వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆందోళనలో హెచ్-1బీ వీసాదారుల భాగస్వాములు, ట్రంప్ నిర్ణయం వాయిదాతో కాస్తంత ఊరట!

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: హెచ్-1బీ వీసాదారుల భాగస్వాములు.. హెచ్4 వీసాపై అమెరికాలో ఉంటూ ఉద్యోగాలు చేసుకుంటోన్న వారికి తాత్కాలిక ఊరట లభించింది. అమెరికాలో వీరి పని అధికారం తొలగింపుపై ట్రంప్ ప్రభుత్వ నిర్ణయం మరికాస్త ఆలస్యం కానుంది.

హెచ్-1బీ వీసాదారుల భాగస్వాముల ఉద్యోగాల తొలగింపు విషయంలో ట్రంప్ నిర్ణయం వాయిదా పడడంతో ప్రధానంగా భారతీయ కుటుంబాలకు కొంత ఉపశమనం దొరికినైట్లెంది. ఎందుకంటే అమెరికాలో హెచ్-1బీ వీసాదారుల్లో భారతీయులే అధికం.

తీవ్ర ఆందోళనలో హెచ్-4 వీసాదారులు...

తీవ్ర ఆందోళనలో హెచ్-4 వీసాదారులు...

ఇది అమెరికాలో వినోద్ అనే ఓ భారతీయుడి కథ. ప్రస్తుతం అతడి భార్య గుండెపోటుకు గురై పెన్సిల్వేనియలోని ఓ ఆసుపత్రి బెడ్ ‌పై ఉంది. దీనికి కారణం అమెరికాలోని ట్రంప్ ప్రభుత్వం హెచ్-4 వర్క్ పర్మిట్ వీసాదారుల విషయంలో కఠిన నిబంధనలు తీసుకురావడమే. వీరి ఉద్యోగాలు ఫిబ్రవరి 28 తరువాత తొలగింపబడతాయనేది ఆ నిబంధనల సారాంశం. ఈ విషయం తెలియగానే వినోద్ భార్య హతాశురాలైంది. భర్తను, పిల్లలను వదిలి తాను తిరిగి ఇండియాకు వెళ్లాల్సి ఉంటుందని తెలియగానే ఆమెలో తీవ్ర ఆందోళన చోటుచేసుకుంది. ఫలితమే ఈ గుండెపోటు. మరోవైపు వినోద్ కూడా తీవ్రంగా తల్లడిల్లుతున్నాడు. ఆర్థికంగా ఎన్నో అవరోధాలు, లోన్లు, కమిట్‌మెంట్లు. ఇప్పుడు ఉన్నట్లుండి భార్య ఉద్యోగం చేసే హక్కును కోల్పోయి, తిరిగి స్వదేశానికి వెళ్లిపోతే.. తన పరిస్థితి, పిల్లల పరిస్థితి ఏంటి? ఇది కేవలం వినోద్ కుటుంబ సమస్య మాత్రమే కాదు, అమెరికాలో నివసిస్తున్న 1.5 మిలియన్ల మంది భారతీయులు ఎదుర్కొంటున్న సమస్య.

ఇంటిపట్టునే ఉండి డిప్రెషన్‌‌కు లోనై...

ఇంటిపట్టునే ఉండి డిప్రెషన్‌‌కు లోనై...

ప్రస్తుతం వినోద్ వయసు 48, అతడి భార్య వయసు 46. వినోద్ హెచ్1-బీ వీసాపై 2008లో అమెరికా వెళ్లాడు. అక్కడ ఓ కంపెనీలో అతడికి ఉద్యోగం లభించింది. ఏడాది తరువాత 2009లో అతడి భార్య కూడా హెచ్-4 వీసాపై అమెరికా వెళ్లింది. నిజానికి ఆమె ఇండియాలో నర్సుగా పనిచేసేది. కానీ అమెరికా వెళ్లాక ఖాళీగా ఇంట్లోనే కూర్చోవలసి వచ్చింది. ఎందుకంటే హెచ్-4 వీసా అనేది కేవలం అమెరికాలో ఉద్యోగం చేస్తున్న తమ జీవిత భాగస్వాములు (భర్త / భార్య)తో కలిసి జీవించడానికే మాత్రమే. హెచ్-4 వీసాపై అమెరికా వెళ్లిన జీవిత భాగస్వాములకు అక్కడ పని చేసే హక్కు ఉండదు. ఈ నేపథ్యంలో అమెరికా వెళ్లిన వినోద్ భార్య ఒకరకమైన డిప్రెషన్‌కు లోనైంది. పెద్ద పెద్ద చదువులు చదివి, ఉద్యోగాలు చేసే తెలివితేటలున్నా.. అక్కడ వారికి ఆ అవకాశం మాత్రం లేదు.

అసలేమిటీ ఈ హెచ్-4 వీసా?

అసలేమిటీ ఈ హెచ్-4 వీసా?

అమెరికాలో ఉద్యోగం చేయాలంటే అందుకు హెచ్-1బీ వీసా అవసరం. ఈ వీసాపై అమెరికా వెళ్లి అక్కడ ఉద్యోగాలు చేసుకునే వారి జీవిత భాగస్వాములు (భర్త / భార్య) అమెరికా వెళ్లాలంటే వారికి హెచ్-4 వీసా అవసరమవుతుంది. కానీ తీరా ఈ వీసాపై వారు అమెరికా వెళ్లినా అక్కడ వారు ఇంట్లో కూర్చోవాల్సిందే తప్ప ఉద్యోగం చేసే వీలుండదు. అమెరికాలాంటి దేశంలో భార్యభర్తలిరువురూ ఉద్యోగాలు చేస్తే తప్ప కుటుంబ జీవనం సాఫీగా సాగదు. భార్యాభర్తల్లో ఒకరికే ఉద్యోగం ఉండి మరొకరికి లేకుంటే కష్టమే. హెచ్-4 వీసాపై వెళితే, జీవిత భాగస్వాముల్లో ఒకరు ఉద్యోగం చేస్తుంటే మరొకరు ఖాళీగా కూర్చోవలసిందే. ఇదీ హెచ్-4 వీసా కథ. కానీ 2015లో ఈ కథలో ఒక పెద్ద మలుపు చోటుచేసుకుంది.

ఒబామా ప్రభుత్వ హయాంలో ఏం జరిగిందంటే...

ఒబామా ప్రభుత్వ హయాంలో ఏం జరిగిందంటే...


2015లో ఒబామా ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత హెచ్‌-1బీ వీసాదారుల భాగస్వాములు, గ్రీన్‌కార్డు కోసం ఎదురుచూసే వారి భార్య/భర్తలు అమెరికాలోని వివిధ కంపెనీల్లో హెచ్‌-4 డిపెండెంట్‌ వీసాల కింద పనిచేసేందుకు అవకాశం కల్పిస్తూ ఓ విధానాన్ని తీసుకొచ్చారు. దీంతో హెచ్-4 వీసాపై అమెరికాలో తమ జీవిత భాగస్వాములతో కలిసి ఉంటున్న వారిని అదృష్టం వరించినట్లయింది. వారు కూడా వివిధ ఉద్యోగాల్లో చేరి ఎంతో కొంత సంపాదించడంతో అమెరికాలో జీవితం హాయిగా సాగిపోవడం మొదలైంది. దీనిని హెచ్-4 వర్క్ పర్మిట్ వీసా(హెచ్-4 ఈఏడీ)గా పిలిచేవారు. అమెరికా కొత్త అధ్యక్షుడు ట్రంప్ వలసదారుల కోసం తీసుకొచ్చిన కొత్త నిబంధనలతో మళ్లీ హెచ్-4 వర్క్ పర్మిట్ వీసాదారుల కల చెదిరిపోయింది.

హెచ్-4 వీసాదారులపైనా ట్రంప్ సర్కారు కన్ను...

హెచ్-4 వీసాదారులపైనా ట్రంప్ సర్కారు కన్ను...

హెచ్-1బీ వీసా నిబంధనలను కఠినతరం చేస్తున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడి కన్ను హెచ్-4 వర్క్ పర్మిట్ వీసాపై అమెరికాలో ఉంటూ ఉద్యోగాలు చేసుకుంటున్న హెచ్-1బీ వీసాదారుల భాగస్వాములపైనా పడింది. దీంతో ఆయన సర్కారు.. ఈ హెచ్-4 వీసాదారుల వ్యవహారంపైనా ఫిబ్రవరి 28కల్లా ఓ నిర్ణయాన్ని తీసుకుంటామని ప్రకటించింది. ఈ మేరకు డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ(డీహెచ్ఎస్) ఒక ప్రకటన విడుదల చేయడంతో మళ్లీ హెచ్-4 వీసాపై అమెరికాలో తమ జీవితభాగస్వాములతో కలిసి ఉంటూ ఉద్యోగాలు చేసుకుంటున్న వారి గుండెల్లో రాయి పడినట్లయింది. ట్రంప్ నిర్ణయంతో హెచ్-1బీ వీసాదారుల్లో కూడా తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. ఎందుకంటే, హెచ్-4 వర్క్ పర్మిట్ వీసాపై అమెరికాలో ఉంటోన్న తమ జీవిత భాగస్వాములు ఉద్యోగాలు కోల్పోతే వారు తిరిగి వారి స్వదేశాలకు వెళ్లిపోవాల్సిందే.

ట్రంప్ నిర్ణయం వాయిదాతో కాస్త ఊరట...

ట్రంప్ నిర్ణయం వాయిదాతో కాస్త ఊరట...

తాజాగా ట్రంప్ ప్రభుత్వం తన నిర్ణయాన్ని వాయిదా వేసుకుంది. దీంతో హెచ్4 వీసాదారుల (హెచ్-1బీ వీసాదారుల భాగస్వాములు) ఉద్యోగ అధికారం తొలగింపుపై ఇప్పుడే ఎటువంటి నిర్ణయం తీసుకోబోవడం లేదు అంటూ ఇటీవల డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోంలాండ్ సెక్యూరిటీ (డీహెచ్‌ఎస్) కోర్టుకు తెలియజేసింది. ఈ నిర్ణయం వల్ల కనిపించే ఆర్థికపరమైన ప్రభావంపై సమీక్షించి, జూన్‌కల్లా ఓ నిర్ణయాన్ని ప్రకటిస్తామని స్పష్టం చేసింది. గతంలో ఈ హెచ్-4 వీసాదారుల వ్యవహారంపై ఫిబ్రవరి 28కల్లా ఓ నిర్ణయాన్ని తీసుకుంటామని ప్రకటించిన ట్రంప్ సర్కారు దీన్నిప్పుడు జూన్ వరకు వాయిదా వేయడంతో హెచ్-1బీ వీసాదారుల భాగస్వాముల్లో నెలకొన్న ఆందోళన కొంత తగ్గింది. కానీ అమెరికా అధ్యక్షుడు ఏ క్షణంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో, అమెరికాలో ఉంచుతారో.. లేక స్వదేశానికి పొమ్మంటారో అనే గుబులు మాత్రం పూర్తిగా తొలగిపోలేదు.

1.5 మిలియన్ల భారతీయుల గాథ...

1.5 మిలియన్ల భారతీయుల గాథ...

ఇది కేవలం ఒక్క వినోద్ కథ మాత్రమే కాదు, హెచ్1-బీ వీసాపై అమెరికాలో ఉంటూ ఉద్యోగాలు చేస్తున్న 1.5 మిలియన్ల మంది భారతీయుల గాధ. వీరి భార్యలు ప్రస్తుతం హెచ్-4 వర్క్ పర్మిట్ వీసా( హెచ్-4 ఈఏడీ)పైనే అమెరికాలో తమ జీవిత భాగస్వాములతో కలిసి జీవిస్తున్నారు. వీరు గ్రీన్ కార్డు కోసం అప్లై చేసుకున్నప్పటికీ అది రావడానికి కనీసం 10-15 ఏళ్లపైనే పట్టవచ్చు. గ్రీన్ కార్డు వచ్చేస్తే.. ఇక వీరి జీవిత భాగస్వాములకు ఈ హెచ్-4 వర్క్ పర్మిట్ వీసా అవసరమే ఉండదు. గ్రీన్ కార్డు వచ్చే వరకు అమెరికాలో ఉండి ఉద్యోగం చేసుకోవాలంటే ఈ వీసా తప్పనిసరి. పైగా వీరి వీసా కూడా చట్టబద్ధమే. వీరేం చట్ట వ్యతిరేకంగా అమెరికాలో నివసించడం లేదు. కానీ ఇప్పుడు ఈ హెచ్-4 వీసాదారులపైనే అమెరికా అధ్యక్షుడి కన్ను పడింది. అంటే.. 1.5 మిలియన్ల భారతీయుల జీవితాలు అధ్యక్షులవారి గుప్పెట్లో ఉన్నాయన్నమాట!

English summary
A lot of H1B-led families tell us this of the chasm between the promise of an H1B and its dark side - the “cursed” H4 visa. That changed only in 2015, in the last leg of Obama’s second term. The Trump Administration has indicated in unambiguous language that it intends to revoke the H4 work permit (called H4 EAD). The fine print was to be released in February and has now been pushed to June but the damage is already being done, seeding conflict inside Indian families in the US, sparking stress in various forms and we’re hearing more and more cases of adverse affects on health.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X