హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మండేఎండలు: హైదరాబాద్‌లో 88 ఏళ్ల రికార్డు ఉష్ణోగ్రత

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నగరంలో ఎండలు కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ఈ సీజన్‌లో 37 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడం 88 ఏళ్ల రికార్డు. సాయంత్రం వరకు ఎండల పరిస్థితి ఇలా ఉంటే సాయంత్రం నుంచి నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.

వాతావరణంలో విపరీతమైన మార్పులు ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నాయి. వర్షాకాలంలో ఇంత ఎక్కువగా ఎండలు ఉండటం అరుదు. హైదరాబాద్‌లో 88 ఏళ్ల రికార్డును నమోదు చేసుకున్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది.

 Hyderabad breaks 88 year old record

ఇక మరోవైపు తెలంగాణలోని వివిధ జిల్లాలతోపాటు హైదరాబాద్‌లోనూ శుక్రవారం వర్షం కురిసింది. సాయంత్రం సికిందరాబాద్ ప్రాంతంలో భారీ వర్షం కురిసింది. దిల్‌సుఖ్‌నగర్, నాగోల్, ఎల్‌బి నగర్ ప్రాంతంలోనూ వర్షం కురిసింది. హైదరాబాద్‌లో ఎండలు మరో ఐదు రోజుల పాటు ఇదే విధంగా ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది.

కొన్ని ప్రాంతాల్లో సాధారణంగా వర్షం కురిసింది. హైదరాబాద్, భద్రాచలం, మహబూబ్‌నగర్, హనుమకొండలలో 37 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది.

ఆదిలాబాద్, ఖమ్మం, హకీంపేటలలో 33 డిగ్రీలు, మెదక్ 36 నిజమాబాద్ 34, రామగుండంలో 35 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కాగా, వర్షా కాలంలో సైతం ఇంత భారీ ఎత్తున ఎండలతో ప్రజలు అల్లాడిపోతున్నారు.

English summary
Hyderabad, the state capital of Telangana has broken an 88 year old record on Thursday. The city has registered the highest day time temperature during ongoing monsoon season.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X