వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేను చాలా కొంటెవాడ్ని, అమ్మాయిలు ఫాస్ట్: అజీం ప్రేమ్ జీ

తాను చిన్నప్పుడు స్కూల్లో చదివే సమయంలో కొంటెగా ఉండేవాడిని, తాను బాగా అల్లరి చేసేవాడినని, దీంతో చాలాసార్లు తరగతి బయట మోకాళ్ల ైపన కూర్చున్నానని విప్రో చీఫ్ అజీమ్ ప్రేమ్ జీ చెప్పారు.

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: తాను చిన్నప్పుడు స్కూల్లో చదివే సమయంలో కొంటెగా ఉండేవాడిని, తాను బాగా అల్లరి చేసేవాడినని, దీంతో చాలాసార్లు తరగతి బయట మోకాళ్ల ైపన కూర్చున్నానని విప్రో చీఫ్ అజీమ్ ప్రేమ్ జీ చెప్పారు.

అబ్బాయిలతో పోలీస్తే అమ్మాయిలు తెలివైన వారని చెప్పారు. విప్రో 2016 ఎర్తియాన్‌ పురస్కారాల సందర్భంగా ప్రేమ్ జీ విద్యార్థుల ప్రశ్నలకు సమాధానం చెప్పారు. ఈ సందర్భంగా ఆయన చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు.

అల్లరి చేసేవాడిని

అల్లరి చేసేవాడిని

చిన్నపుడు తాను చాలా అల్లరి చేసేవాడినని, అప్పట్లో అందరి తలలపైనా మొట్టికాయలు వేసేవాడినని, అందుకే చాలా వరకు తనను క్లాస్ బయట మోకాళ్లపై కూర్చుండబెట్టేవారని చెప్పారు.

కళాశాల చదువుపై..

కళాశాల చదువుపై..

కళాశాల చదువును మధ్యలోనే ఎందుకు ఆపడంపై స్పందిస్తూ.. చాలా తక్కువ వయసులోనే తన తండ్రి చనిపోవడంతో ఆయన బాధ్యతలు తీసుకోవాల్సి వచ్చిందని, దీంతో మధ్యలో ఆగిపోవాల్సి వచ్చిందన్నారు. అయితే చాలా ఏళ్ల తర్వాత ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌లో మాస్టర్‌ డిగ్రీ పూర్తి చేశానని అన్నారు.

అమ్మాయిలే టాప్

అమ్మాయిలే టాప్

అబ్బాయిల కన్నా అమ్మాయిలే కెరీర్‌పై ఎక్కువ దృష్టి బాగా సారిస్తున్నారని ప్రేమ్ జీ అన్నారు. తల్లిదండ్రుల నుంచి వారికి తగిన ప్రోత్సాహం లభిస్తోందన్నారు. అయితే దురదృష్టవశాత్తు బాలికలపై తమ తమ్ముడు, చెల్లెళ్ల ఆలనా పాలనా భారం పడుతోందన్నారు. నాన్నతో పాటు అమ్మ సైతం కుటుంబ పోషణ నిమిత్తం ఉద్యోగం చేస్తుండటమే ఇందుకు కారణమన్నారు.

బాలికలు మంచి ప్రశ్నలు వేస్తారు

బాలికలు మంచి ప్రశ్నలు వేస్తారు

అబ్బాయిల కంటే బాలికలే నాణ్యమైన, స్పష్టమైన ప్రశ్నలు సంధిస్తున్నారని ప్రేమ్ జీ చెప్పారు. దేశవ్యాప్తంగా తాను ఎన్నో కళాశాలలు, పాఠశాలలు సందర్శించానని పేర్కొన్నారు. అమ్మాయిలు నిలకడగా తమ తెలివితేటలు పెంచుకొంటున్నారన్నారు. తన దృష్టిలో బాలికలు బాలుర కన్నా తెలివైన ప్రశ్నలు వేస్తున్నారని కితాబిచ్చారు. తరగతి గదిలో 50 శాతం ర్యాంకులు అమ్మాయిలకే వస్తున్నాయన్నారు.

English summary
Reminiscing about his school days, Wipro chief Azim Premji on Saturday said he spent a lot of time outside the classroom kneeling for being naughty.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X