హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సందడి: మార్కెట్లకు దీపావళి శోభ (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నగరంలో దీపావళి సందడి మొదలైంది. పండుగ గొనుగోళ్లతో నగర మార్కెట్లు దీపావళి శోభను సంతరించుకున్నాయి. పండుగకు మరి కొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి ఉండటంతో కొనుగోలు దారులతో మార్కెట్లు కిటకిటలాడుతున్నాయి.

వ్యాపారపరంగా ఎంతో పేరున్న సుల్తాన్ బజార్, కోఠి, బడీచౌడీ, అబిడ్స్, కూకట్ పల్లి ప్రాంతాల్లో బట్టలు, ఆభరణాలు, మిఠాయి దుకాణాలు, బాణసంచా, ఎలక్ట్రానిక్, మొబైల్ కొనుగోళ్లు పెరిగాయి. దీంతో ఆయా ప్రాంతాల్లోని దుకాణాలలో రద్దీ పెరిగిపోయింది.

 సందడి: మార్కెట్లకు దీపావళి శోభ

సందడి: మార్కెట్లకు దీపావళి శోభ


బాణాసంచా విక్రయాల కోసం వ్యాపారాలు రోడ్డు పక్కన చిన్న చిన్న దుకాణాలు ఏర్పాటు చేశారు. పండుగ కోసం మిఠాయి దుకాణాల నిర్వాహకులు పెద్ద ఎత్తున మిఠాయిలు తయారు చేయించే పనిలో నిమిగ్నమయ్యారు.

సందడి: మార్కెట్లకు దీపావళి శోభ

సందడి: మార్కెట్లకు దీపావళి శోభ

అంతేకాకుండా పండుగ కోసం పేనీల విక్రయాలు కూడా ఊపందుకున్నాయి. పండుగ పురస్కరించుకుని కొనుగోలుదారులను ఆకర్షించేందుకు దుకాణాదారులు తమ దుకాణాలను విద్యుద్దీపాలతో ఆలంకరిస్తున్నారు.

సందడి: మార్కెట్లకు దీపావళి శోభ

సందడి: మార్కెట్లకు దీపావళి శోభ


ముఖ్యంగా బట్టల దుకాణాల నిర్వాహకులు రకరకాల స్కీంలు ఏర్పాటు చేసి కొనుగోలుదారులను తమవైపు తిప్పుకునేందుకు యత్నిస్తున్నారు. ఒకటి కొంటే మరొకటి ప్రీ అని, పెద్ద ఎత్తున డిస్కౌంట్ సేల్ అని ఇలా రక రకాలుగా స్కీంలు పెట్టి అమ్మకాలు పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

సందడి: మార్కెట్లకు దీపావళి శోభ

సందడి: మార్కెట్లకు దీపావళి శోభ


పండుగ రోజున స్వీట్లు తినేందుకు ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. కొన్ని వ్యాపార సంస్ధలు, పాఠశాలలు, కళాశాలలు, కార్యలయాలు ప్రత్యేక
ఆర్డర్ల ద్వారా మిఠాయిలు తయారు చేయించి తమ ఉద్యోగులకు పంచుతుంటారు.

 సందడి: మార్కెట్లకు దీపావళి శోభ

సందడి: మార్కెట్లకు దీపావళి శోభ


ఇల్లంతా బంతిపూలతో అలంకరించి, లక్ష్మీపూజ చేయడం దీపావళి ప్రత్యేకం. మరి కొంతమంది బొమ్మల కొలువ చేస్తారు. అందుకు మూడు రోజుల ముందు నుంచే నగరవాసులు లక్ష్మీపూజ కోసం రకరకాల ప్రమిదలు, దొంతులు, సీతరామ లక్ష్మణ బొమ్మలు కొనడంలో నిమగ్నమయ్యారు.

 సందడి: మార్కెట్లకు దీపావళి శోభ

సందడి: మార్కెట్లకు దీపావళి శోభ


పండుగ సందర్భంగా నగరంలో పలు చోట్ల రోడ్లపైనే బంతిపూలు అమ్మకాలు కోలాహాలంగా ఉన్నాయి. పెద్ద సంఖ్యలో భక్తులు బంతిపూలు కొనేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.

 సందడి: మార్కెట్లకు దీపావళి శోభ

సందడి: మార్కెట్లకు దీపావళి శోభ


నగరంలో దీపావళి సందడి మొదలైంది. పండుగ గొనుగోళ్లతో నగర మార్కెట్లు దీపావళి శోభను సంతరించుకున్నాయి. పండుగకు మరి కొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి ఉండటంతో కొనుగోలు దారులతో మార్కెట్లు కిటకిటలాడుతున్నాయి.

English summary
Heavy Crowd at Crackers shop at Begum Bazar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X