వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒలింపిక్స్‌: భారత్ ఖర్చు పెట్టిన సొమ్మెంత, చిచ్చు రేపిన బింద్రా ట్వీట్?

By Nageshwara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్ ముగిశాయి. ఏయే దేశాలు ఎన్ని పతకాలు సాధించాయి. ఒక్కో మెడల్‌కు ఎంత ఖర్చు అయిందనే చర్చ ఇప్పుడు దేశ వ్యాప్తంగా మొదలైంది. ముఖ్యంగా రియో ఒలింపిక్స్‌లో 67 పతకాలను సాధించి పతకాల పట్టికలో రెండో స్థానంలో నిలిచిన బ్రిటన్ పతకాల సాధన కోసం క్రీడాకారులపై ఖర్చు పెట్టిన సొమ్మెంత?

రెండు పతకాల సాధన కోసం భారత్ ఎంత ఖర్చు పెట్టిందో ఒక్కసారి చూద్దాం. ఒక్కో మెడల్ కోసం సగటున 41 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టామని, అంటే మొత్తం రూ. 2,747 కోట్లను ఖర్చు పెట్టామని బ్రిటన్ స్పోర్ట్ అథారిటీ చెబుతుండగా, సగటున 55 కోట్లు అంటే రూ. 3, 685 కోట్లను బ్రిటన్ ఖర్చు పెట్టిందని భారత్ మాజీ మెడలిస్ట్ అభినవ్ భింద్రా ట్వీట్ చేశారు.

యూకెలో 15 నుంచి 35 ఏళ్ల వయసున్న జనాభా సంఖ్య 18 మిలియన్లు. అదే భారత్‌లో ఈ సంఖ్య 400 మిలియన్లు. కానీ భారత్‌కు వచ్చిన పతకాలు రెండు, అదే యూకెకు వచ్చిన పతకాలు 67. రియో ఒలింపిక్స్‌లో లండన్ గెలిచిన పతకాలతో పాటు దాని అయిన ఖర్చుని యుకె న్యూస్ పేపర్ గార్డియన్ ఓ వ్యాసంలో పేర్కొంది.

అందులో బ్రిటన్ బడ్జెట్ కేటాయింపులను పరిశీలించగాఈ నాలుగేళ్ల (2013-17)లో ఒలింపిక్స్ సన్నాహాల కోసం క్రీడాకారుల శిక్షణ, శిక్షణా వసతుల కోసం మొత్తం 2,380 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టినట్లు పేర్కొంది. అదే క్రీడలు ఇన్ఫ్రాస్ట్రక్చర్, శిక్షణ కోసం స్పోర్ట్స్ వార్షిక బడ్జెట్‌లో రూ. 9,000 కోట్లు కేటాయించిందని పేర్కొంది.

అదే భారత్ విషయానికి వస్తే నాలుగేళ్ల కాలంలో శిక్షణా సెంటర్లు, కోచ్‌లు, ఇతర మౌలిక సౌకర్యాలపై భారత్ 750 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టగా, నేషనల్ స్పోర్ట్ డెవలప్‌మెంట్ ఫండ్ ద్వారా 22.7 కోట్ల రూపాయలు, టార్గెట్ ఒలింపిక్ పోడియం ప్రోగ్రామ్ కార్యక్రమం కింద 38 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది.

అంటే మొత్తంగా రియో ఒలింపిక్స్ సన్నాహాల కోసం భారత్ ఖర్చు చేసింది రూ. 810 కోట్లు. బ్రిటన్ 2,380 కోట్ల రూపాయలను ఖర్చుచేసి 67 మెడళ్లను సాధించగా, అందులో మూడో వంతకుపైగా డబ్బును ఖర్చు పెట్టి భారత్ కేవలం రెండు పతకాలను మాత్రమే సాధించింది.

గతంలో భారత్‌లో 57 జాతీయ స్పోర్ట్స్ ఫెడరేషన్స్ ఉంటే 2016 నాటికి ఆ సంఖ్య 49కు చేరింది. అంతేకాదు గత మూడేళ్ల కాలంలో వాటికిచ్చే నిధులు కూడా భారీగా తగ్గాయి. ప్రభుత్వం కేటాయించే మొత్తం నిధుల్లో కేవలం 8 శాతం మాత్రమే అథ్లెట్లకు శిక్షణ ఇచ్చేందుకు వినియోగించారు.

రియో ఒలింపిక్స్‌లో పాల్గొన్న 109 మంది అథ్లెట్లకు ఎన్ఎస్‌డీఎఫ్ మద్దతుగా నిలిస్తే అందులో కేవలం 30 మంది మాత్రమే అధికారికంగా భారత్ తరుపున రియో డీ జనీరోలో ప్రాతినిథ్యం వహించారు. రియో ఒలింపిక్స్‌లో ఒక రజతం, ఒక కాంస్యం సాధించి భారత్ పతకాల పట్టికలో 67వ స్థానంలో నిలిచింది.

మరోవైపు 67 పతకాలా సాధించి పతకాల పట్టికలో రెండో స్థానంలో నిలిచినప్పటికీ బ్రిటన్ పౌరులు మాత్రం సంతృప్తి చెందడం లేదు. ఒలింపిక్స్ కోసం కేటాయించిన నిధుల భారం పన్ను చెల్లింపుదారులపై ఎంత పడిందో తేల్చాలని వారు ప్రశ్నిస్తున్నారు. ఒక్కో పన్ను చెల్లింపుదారులపై ఏడాదికి 1,090 రూపాయలు పడిందని బ్రిటన్‌కు చెందిన స్పోర్ట్ ఇండస్ట్రీ రిసెర్చ్ సెంటర్ తేల్చింది.

English summary
India’s last Olympic gold-medal winner, Abhinav Bindra, recently pointed to United Kingdom’s spending on athletes at the Rio Olympics, emphasising the money needed to convert performance into medals.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X