్రీసును పట్టించుకోలేదని వాపోయారు. ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంపై సహాయం అందించేందుకు మిగితా దేశాలు వెనుకంజ వేస్తున్నాయని విమర్శించారు. ఈ సంక్షోభం నుంచి గ్రీస్‌ను గట్టేక్కించాలంటే మూడేళ్ల పాటు గ్రీస్‌ రుణాల చెల్లింపునకు ఇయు దేశాలు ముందుకు వస్తే రుణదాతలు కోరుతున్న విధంగా పెన్షన్‌, పన్నుల సంస్కరణల కోసం వచ్చే వారమే చట్టం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు.

ఇది గ్రీసులో నెలకొన్న సమస్య కాదని, భవిష్యత్తులో యూరోపియన్ యూనియన్ దేశాలు ఎదుర్కొనే సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉందని యూరో జోన్ అధ్యక్షుడు డొనాల్డ్ టస్క్ వ్యాఖ్యానించారు. మరోవైపు గ్రీస్ పరిస్థితులు యూరోజోన్‌కే కాకుండా ప్రపంచంలోని అన్ని దేశాలపై ప్రభావం చూపే అవకాశం ఉండటంతో యూరోజోన్‌లోని 19 దేశాలే ఐరోపాలోని మొత్తం 28 దేశాల అధినేతలు సమావేశం కానున్నారు.

ముగింపు:

ముగింపు:

ఆర్థిక సంక్షోభం నుంచి కోలుకోవాలంటే, కఠినమైన ఆంక్షలు, పొదుపు చర్యలను గ్రీస్‌ పాటించకతప్పదు. యూరో జోన్ నుంచి గ్రీస్ బయటకు వెళ్లకుండా వెళ్లేందుకు అమెరికా, ఫ్రాన్స్, బెల్జియం, హాలెండ్‌ వంటి దేశాలు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి.

ఇందు కోసం గ్రీస్ పట్ల కాస్తంత మెతక వైఖరిని కూడా ప్రదర్శిస్తున్నాయి. గ్రీస్ యూరోజోన్ నుంచి వైదొలగితే యూరోజోన్‌కు భవిష్యత్తులో కష్టాలు తప్పవు. అంతేకాదు ఈ ప్రభావం ప్రపంచ దేశాలపై కూడా పడుతుంది. గ్రీస్‌ యూరోజోన్‌ లో కొనసాగాలనదే ఆ దేశాల అభిప్రాయం.

ఆ దేశాలు గట్టిగా నిలబడితే గ్రీస్‌ కోరుకున్న విధంగా బెయిల్‌ ఔట్‌ ప్యాకేజీపై చర్చలు పునరుద్ధరించే అవకాశం ఉంటుందని అంటున్నారు. గ్రీస్‌ కోరితే చర్చలను పునరుద్ధరించేందుకు సిద్ధమంటూ ఐఎంఎఫ్‌ నేత క్రిస్టిన్‌ లగార్డ్‌ కూడా ప్రకటించారు.

English summary
A race to save Greece from bankruptcy and keep it in the euro gathered pace on Wednesday when Athens formally applied for a three-year loan and European authorities launched an accelerated review of the request.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X