హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దసరా ముగింపు: కిలోమీటర్ల మేర నిలిచిన ట్రాఫిక్

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: దసరా పండుగ, నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి వెళ్లిన ప్రజలు తిరుగు ముఖం పట్టడంతో హైదరాబాద్ నగరానికి వచ్చే దారులన్నీ వాహనాలతో నిండిపోయాయి. దీంతో భారీగా ట్రాపిక్ జామ్ అయింది.

పండుగలకు ఊర్లకు వెళ్లిన వారంతా ఒక్కసారిగా తిరిగి నగరానికి చేరుకుంటున్నారు. కర్నూలు-మహబూబ్ నగర్ హైవేపై టోల్ గేట్ వద్ద వాహనాలు భారీగా నిలిచిపోయాయి. విజయవాడ-హైదరాబాద్, సిద్ధిపేట-హైదరాబాద్, గుంటూరు-హైదరాబాద్ రహదారుల్లో ఉన్న టోల్ గేట్లు వద్ద ట్రాఫిక్ కిలోమీటర్ల కొద్దీ నిలిచిపోయింది.

మరీ ముఖ్యంగా నార్కెట్‌పల్లి, చౌటుప్పల్ టోల్‌గేట్ల వద్ద గంటల తరబడి నిలచిపోయిన వాహనాలను క్లియర్ చేయడం పోలీసులకు తలకు మించిన భారంగా పరిణమించింది. దసరా పండుగకు సెలవులు కలసి రావడంతో భార్యాబిడ్డలతో స్వస్థలాలకు వెళ్లిన జనం ఆదివారం తిరుగు ప్రయాణమయ్యారు.

భారీగా ట్రాఫిక్ జామ్

భారీగా ట్రాఫిక్ జామ్

సోమవారం నుంచి ఆఫీసులకు వెళ్లాల్సిన వారంతా ఆదివారం సాయంత్రం నుంచి బస్టాండ్‌కు చేరుకోవడంతో విజయవాడ బస్టాండ్ జనసంద్రాన్ని తలపించింది. సాధారణంగా రోజుకు విజయవాడనుంచి 12వేల మంది హైదరాబాద్‌కు రాకపోకలు సాగిస్తూ ఉంటారు.

భారీగా ట్రాఫిక్ జామ్

భారీగా ట్రాఫిక్ జామ్

రోజుకూ 220 బస్సులు విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వస్తుంటాయి. అయితే ఆదివారం రద్దీని తట్టుకునేందుకు ఆర్టీసీ అదనంగా 130 బస్సులు వేసింది. అంతేకాదు హైదరాబాద్‌లో తిరిగే సిటీ బస్సులను సైతం రంగంలోకి దించారు. ఒక్క ఆదివారమే విజయవాడ నుంచి 21వేల మంది హైదరాబాద్‌కు బయల్దేరినట్టు ఆర్టీసి అధికారులు చెప్పారు.

భారీగా ట్రాఫిక్ జామ్

భారీగా ట్రాఫిక్ జామ్

విజయవాడ, హైదరాబాద్‌లో తిరిగే సిటీ బస్సుల్ని కూడా స్పెషల్ బస్సుల పేరిట రంగంలోకి దించినా రద్దీని తట్టుకోవడం ఆర్టీసికి కష్టమైంది. బస్సులు దొరక్కపోవడంతో టాక్సీలు, వ్యాన్‌లు, లారీలను సైతం జనం ఆశ్రయించారు. కాగా చాలా మంది తమ తమ సొంత కార్లలో హైదరాబాద్‌కు బయల్దేరారు.

భారీగా ట్రాఫిక్ జామ్

భారీగా ట్రాఫిక్ జామ్

వాహనాల రద్దీ పెరిగిపోవడంతో టోల్‌గేట్ల వద్ద ట్రాఫిక్ నిలచిపోయింది. చౌటుప్పల్ సమీపాన పంతంగి టోల్‌ప్లాజా వద్ద ట్రాఫిక్ గంటల తరబడి నిలచిపోయింది. పోలీసులు రంగంలోకి దిగి, హైదరాబాద్ వైపుకు వెళ్లే అన్ని టోల్‌గేట్లను తెరిచి పంపిస్తున్నారు.

భారీగా ట్రాఫిక్ జామ్

భారీగా ట్రాఫిక్ జామ్

విజయవాడనుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే రహదారులన్నీ క్లియర్‌గా ఉండగా ఒక్క హైదరాబాద్ జాతీయ రహదారిలోనే ట్రాఫిక్ రద్దీ పెరిగినట్టు ఆర్టీసి అధికారులు చెప్పారు. ఈసారి దసరాకు తోడు అమరావతి శంకుస్థాపన కూడా కలసి రావడంతో రద్దీ మరింత ఎక్కువైందని ఓ అధికారి వ్యాఖ్యానించారు.

భారీగా ట్రాఫిక్ జామ్

భారీగా ట్రాఫిక్ జామ్

కాగా పండగ సీజన్‌తో ప్రైవేట్ ట్రావెల్స్‌తో పోటీపడి చార్జీలు పెంచుతున్న ఆర్టీసీ, ఆదివారం మాత్రం సాధారణ చార్జీలనే వసూలు చేసింది.

భారీగా ట్రాఫిక్ జామ్

భారీగా ట్రాఫిక్ జామ్

పండుగలకు ఊర్లకు వెళ్లిన వారంతా ఒక్కసారిగా తిరిగి నగరానికి చేరుకుంటున్నారు. ప్రయాణికులతో కిటకిటలాడుతున్న సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌.

భారీగా ట్రాఫిక్ జామ్

భారీగా ట్రాఫిక్ జామ్

పండుగలకు ఊర్లకు వెళ్లిన వారంతా ఒక్కసారిగా తిరిగి నగరానికి చేరుకుంటున్నారు. ప్రయాణికులతో కిటకిటలాడుతున్న సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌.

English summary
Heavy Traffic at Toll Gate Near Siddipet after Dussehra Festival.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X