• search
 • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

మ్యారేజీ సర్టిఫికెట్ పొందడం ఎలా: ఇలా దరఖాస్తు చేసుకోవచ్చు

By Pratap
|

హైదరాబాద్: మ్యారేజీ సర్టిఫికెట్ తీసుకోవడం ఆ కాలంలో అనివార్యంగా మారింది. గతంలో ఆ అవసరం ఉండేది కాదు. 30, 40 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్న జంటలు ఇప్పుడు పెళ్లికి సంబంధించిన సర్టిఫికెట్ తీసుకోవాల్సిన అవసరం ఏర్పడితే ఎలా దరఖాస్తు చేసుకోవాలనే విషయం తెలియక ఇబ్బందులు పడుతున్నారు.

భారతదేశంలో 1955 హిందూ వివాహ చట్టం కింద లేదా 1954 వివాహ ప్రత్యేక చట్టం కింద మ్యారేజీ సర్టిఫికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. మీరు వివాహం చేసుకున్నారని ధ్రువీకరించే అధికారికమైన సర్టిఫికెట్ అది. మహిళల రక్షణ కోసం వివాహాన్ని నమోదు చేసుకోవడాన్ని సుప్రీంకోర్టు 2006లో తప్పనిసరి చేసింది.

How to apply for Marriage Certificate in AP and ealangana: Your complete guide

హిందూ చట్టం కింద వివాహం నమోదు: భార్య లేదా భర్త నివాస స్థలం ఏ సబ్ డివిజననల్ మెజిస్ట్రేట్ ప్రాంత పరిధిలోకి వస్తుందనే విషయాన్ని తెలుసుకుని పనిదినాల్లో ఆ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్టుపై భర్త, భార్య ఇద్దరు కూడా సంతకం చేయాలి.

దరఖాస్తు చేసుకున్న రోజున వెరిపికేషన్ కోసం సంబంధిత పత్రాలను అన్నింటినీ తీసుకుని వెళ్లాలి. అపాయింట్‌మెంట్ కోసం ఓ తేదీని ఖరారు చేస్తారు. రిజిస్ట్రేషన్ కోసం సమాచారాన్ని సంబంధిత పార్టీలకు అందిస్తారు.

అపాయింట్‌మెంట్ రోజున ఇరు పార్టీలు కూడా తమ వివాహానికి హాజరైన గజిటెడ్ ఆఫీసరుతో పాటు అడిఎం ముందు హాజరు కావాల్సి ఉంటుంది. అదే రోజు సర్టిఫికెట్ జారీ చేస్తారు.

అవసరమైన పత్రాలు...

 • దరఖాస్తును భర్తీ చేసి భార్యాభర్తలిద్దరు దానిపై సంతకం చేయాలి.
 • అడ్రస్ ప్రూఫ్: ఓటరు ఐడి/ రేషన్ కార్డు/ పాస్‌పోర్టు/ డ్రైవింగ్ లైసెన్స్
 • భార్యాభర్తల పుట్టిన తేదీల ప్రూఫ్
 • 2 పాస్‌పోర్టు సైజు ఫోటోలు, 1 మ్యారేజీ ఫొటో
 • భార్య నుంచి, భర్త నుంచి ప్రిస్క్రైబ్ చేసిన ఫార్మాట్‌లో విడివిడిగా మ్యారేజ్ అఫిడవిట్స్
 • ఆధార్ కార్డు
 • అన్ని పత్రాలను కూడా సెల్ప్ అటెస్ట్ చేయాలి
 • వివాహ ఆహ్వాన పత్రిక

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్

 • జిల్లాను ఎంపిక చేసుకుని ముందుకు సాగాలి.
 • భర్త వివరాల పట్టికను నింపాలి. అపాయింట్‌మెంట్ తేదీని ఎంపిక చేసుకోవాలి.
 • "Submit Application" క్లిక్ చేయాలి
 • తాత్కాలిక నంబర్ కేటాయిస్తారు. acknowledgement slip మీద అది ప్రింటై కనిపిస్తుంది. దరఖాస్తు ఫారం పూర్తయినట్లు లెక్క.
 • acknowledgement slip ప్రింటవుట్ తీసుకోవాలి.

అపాయింట్‌మెంట్

 • హిందూ వివాహం చట్టం కింద అయితే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న తర్వాత 15 రోజుల్లో అపాయింట్‌మెంట్ లభిస్తుంది. వివాహ ప్రత్యేక చట్టం కింద అయితే 60 రోజుల దాకా పట్టవచ్చు.

సాక్షులు

 • వివాహానికి హాజరైన ఎవరైనా సాక్షులుగా ఉండవచ్చు. అయితే, ఆ సాక్షికి పాన్ కార్డు, రెసిడెన్స్ ప్రూఫ్ ఉండాలి.

తత్కాల్ మ్యారేజీ సర్టిఫికెట్

 • ఢిల్లీ ప్రభుత్వ రెవెన్యూ శాఖ 2014 ఏప్రిల్‌లో తత్కాల్ సర్వీసును ప్రవేశపెట్టింది. ఈ పద్ధతిలో ఒకే రోజు అయిపోతుంది. ప్రాధాన్యతాక్రమం కింద దీన్ని పరిగణనలోకి తీసుకుంటారు.
 • ఈ సర్వీసు 2014 ఏప్రిల్ 22వ తేదీన అమలులోకి వచ్చింది. 24 గంటల్లో ప్రక్రియ యావత్తు ముగుస్తుది. రూ. 10 వేలు ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది.

మ్యారేజీ సర్టిఫికెట్ కింద లాభాలు

 • వివాహం చేసుకున్న తర్వాత పాస్‌పోర్టుకు దరఖాస్తు చేసుకోవాలన్నా, బ్యాంక్ ఖాతా తెరవాలన్నా మ్యారేజీ సర్టిఫికెట్ అవసరం.
 • భార్యాభర్తలకు వీసాలు రావడానికి ఎంతో ఉపయోగపడుతుంది.
 • భారతదేశంలో విదేశీ ఎంబసీలతో పాటు విదేశాల్లో సంప్రదాయ వివాహ పద్దతులను అంగీకరించరు. స్పౌజ్ వీసాపై విదేశాలకు వెళ్లడానికి మ్యారేజీ సర్టిఫికెట్ తప్పనిసరి.
 • జీవిత భాగస్వామి జీవిత బీమాను లేదా బ్యాంక్ డిపాజిట్లను ఆ జీవిత భాగస్వామి మరణించిన తర్వాత పొందడానికి వీలవుతుంది. డిపాజిటర్ నామినీ లేదా ఇన్సూరర్ పేరు రాయకున్నా అవి పొందడానికి వీలవుతుంది.

ఫీజు

 • హిందూ వివాహ చట్టం కింద రూ. 100
 • ప్రత్యేక వివాహ చట్టం కింద రూ. 150

జిల్లా క్యాషియర్ పేరు మీద పీజును డిపాజిట్ చేయాలి. దరఖాస్తు ఫారానికి దాన్ని జత చేయాలి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మ్యారేజి సర్టిఫికెట్ పొందడానికి క్లిక్ చేయండి

తెలంగాణలో రాష్ట్రంలో మ్యారేజి సర్టిఫికెట్ పొందడానికి క్లిక్ చేయండి

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A marriage certificate is an official statement that two people are married. In India, Marriages can be registered either under the Hindu Marriage Act, 1955 or under the Special Marriage Act, 1954. It is a legal proof you are married and the most vital document of a marriage.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more